రికెట్స్ అంటే ఏమిటి?
రికెట్స్ అనేది విటమిన్ డి (D) మరియు కాల్షియం లోపం వల్ల కలిగే వ్యాధి. ఇది ఎముక ఆరోగ్యంతో పాటు పిల్లలు మరియు యుక్తవయసుల వారిలో పెరుగుదల మరియు అభివృద్ధి మీద కూడా అధిక ప్రభావాన్ని చూపిస్తుంది, ఇది మృదువైన, బలహీనమైన మరియు నొప్పితో కూడిన ఎముకల వృద్ధిని మరియు ఎముకల వైకల్యాలు కలిగిస్తుంది. ఇది ప్రాణాంతకమైనదిగా కూడా నిరూపించబడింది. ఈ పరిస్థితి పిల్లలలో సంభవిస్తే దానిని రికెట్స్ అని మరియు పెద్దలలో సంభవిస్తే దానిని ఆస్టియోమలేషియా (osteomalacia) అని పిలుస్తారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ముందుగా సంభవించే ఆరోగ్య సంకేతాలు మరియు లక్షణాలు ఎముక నొప్పి, స్కెలిటల్ (అస్థిపంజర) వైకల్యాలు, దంత సమస్యలు, కాస్టోకోండ్రల్ జంక్షన్ల [costochondral junctions] (రొమ్ము ఎముకకు పక్కటెముకలు అతుక్కునే ప్రదేశం), ఇవి ఎముకల అభివృద్ధి వేగవంతముగా ఉండే ప్రదేశాలు, ముంజేయి మరియు మోకాలు పెరుగుదల సరిగ్గా లేకపోవడం మరియు ఎముకలు పెళుసుగా మారిపోతాయి. ఫాంటనెల్స్ (fontanelles, శిశువు యొక్క తలపై ఉండే మృదువైన ప్రదేశం) మూసుకోవడంలో ఆలస్యం మరియు శిశువులలో స్కల్ బోన్స్ (పుర్రె ఎముకలు) ముందుకు ఉబికి వచ్చినట్లు కనిపిస్తుంది. పెద్ద పిల్లలలో గూని (kyphosis) లేదా పక్క గూని (scoliosis, వెన్నెముక ముందుకు లేదా పక్కకి వంగుతుంది) ఉండవచ్చు. స్కెలిటన్ కి సంబంధించిన లక్షణాలు కాకుండా నొప్పి, చిరాకు, నరాలకు సంబందించిన పనులలో ఆలస్యం మరియు పెరుగుదల లేకపోవడం వంటివి ఉంటాయి. కొన్నిసార్లు రికెట్స్ను స్కెలిటల్ డిస్ప్లేసియాలా పొరపాటు పడవచ్చు, ఎందుకంటే అవి ఇలాంటి లక్షణాలనే కలిగి ఉంటాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
విటమిన్ D మరియు కాల్షియం లోపం అనేది రికెట్స్ యొక్క అత్యంత సాధారణ కారణం. ఈ లోపాలకు సాధారణ కారణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి
- పోషకాహార లోపం.
- విటమిన్ D ని సరిగ్గా శోషించలేకపోవడం
- చర్మానికి సూర్యకాంతి సరిగ్గా అందకపోవడం.
- గర్భం.
- ముందుగా యుక్తవయసు రావడం (Prematurity)
- ఊబకాయం.
- కిడ్నీ మరియు కాలేయ వ్యాధులు.
- కొన్ని యాంటీకన్వల్సేంట్స్ (మూర్ఛ కోసం) లేదా యాంటిరెట్రోవైరల్ (హెచ్ఐవి కోసం) మందులు.
కాల్షియం మరియు ఫాస్ఫేట్ లోపం కారణంగా ఏర్పడిన ఖనిజలీకరణ (mineralisation) లోపాలు అవి కేల్షిపేనిక్ మరియు ఫాస్ఫోపేనిక్ రికెట్స్ గా వర్గీకరించబడ్డాయి. మినరలైజేషన్ లోపము విటమిన్ డి లోపం వలన లేదా అదే ప్రత్యేకించి సంభవించవచ్చు, ఇది ఎముక కణజాలంలో గ్రోత్ ప్లేట్ (growth plate) క్రింద ఓస్టియోయిడ్ (ఒక మినరల్స్ లేనటువంటి పదార్థం) చేరికకు దారితీస్తుంది. ఇది ఎముకలను బలహీనపరచి మరియు కొంత కాలానికి వాటిని వొంగిపోయేలా చేస్తుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
కాల్షియం, విటమిన్ డి స్థాయిలు, ఆల్కలీన్ ఫాస్ఫాటేస్ (alkaline phosphatase), ఫాస్పరస్ మరియు పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయిలు కోసం రక్త పరీక్షలతో సహా కొన్ని ప్రయోగశాల పరీక్షలు విటమిన్ డి లోపం యొక్క నిర్ధారణ కోసం చేస్తారు. ఎముకలలో మార్పులు చూడడానికి ఎక్స్-రే పరీక్షలు ఆదేశించబడతాయి. ఎముక యొక్క బయాప్సీ అవసరమవుతుంది ఇది ఆస్టియోమలేసియా (osteomalacia) లేదా రికెట్స్ను నిర్ధారించడానికి ఒక ఖచ్చితమైన పద్ధతి.
లోపం యొక్క స్థితి మరియు తీవ్రతను బట్టి విటమిన్ డి యొక్క సరైన మోతాదును నిర్ణయిస్తారు. ఎక్స్- రే ఫలితాలు సాధారణంగా వచ్చే వరకు విటమిన్ డి మరియు కాల్షియం సప్లీమెంట్లు నిర్వహించబడతాయి/అందించబడతాయి.
నివారణ చర్యలు:
అనేక సాధారణ చర్యలు రికెట్స్ ను నివారించడంలో సహాయం చేస్తాయి. వాటిలో కొన్ని:
- పాల ఉత్పత్తులు మరియు గుడ్లు కలిగి ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
- వెలుపల గడపాలి, ముఖ్యంగా ఉదయం వేళా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
- వైద్యుడిని సంప్రదించిన తరువాత మాత్రమే విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి.