ఆస్టియోపెట్రోసిస్ అంటే ఏమిటి?
పెరిగిన ఎముక సాంద్రతతో కూడిన ఓ అరుదైన ఎముకల వ్యాధి “ఆస్టియోపెట్రోసిస్”. ‘ఆస్టియో క్లాస్ట్స్’ అనబడే కణాల పునశ్శోషణలో లోపం కారణంగా సంభవించే రుగ్మతే ఈ ఆస్టియో పెట్రోసిస్ ఎముకలవ్యాధి. ఆస్టియో క్లాస్ట్స్ అనేవి ఎముక కణాలు, ఇవి ఎముకల్ని విరిచి రక్తంలో కాల్షియం విడుదల చేసి రక్త- కాల్షియం గాఢతను నిర్వహిస్తాయి. ఎముకలలో ఆస్టియో క్లాస్ట్స్’ కణాలు ఎక్కువగా పెరగడంతో ఎముకలు పెళుసుదనాన్ని సంతరించుకుని (ఎముకల) ఫ్రాక్చర్లకు గురవుతుంటాయి. ఇది సాధారణంగా ఎముక మాతృ కణాల (osteoblasts) యొక్క ఎముక-నిర్మాణ కార్యకలాపాల ద్వారా సమతుల్యమవుతుంది. ఈ ఆస్టియోపెట్రోసిస్ ఎముకల వ్యాధిలో, ఈ సంతులనానికి నష్టం జరిగి ఎముక సాంద్రత పెరగడానికి దారితీస్తుంది.
ఓ వ్యక్తిని దెబ్బ తీసే ఏడు వేర్వేరు రకాల ఆస్టియోపెట్రోసిస్లను వైద్యులు వివరించారు. ఈ వ్యాధిని “పాలరాయి ఎముక వ్యాధి” అని కూడా అంటారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పాత ఎముక విరగకుండా ఉండడంతో కొత్త ఎముక మాత్రమే ఏర్పడుతుండటంతో, ఎముక సాంద్రత క్రమక్రమంగా పెరుగుతుంది మరియు ఎముకలు నిర్మాణాత్మకంగా వైకల్యంతో ఉంటాయి. దీనివల్ల సంభవించే లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- శిశువుల్లో పెరుగుదల ఆలస్యమవుతుంది
- ఎత్తు తక్కువగా ఉంటారు
- తరచుగా దంతాల సంక్రమణలు/ఇన్ఫెక్షన్లు
- కాలేయ పెరుగుదల సంకేతాలు
- పునరావృత మూర్ఛలు
- తరచుగా సంభవించే ఎముక విరుగుళ్లు
- మేధో వైకల్యాలు
కొన్ని సందర్భాల్లో (ఎక్కువగా తేలికపాటి వయోజన ఆస్టియోపెరోసిస్లో గమనించవచ్చు), వ్యాధిలక్షణాలు గుర్తించబడకుండా పోతాయి లేదా స్వల్ప స్వల్పంగా ఉంటాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఆస్టియోపెట్రోసిస్ ఎముకల వ్యాధి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చే జన్యుపరమైన రుగ్మత. ఆస్టియోపెట్రోసిస్ ఎముక కణజాలములతో సంబంధం ఉన్న జన్యువులు ఆస్టియోక్లాస్ట్లుఅనబడే ఎముక కణాలు ఏర్పడటానికి బాధ్యత వహిస్తాయి. ఈ కణాలు ఎముక పునర్నిర్మాణం చేస్తాయి, ఈ ప్రక్రియలో పాత ఎముక స్థానంలో కొత్త ఎముక భర్తీ చేయబడుతుంది. ఈ ప్రక్రియ ఎముకలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండేందుకు నిరంతరంగా జరిగే ఒక సాధారణ మరియు నిరంతర ప్రక్రియ.
ఈ జన్యువులలోని ఉత్పరివర్తనలు అసాధారణమైన లేదా తప్పిపోయిన ఆస్టియోక్లాస్ట్ లు ఏర్పడటానికి కారణమవుతాయి. ఇవి (ఆస్టియోక్లాస్ట్ లు) చివరికి ఆస్టియోపెట్రోసిస్ ఎముకల వ్యాధికి కారణమవుతాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఎక్స్-రే, ఎముక సాంద్రత స్కాన్ డెక్సా (DEXA) స్కాన్ మరియు సిటి (CT) స్కాన్ వంటి ఇతర స్కానింగ్ పరీక్షలను నిర్వహించడం ద్వారా, వ్యక్తి యొక్క కుటుంబ చరిత్రను అంచనా వేయడం ద్వారా ఆస్టియోపెట్రోసిస్ ఎముకల వ్యాధి నిర్ధారణను వైద్యులు తయారు చేస్తారు, సిటి స్కాన్ ద్వారా అస్థి వైకల్యాలేవైనా ఉన్నట్లయితే వాటిని గుర్తించడానికి వీలవుతుంది.
నిర్ధారణను స్థిరీకరించేందుకు ఎముక జీవాను (బయాప్సీ) పరీక్ష చేయబడుతుంది.
ఈ రుగ్మత చికిత్సలో అవసరమైన కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఒక ఎముక మజ్జ మార్పిడి ఉంటుంది. కణాల ద్వారా ఎముక పునఃసృష్టిని ప్రోత్సహించడానికి మందులజీవనాన్ని కూడా నిర్వహించబడవచ్చు.