రేచీకటి అంటే ఏమిటి?
రాత్రి సమయంలో లేదా తక్కువ కాంతిలో దృష్టి బలహీనత ఏర్పడి కన్నులు సరిగా కనబడకపోవడాన్నే “రేచీకటి” అంటారు, ఇది విటమిన్ ‘ఎ’ లోపం యొక్క మొదటి వైద్య లక్షణం. మరియు తక్కువ సీరం-రెటినోల్ స్థాయిల యొక్క నిర్దిష్ట మరియు బలమైన సూచిక ఇది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వైద్య సంకేతాలు మరియు వ్యాధి లక్షణాలు మబ్బుకాంతిలో బలహీనమైన దృష్టి, రాత్రి మోతరువాహనం నడపడంలో కష్టపడడం మరియు తేలికపాటి కంటి అసౌకర్యం. రేచీకటి ప్రారంభ సంకేతాలు తక్కువ సీరం-రెటినోల్ సాంద్రతలు (1.0 మైక్రోమోల్ / లీటరు) మరియు బిటొట్ యొక్క మచ్చలు వలన చీకటికి బలహీనమైన దృష్టి సామర్థ్యము. ఈ మచ్చలు ప్రత్యేకంగా విటమిన్ ఎ లోపం రుగ్మతలోనే కనిపిస్తాయి మరియు త్రిభుజాకారంలో పొడిగా, తెల్లగా, నురుగుతో కూడిన గాయాలు కంటి యొక్క వెలుపలివైపు (బయటి) కనిపిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కంటి లోపల, విటమిన్ ‘ఎ’ రోడోప్సిన్ ను ఉత్పత్తి చేయడానికి ‘ఒప్సిన్’ అని పిలువబడే పదార్థంతో మిళితం అవుతుంది. రోడోప్సిన్ అనేది కడ్డీల (rods)లోని కాంతిగ్రాహక (ఫోటోసెన్సిటివ్) దృష్టి వర్ణం. మన కళ్ళకు రెండు రకాల కాంతి గ్రాహకాలున్నాయి, అవే: కడ్డీలు (రాడ్లు) మరియు శంకువు (cones)లు. రాడ్లు తక్కువ కాంతి లో కూడా దృష్టినిస్తాయి కానీ మనకు రంగుల దృష్టిని ఇవ్వవు. శంకువులు ప్రకాశవంతమైన కాంతిలో మాత్రమే పని చేస్తాయి మరియు మనకు రంగులతో కూడిన దృష్టినిస్తాయి. రోడోప్సిన్ స్థాయిలు తగ్గుతాయి మరియు ఇది వాటి పనితీరును బలహీనపరుస్తుంది, ఈ పరిస్థితే ‘రేచీకటి’ అనే “రాత్రి అంధత్వం” జబ్బుకు దారి తీస్తుంది.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో, పోషకాహారలోపం కారణంగా విటమిన్ ‘ఎ’ లోపం మరింత ప్రబలంగా ఉంటుంది, తర్వాత అపశోషణం (malabsorption) ప్రబలంగా ఉంటుంది. ఇలాంటిదే ఓ పరిస్థితి “రెటినిటిస్ పిగ్మెంటోసా”, ఇది విటమిన్ ఎ లోపం కారణంగా ఏర్పడదు. రెటినిటిస్ పిగ్మెంటోసా అనేది జన్యువులలో ఓ దోషం వల్ల సంభవించిన కారణంగా వారసత్వంగా వచ్చే రేచీకటి.
రేచీకటి వ్యాధిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
రేచీకటి యొక్క రోగ నిర్ధారణ వైద్యప్రక్రియల యొక్క ఫలితాలు మరియు వైద్య చరిత్ర ద్వారా చేయబడుతుంది. తర్వాత తక్కువ సీరం విటమిన్ A స్థాయిల ద్వారా ధృవీకరించబడుతుంది, బిటోట్ యొక్క మచ్చలు మరియు అసాధారణమైన ఎలెక్ట్రోరెటినోగ్రఫీ పరీక్ష తగ్గిపోయిన రాడ్ పనితీరును సూచిస్తుంది.
ఈ వ్యాధికారక లోపానికి 2,00,000 IU ల విటమిన్ ‘ఏ’ ని 3 రోజులుపాటు ప్రతిరోజూ ఓరల్ (కడుపుకు తినే మందుగా)గా ఇవ్వబడుతుంది, అటుపై 50,000 IU లను 14 రోజుల పాటు, లేదా 1-4 వారాల పాటు అదనపు మోతాదుతో విజయవంతంగా అనుసరించడం జరుగుతుంది. విటమిన్ ‘ఎ’ ని కల్గి ఉండే ప్రధాన ఆహార వనరులు మొక్కల వనరులు- అమరాంత్, క్యారెట్లు, బెల్ పెప్పర్ (లేక క్యాప్సికమ్ సీమ మిరపకాయ), సిట్రస్ పండ్లు, బొప్పాయి, మామిడి మరియు ఇతర ఎరుపు-పసుపు పండ్లు మరియు కూరగాయలు వంటివి. గుడ్లు మరియు వెన్న వంటి జంతువు వనరులు కూడా విటమిన్ ‘ఎ’ ని పుష్కలంగా కల్గి ఉంటాయి. మౌఖికంగా మందులను తీసుకోలేని వారికి, ఇంట్రాముస్కులర్ గా విటమిన్ ‘ఎ’ మందులు ఇవ్వబడతాయి. విటమిన్ ఎ లోపం స్వభావంలో దైహికమైనది కాబట్టి, కంటి చుక్కల మందు ఎటువంటి ప్రయోజనాలను ఇవ్వదు.