ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంధి) క్యాన్సర్ అంటే ఏమిటి?
ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంధి) లో మాలిగ్నెంట్ (క్యాన్సర్ కలిగించేవి) కణాల అభివృద్ధి అనేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని పిలువబడుతుంది. ఇది పాంక్రియాస్లోని ఎక్స్కోక్రైన్ నాళాల భాగంలో (exocrine ducts) లేదా ఎండోక్రైన్ (endocrine, హార్మోన్- లేదా ఎంజైమ్-ఉత్పత్తి చేసే) భాగంలో సంభవించవచ్చు. ఇది మహిళల కంటే పురుషులలో ఎక్కువగా ఏర్పడుతుంది/సంభవిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎటువంటి నిర్దిష్ట/ప్రత్యేక సూచనలు చూపదు అందువలన అది చివరి దశలలో గుర్తించబడుతుంది. కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- వికారం.
- నడుము మరియు కడుపు నొప్పి.
- పిత్తాశయం లేదా కాలేయం యొక్క విస్తరణ/పెరుగుదల.
- ఆకలి తగ్గుదల.
- అజీర్ణం.
- మింగడంలో కఠినత.
- వాంతిలో రక్తం పడడం.
- వాంతులు.
- అలసట.
- జ్వరం మరియు వణుకు.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క కొన్ని లక్షణాలు కామెర్లు మాదిరిగానే ఉంటాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని పెంచే సాధారణ కారణాలు:
- మధుమేహం.
- కాలేయ గాయం.
- క్లోమము (ప్యాంక్రియాస్) యొక్క దీర్ఘకాలిక వాపు (దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్).
- కడుపులో ఇన్ఫెక్షన్.
- రక్తహీనత.
- హైపర్ గ్లైసీమియా.
- మద్య దుర్వినియోగం.
- ప్యాంక్రియాస్, కాలేయం లేదా కడుపుకు సంబంధించిన వారసత్వ వ్యాధులు.
- ఊబకాయం.
- పొగాకు వినియోగం లేదా ధూమపానం.
- అధిక కొవ్వు వినియోగం.
- రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్ యొక్క/ఉన్న కుటుంబ చరిత్ర.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు వివిధ పరీక్షల ద్వారా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను నిర్దారించవచ్చు:
- రక్త పరీక్షలు
కాలేయం ద్వారా ఉత్పత్తి అయిన బిలిరుబిన్ స్థాయిని గుర్తించడంలో రక్త పరీక్షలు సహాయపడతాయి. వీటి వలన కాలేయ పనితీరు లేదా కామెర్ల సంకేతాల గురించి వైద్యులకి అవగాహన కలుగుతుంది. అలాగే రక్త పరీక్షలు ప్యాంక్రియాటిక్ హార్మోన్లు మరియు ఎంజైమ్ల స్థాయిలను కూడా గుర్తించవచ్చు. - బయాప్సి (జీవాణుపరీక్ష)
ప్యాంక్రియాస్ లో క్యాన్సర్ కణాల ఉనికి యొక్క తనిఖీ కోసం. - అల్ట్రాసౌండ్
క్యాన్సర్ కణాల పరిమాణం మరియు వ్యాప్తిని అంచనా వేయడానికి. - సిటి (CT) స్కాన్
ఇది ప్యాంక్రియాస్ చుట్టూ ఉండే అవయవాలకు క్యాన్సర్ యొక్క విస్తరణని గుర్తించడంలో సహాయపడుతుంది . - ఎంఆర్ఐ (MRI)
పిత్తవాహిక (bile duct) మరియు ప్యాంక్రియాటిక్ నాళాలు యొక్క ఖచ్చితమైన/సరైన చిత్రాలను వైద్యులకు అందిస్తుంది. - ట్యూమర్ మార్కర్ పరీక్షలు (Tumour marker tests)
CA-19-9, మరియు కార్సినోఎంబ్రియోనిక్ యాంటిజెన్ (CEA, carcinoembryonic antigen) అనేవి కొన్ని ట్యూమర్ మార్కర్ .
రోగనిర్ధారణ తరువాత, వ్యాధికి ఈ విధంగా చికిత్స చేస్తారు:
- సర్జరీ
సాధ్యమైన చోట ఇది ఉత్తమమైన పద్ధతి. క్యాన్సర్ ఇతర భాగాలు ఎక్కువగా వ్యాపించనప్పుడు శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ కణాలు తొలగించబడతాయి. - కీమోథెరపీ
క్యాన్సర్ కణాలను చంపడానికి మందులు ఓరల్ (నోటిద్వారా) లేదా ఇంట్రావీనస్ మార్గంలో ఇవ్వబతాయి. దీనికి జుట్టు నష్టం, అలసట, గాయాలు, నోటి పుళ్ళు వంటి కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. - ఇతర విధానాలు
అబ్లేషన్ (కణితిని తొలగించటానికి బదులుగా క్యాన్సర్ కణాలను ధ్వంసం చేసే కొన్ని పద్ధతులు) యొక్క కొన్ని పద్ధతులు - క్రైయోసర్జరీ (cryosurgery), మైక్రోవేవ్ థర్మోథెరపీ (microwave thermotherapy), రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (RFA, radiofrequency ablation) మొదలైనవి.