పోషకాహార లోపం అంటే ఏమిటి?
మంచి ఆరోగ్యం మరియు పనితీరు కోసం శరీరానికి తగిన పోషణ అవసరం. విటమిన్లు మరియు ఖనిజాలు మరియు ఎమినో ఆమ్లము వంటి సూక్ష్మపోషకాలు కూడా మంచి ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి, అయితే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు వంటి సూక్ష్మపోషకాల నుండి మనం ఈ పోషకాల్ని పొందుతాము. శరీరం తగినంత పోషకాన్ని అందుకోకపోతే కలిగే పరిస్థితినే “పోషకాహార లోపం” అంటారు. ఇది ప్రపంచ సమస్య అయినప్పటికీ, ప్రపంచంలోని సూక్ష్మపోషకాహార లోపం జనాభాలో దాదాపు సగం భారతదేశంలోనే ఉంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అనేక పోషకాల్లో ఏదేని ఒక పోషకాహార లోపం కల్గినా అది కూడా పోషకాహార లోపం కిందికే వస్తుంది. అందువల్ల ఒక నిర్దిష్ట పోషకాహార లోపంవల్ల కలిగే వ్యాధి లక్షణాలు కూడా ఆ పోషక లోపానికి సంబంధించినవే అయి ఉంటాయి. మన రోజువారీ కార్యకలాపాలలో ఈ పోషకాహార సంకేతాలు మరియు వ్యాధి లక్షణాలను చూడవచ్చు. పోషకాహార లోపం యొక్క సాధారణ లక్షణాలు కొన్ని ఇలా ఉంటాయి:
- అలసట
- బరువు తక్కువ
- రక్తహీనత
- కండరాల తిమ్మిరి
- జుట్టు ఊడుట
- పాలిపోయిన చర్మం
- నోటిలో పూతలు
- వేళ్లు లో తిమ్మిరి
- మానసిక అనారోగ్యము
- పెళుసైన లేక సున్నితమైన ఎముకలు
- రేచీకటి లేదా దృష్టిని కోల్పోవడం
- మూర్ఛలు
- థైరాయిడ్ గ్రంధి వాచే ‘గాయిటర్’ వ్యాధి
- మలబద్ధకం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పోషకాహార లోపం ప్రధాన కారణాలు:
- సరిపోని ఆహారం, పోషకాలు లేని ఆహారం
- శరీరంలో పోషకాల యొక్క అసంపూర్ణ శోషణ
- పెద్దప్రేగు కాన్సర్
- క్రోన్స్ వ్యాధి (పేగువాపు)
- పేగుల్లో అసమతుల్య సూక్ష్మజీవుల ఉనికి (Imbalanced gut flora)
- కడుపు వ్యాధి
- జీర్ణ వ్యవస్థలో వాపు
- మందులు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
పోషకాల లోపము వలన అనేక రోగాలు సంభవించవచ్చు, అందువల్ల రోగ నిర్ధారణ చాలా ముఖ్యం. ప్రధానంగా, రోగి యొక్క వైద్య చరిత్ర గుర్తించబడుతుంది మరియు క్రింది పరీక్షలు నిర్వహిస్తారు:
- శారీరక పరిక్ష.
- శరీర ద్రవ్యరాశి సూచిక (బాడీ మాస్ ఇండెక్స్) యొక్క నిర్ధారణ.
- రక్తంలో విటమిన్లు మరియు ఖనిజాల గాఢతను కనుగొనేందుకు రక్త పరిశోధన.
- అల్ట్రాసౌండ్ పరీక్ష.
పోషకాహార లోపానికి సంబంధించిన చికిత్స పద్ధతులు లోపం యొక్క రకంపై ఆధారపడి ఉంటాయి. చికిత్స నియమావళి క్రింది విధంగా ఉంటుంది:
- మౌఖిక లేదా పేరెంటల్ మార్గం ద్వారా పోషక అనుబంధకాహార పదార్ధాలనివ్వటం.
- అవసరమైనప్పుడు లోపం చికిత్సకు మరియు అంతర్లీన కారణం చికిత్సకు మందులు.
- ఆహారాల్ని పోషకాలతో బలవర్ధకం చేయడం.
అనేక పోషక లోపాలు గుర్తించబడవు మరియు అవి తీవ్రంగా మారినప్పుడు మాత్రమే నిర్ధారణ అవుతాయి, కనుక ప్రారంభ రోగనిర్ధారణ ముఖ్యమైనది, మరియు పోషకలోపానికి సంబంధించిన ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమతుల్య ఆహారం ప్రణాళిక మరియు పౌష్టికాహార పదార్ధాలు పోషకాహార లోపాలను అధిగమించడానికి మరియు మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి సహాయపడతాయి. ప్రభుత్వ విద్య మరియు జాతీయ ఆరోగ్య విధానాలు వంటి ప్రభుత్వ ప్రయత్నాలు బలవర్దక ఆహార ఉత్పత్తులను అందించడానికి మరియు సమతుల్య ఆహారం అందించడానికి మరియు పోషక లోపాలను నివారించడానికి కూడా సహాయపడతాయి.