న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అంటే ఏమిటి?
న్యూరోఎండోక్రైన్ ట్యూమర్లని కూడా కార్సినోయిడ్స్ (carcinoids) అని కూడా పిలుస్తారు, ఇవి హార్మోనులను విడుదల చేసే కణాల అలాగే నరాల యొక్క లక్షణాలను కలిగి ఉండే న్యూరోఎండోక్రైన్ కణాల యొక్క కణితులు/ట్యూమర్లు. సాధారణంగా ఈ కణితుల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఇవి శరీరంలో ఏ అవయవంలోనైనా అభివృద్ధి చెందగలవు. ఇవి ప్రాణాంతమైనవి [malignant ] (క్యాన్సరస్) లేదా నిరపాయమైనవి [benign] (క్యాన్సర్ కానివి).
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కణితి/ట్యూమర్ యొక్క స్థానాన్ని బట్టి, లక్షణాలు మారుతూ ఉండవచ్చు. కణితి యొక్క స్థానంతో సంబంధం లేకుండా సంభవించే కొన్ని సాధారణ లక్షణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- ఎరుపుదనం/ఎర్రబారడం (చెమట పట్టకుండా ముఖం లేదా మెడ మీద ఎర్రబారడం)
- అతిసారం
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- అధిక రక్తపోటు
- అలసట, బలహీనత
- కడుపు నొప్పి,తిమ్మిరి, కడుపు నిండుగా ఉన్న భావన
- అధికంగా బరువు పెరుగుట లేదా తగ్గుట
- శ్వాసలో గురక శబ్దం, దగ్గు
- పాదములు మరియు చీలమండల వాపు
- చర్మ గాయాలు, చర్మం మీద కందిన మచ్చలు
- అధిక లేదా తక్కువ రక్త గ్లూకోజ్ స్థాయిలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
న్యూరోఎండోక్రైన్ కణితుల/ట్యూమర్ల యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. క్రింద ఇవ్వబడిన వారసత్వంగా సంక్రమించే సమస్యలు ఏదోఒకటి వ్యక్తికి ఉంటే కనుక, న్యూరోఎండోక్రైన్ కణితి/ట్యూమర్ యొక్క ప్రమాదం పెరుగుతుంది.
- ముల్టీపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 1 (Multiple endocrine neoplasia type 1)
- న్యూరోఫైబ్రోమెటోసిస్ టైప్ 1 (Neurofibromatosis type 1)
- వాన్ హిప్పెల్-లిండౌ సిండ్రోమ్ (Von Hippel-Lindau syndrome)
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
న్యూరోఎండోక్రిన్ వ్యాధి నిర్ధారణను ఈ క్రింది పరీక్షల ద్వారా చేయవచ్చు:
- రక్త పరీక్షలు
- కణజాలపు జీవాణుపరీక్ష (Biopsy of tissue)
- జన్యు పరీక్ష (Genetic testing) మరియు కౌన్సెలింగ్
- స్కాన్లు వీటిని కలిగి ఉంటాయి:
- అల్ట్రాసౌండ్
- కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (CT)
- మేగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (MRI)
- పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET)
- అక్ట్రియోటైడ్ స్కాన్స్ (Octreotide scans) - ఈ స్కాన్ లో ఒక తేలికపాటి రేడియో ఆక్టివ్ ద్రవాన్ని నరాలలోకి ఎక్కించి తర్వాత కెమెరాను ఉపయోగించి క్యాన్సర్ కణాల ఉనికిని గుర్తిస్తారు
- లాప్రోస్కోపీ (Laparoscopy)
- న్యూక్లియర్ మెడిసిన్ ఇమేజింగ్ (Nuclear medicine imaging)
న్యూరోఎండోక్రైన్ వ్యాధి యొక్క చికిత్స కణితి స్థానం, తీవ్రత మరియు రోగి యొక్క పూర్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్సలు క్రింది విధంగా ఉంటాయి:
- శస్త్రచికిత్స: ఒకే స్థానంలో ఉన్న కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు, ఇది చికిత్స యొక్క మొదటి మార్గంగా పరిగణించబడుతుంది.
- కీమోథెరపీ, హార్మోన్ థెరపీ మరియు / లేదా టార్గెటెడ్ థెరపీలను క్లిష్టమైన లేదా తీవ్రమైన న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ల చికిత్సకు ఉపయోగిస్తారు.
- మందులు: సోమాటోస్టాటిన్ అనలాగ్లు [Somatostatin analogues] (అక్ట్రియోటైడ్ [octreotide] లేదా లెన్రియోటైడ్ [lanreotide]) అనేక హార్మోన్లను పెరుగుదలను ఆపుతాయి మరియు లక్షణాల తీవ్రతను తగ్గించి వ్యాధి పురోగతిని నివారిస్తాయి.
- రేడియోథెరపీ: ఎక్స్- రేలను లేదా గామా రేలను (gamma rays) ఉపయోగించి కణితికి రక్తం సరఫరాను అడ్డుకోవడం ద్వారా దాని పరిమాణాన్ని తగ్గించడం లేదా పెరుగుదలను ఆపడంలో సహాయపడుతుంది.