నోకార్డియోసిస్ అంటే ఏమిటి?
నోకార్డియోసిస్ అంటే మట్టి మరియు నీటిలో ఉండే ఒకరకమైన బాక్టీరియా వల్ల సంభవించే అంటువ్యాధి, ఇది ఊపిరితిత్తుల, మెదడు మరియు చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. నోకార్డియోసిస్ లో రెండు రకాలు ఉంటాయి:
- ఊపిరితిత్తుల (పల్మనరీ) రకం ఇది బ్యాక్టీరియాను పీల్చడం ద్వారా సంభవిస్తుంది.
- ప్రాథమిక చర్మ (క్యూటేనియస్) రకం బహిరంగ గాయాల/పుండ్ల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వలన సంభవిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నోకార్డియోసిస్ వలన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్/సంక్రమణ సోకినట్లయితే అప్పుడు రోగి ఈ క్రింద లక్షణాలు అనుభవించవచ్చు:
- జ్వరం
- బరువు తగ్గుదల
- రాత్రి చెమటలు
- దగ్గు
- ఛాతి నొప్పి
- న్యుమోనియా
మెదడు లేదా వెన్నుపాము ప్రభావితం అయితే:
- తలనొప్పి
- బలహీనత
- గందరగోళం
- మూర్చ/ఫీట్స్
నోకార్దియోసిస్ వలన చర్మం ప్రభావితం ఐతే ఈ క్రింది లక్షణాలను గమనించవచ్చు:
- చర్మం పై పుండ్లు
- బొడిపెలు
దీనిని ప్రధాన కారణాలు ఏమిటి?
నోకార్దియోసిస్, నోకార్డియా ఆస్టెరోయిడ్స్ (Nocardia asteroides) అనే బ్యాక్టీరియా వలన సంభవించే ఒక సంక్రమణం/ఇన్ఫెక్షన్. కేవలం ఈ బ్యాక్టీరియా ఉన్న మట్టి పై ఉండే గాలిని పీల్చుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడవచ్చు. శరీరంలోకి ఈ బాక్టీరియా యొక్క ఇతర జాతులు బహిరంగ గాయాలు/పుండ్ల ద్వారా ప్రవేశించవచ్చు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఈ సంక్రమణను పొందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, క్యాన్సర్, హెచ్ఐవి (HIV) సంక్రమణతో బాధపడుతున్న వ్యక్తులు, ఇమ్మ్యూనోసప్రెసెంట్ థెరపీ తీసుకునేవారు. వ్యాధి వేగంగా ఇతర అవయవాలు, ముఖ్యంగా మెదడుకు వ్యాపిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
శారీరక పరీక్ష మరియు వివరణాత్మక చరిత్ర తీసుకోవడం వంటివి ఇన్ఫెక్షన్ సోకిన ఊపిరితిత్తుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కఫం మరియు ఊపిరితిత్తులలోని ద్రవం యొక్క బాక్టీరియా సాగు పరీక్షలు (culture tests of the sputum and lungs fluid) పాజిటివ్ గా వస్తే బాక్టీరియా యొక్క సంక్రమణ నిర్దారించవచ్చు. నిర్ధారణను ధృవీకరించడానికి ఛాతీ ఎక్స్-రే మరియు CT స్కాన్ నిర్వహించబడుతుంది.
నోకార్దియోసిస్ చికిత్స కోసం, సల్ఫోనమైడ్లు (sulphonamides) సూచించబడతాయి. చికిత్స చాలా వారాల పాటు కొనసాగుతుంది. చికిత్స కోసం ఐమీపెనిమ్ (imipenem) మరియు సెలస్టాటిన్(cilastatin), మీరోపెనిమ్ (meropenem), సెఫాటాక్సిమ్ (cefotaxime), సెఫ్ట్రయసోన్ (ceftriaxone), ఎంఫిసెలిన్ (ampicillin), మినొసైక్లిన్ (minocycline), మరియు అమికాసినన్ (amikacin) వంటి ఇతర మందులు కూడా ఉన్నాయి.
రోగికి రోగసంబంధమైన మరియు సరైన చికిత్సను ఇవ్వాలి, ఈ వ్యాధికి సమయానుకూలంగా చికిత్స చేయకపోతే ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.