నాన్ అలెర్జిక్ రినైటిస్ అంటే ఏమిటి?
నాన్ అలెర్జిక్ రినైటిస్ అంటే ముక్కు లోపల వాపు లేదా కందడం, ఇది ఏ అలెర్జీ పదార్థాల/కారకాల వల్ల కలగదు. పొగ, వాతావరణ/వాయు పీడనం (atmospheric pressure) లో మార్పులు, పొడి గాలి, ఇన్ఫెక్షన్లు మొదలైనటువంటి అనేక అలెర్జిక్ కాని (non-allergic) కారకాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి యొక్క మెకానిజం (జీవక్రియ) అలెర్జీ ప్రతిస్పందన కారణాన్ని కలిగి ఉండదు, కానీ వాపు కారణంగా ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నాన్ అలెర్జిక్ రినైటిస్ సంభవించిన వ్యక్తిలో ఈ క్రింది లక్షణాలు ఉండవచ్చు:
- ముక్కు నిరోధించబడడం
- ముక్కు లోపల మరియు ముక్కు చుట్టూ చికాకు మరియు అసౌకర్యం
- తుమ్ములు అధికమవ్వడం
- ముక్కు నుండి నీరుగల స్రావాలు కారడం
- వాసన మరియు రుచి యొక్క భావన తగ్గిపోవడం
- ఆకలి తగ్గిపోవడం
సాధారణంగా ముక్కు, గొంతు మరియు కళ్ళలో దురదలు అలెర్జిక్ రినైటిస్లో కనిపిస్తాయి. అయితే, అరుదుగా ఈ లక్షణాలు నాన్ అలెర్జిక్ రినైటిస్ కలిగిన వ్యక్తులలో కూడా కనిపిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పరిస్థితి యొక్క ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉన్నప్పటికీ, వివిధ నాన్ అలెర్జిక్ కారకాలు నాన్ అలెర్జిక్ రినైటిస్ అభివృద్ధికి కారణమవుతాయి, అవి:
- గాలి కాలుష్యం
- మద్యపానం
- ఘాటుగా ఉండే ఆహారం
- ఐబూప్రోఫెన్ (ibuprofen) మరియు ఆస్పిరిన్ (aspirin) వంటి కొన్ని మందులు
- పొడి వాతావరణం
- పెర్ఫ్యూమ్లు (పరిమళద్రవ్యాలు) మరియు బ్లీచింగ్ ఎజెంట్ల వాసన వంటి బలమైన వాసనలు
- బాక్టీరియల్ మరియు వైరల్ సంక్రమణలు/ఇన్ఫెక్షన్లు
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఈ పరిస్థితిని గుర్తించడానికి వైద్యులు ఈ క్రింద ఉన్న నిర్దారణ చర్యలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని ఉపయోగించవచ్చు:
- శారీరక పరిక్ష.
- ఈ పరిస్థితికి కారణమయ్యే అలెర్జీ కారకాన్ని గుర్తించడానికి చర్మ పరీక్షలు. ఇది అలెర్జీక్ రినైటిస్ యొక్క సంభావ్యతను నిర్ములిస్తుంది.
- ఇమ్యునోగ్లోబులిన్ E యొక్క స్థాయిలను గుర్తించడానికి రక్త పరీక్ష, ఇది (ఇమ్యునోగ్లోబులిన్ E) అలెర్జీకి ప్రతిస్పందనగా రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ఒక యాంటీబాడీ. రక్తంలో ఎసినోఫిల్ సంఖ్యను [eosinophil count](తెల్ల రక్త కణాల యొక్క ఒక రకం) ను గుర్తించడానికి పూర్తి రక్త గణన (CBC, complete blood count) సహాయపడుతుంది, ఇది అలెర్జీ యొక్క మరొక సూచిక. అందువల్ల, రక్త పరీక్ష అలెర్జిక్ ప్రతిచర్యల యొక్క సంభావ్యతను నిర్ములిచడంలో సహాయపడుతుంది.
నాన్ అలెర్జిక్ రినైటిస్ చికిత్సలో కారణాన్ని నివారించడం మరియు పరిస్థితి యొక్క లక్షణాలకు ఉపశమనం కలిగించడం వంటివి ఉంటాయి.
- మందుల కారణంగా అయితే, వైద్యులు వేరే ప్రత్యామ్నాయ మందులను సూచించవచ్చు.
- నేసల్ డికాంగిస్టెంట్స్ (decongestants) యొక్క అధిక వినియోగం పరిస్థితికి దారితీసినట్లయితే, దానిని ఉపయోగించడం మానివేయాలి.
- ముక్కు శుభ్రం చేయడానికి సెలైన్ తో నేసల్ ఇరిగేషన్ (నీటిని అధికంగా ఉపయోగించి) చెయ్యడం.
- కార్టికోస్టెరాయిడ్, డికాంగిస్టెంట్స్, యాంటికోలినెర్జిక్ (anticholinergic), లేదా యాంటిహిస్టినమిక్ నేసల్ స్ప్రేలు ముక్కు నిరోధాన్ని పరిష్కరించడానికి ఉపయోగిస్తారు.