అతిచురుకు మూత్రాశయ వ్యాధి (ఓవర్యాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్) అంటే ఏమిటి?
మూత్రాశయపు అతిచురుకుదనం (ఓవర్యాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్) రుగ్మతలో వ్యక్తి ఆకస్మికంగా ఆపుకోలేని మూత్రవిసర్జనకు ఉద్దీపన చెందుతాడు. ఇక మూత్రవిసర్జనకు పోయిరావాల్సిందే, వాయిదా వేయడానికి వీలులేనిది ఈ పరిస్థితి. రోజులో ఏ సమయంలోనైనా మూత్రవిసర్జనకు వెళ్లాలనే బలమైన కోరిక హఠాత్తుగా కల్గుతుంది. ఈ రుగ్మత చాలా సాధారణమైనది మరియు రోజువారీ జీవితంలో వ్యక్తుల్ని అసౌకర్యానికి గురిచేస్తుంది మరియు సాంఘిక పరిస్థితుల్లో ఇబ్బందికి కారణమవుతుంది.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అతిచురుకు మూత్రాశయ వ్యాధిలో క్రింది లక్షణాలను గుర్తించవచ్చు:
- మూత్రవిసర్జన చేయడానికి అత్యవసరం: మూత్రవిసర్జనకెళ్ళాల్సిన ఈ అత్యావశ్యకత నివారించలేనిది. వాయిదా వేయడం చాలా కష్టం. ఈ పరిస్థితి అసంకల్పితంగా మూత్రం (బట్టల్లోనే) కారేటందుకు దారి తీయవచ్చు, దీన్నే “అత్యవసర మూత్ర నిగ్రహరాహిత్యం” అని కూడా పిలుస్తారు.
- మూత్రవిసర్జన పౌనఃపున్యంలో (frequency) పెరుగుదల: అతిచురుకు మూత్రాశయము రుగ్మత సాధారణం కన్నా ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు పోవడానికి కారణం కావచ్చు. (మరింత సమాచారం: తరచూ మూత్రవిసర్జనకు కారణాలు మరియు నివారణ)
- నిద్రాభంగం: ఆకస్మిక మూత్రవిసర్జన కోరిక కారణంగా, వ్యక్తి రాత్రి సమయంలో కూడా అనేక సార్లు మేల్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతుంది. ఇది నిద్రకు ఆటంకాలు కలిగించవచ్చు.
- వ్యక్తి ఒత్తిడి లేదా ఆందోళన అనుభవిస్తున్నట్లయితే, అతిచురుకు మూత్రాశయ వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అతిచురుకు మూత్రాశయ వ్యాధి యొక్క అంతర్లీన కారణం మూత్రాశయం యొక్క కండరాలు ఎక్కువగా సంకోచించడం, ఇది తరచూ మూత్రవిసర్జన చేయడానికి వ్యక్తిని ప్రేరేపిస్తుంది. అయితే, ఈ కండరాలు అసాధారణంగా సంకోచించటానికి గల కారణం స్పష్టంగా తెలియదు.
ఈ రుగ్మత ఉన్న వ్యక్తులలో, మూత్రాశయం, వాస్తవానికి తాను పూర్తిగా మూత్రంతో నిండకుండానే, తాను మూత్రంతో పూర్తిగా నిండిపోయినట్లు మెదడుకు సూచించి మూత్రవిసర్జనకు ప్రేరేపిస్తుంది.
కొన్ని సందర్భాల్లో, కింద తెలిపిన మెదడు సంబంధిత వ్యాధుల ఫలితంగా అతిచురుకు మూత్రాశయ వ్యాధి రావచ్చు:
దీన్ని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
అతిచురుకు మూత్రాశయ వ్యాధిని నిర్ధారించడానికి వైద్యుడు సాధారణంగా వ్యాధి లక్షణాల గురించి ప్రశ్నిస్తాడు, తరువాత శారీరక పరీక్ష లేదా మూత్ర పరీక్షను ఉపయోగించి సంక్రమణ సంకేతాలను చూడడానికి ప్రయత్నిస్తాడు. మూత్రప్రవాహ బలాన్ని మరియు వ్యక్తి మూత్రవిసర్జనాకెళ్ళినపుడు మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేస్తున్నారా లేదా అనే దాన్ని అంచనా వేయడానికి ప్రవాహ పరీక్షను (flow test) కూడా చేయవచ్చు.
ఈ రుగ్మత చికిత్సలో మూత్రాశయ శిక్షణ ఉంటుంది, ఇది వ్యక్తికి మూత్రాశయం కదలికల మీద కొంత నియంత్రణను కలిగిఉండే సామర్త్యాన్నిస్తుంది మరియు మూత్రవిసర్జనకెళ్లాలన్న ఉత్తేజిత కోరికను జాప్యపరుస్తుంది. మందులు కూడా ఇవ్వవచ్చు, అయితే జీవనశైలి మార్పులు, కటిప్రాంతపు వ్యాయామాలు చేయడం, కెఫిన్సేవనం మరియు మద్యపానం నివారించడం మరియు అధిక బరువు కోల్పోవడం వంటి చర్యల్ని నిర్వహించడం ప్రధాన పాత్ర పోషిస్తాయి.
కొన్ని సందర్భాల్లో, శస్త్రచికిత్స సిఫారసు చేయబడవచ్చు.