నరాల బలహీనత అంటే ఏమిటి?
మన శరీరంలో సంకేతాల ప్రసారానికి నరాలు బాధ్యత వహిస్తాయి. నరాల రుగ్మతలు లేదా నరాలకయ్యే గాయాలు నరాల సాధారణ పనిని దెబ్బతీస్తాయి, అదే నరాల బలహీనతకు దారి తీస్తుంది. నరాల బలహీనత రుగ్మత మన శరీర భాగాల విస్తృత పనితీరును దెబ్బ తీస్తుంది, తద్వారా నరవైకల్య పరిస్థితులు దాపురిస్తాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నరాల బలహీనత యొక్క ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- నొప్పి
- పొడిచినట్లుండడం లేక చక్కిలిగింత ఉన్నట్లుండడం
- తిమ్మిరి
- అనుభూతి జ్ఞానాన్నికోల్పోవడం
- అలసట
- కండరాల బలహీనత
- ఫుట్ డ్రాప్ (పాదం ముందు భాగాన్నిపైకెత్తాలంటే వీల్లేని అసమర్ధత)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
నరాల బలహీనతకు అనేక కారణాలు ఉండవచ్చు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- నరాల గాయం
- మధుమేహం
- హెచ్ఐవి (HIV) సంక్రమణ
- మల్టిపుల్ స్క్లేరోసిస్
- క్యాన్సర్ చికిత్స
- కణితి లేదా వాస్కులేచర్ (రక్త నాళాలు) కారణంగా నాడీ సంపీడనం
- పార్కిన్సన్స్ వ్యాధి
- స్ట్రోక్
- కుష్టు వ్యాధి
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు నాడీ వ్యవస్థ యొక్క ప్రమేయాన్ని సూచిస్తాయి. అయినప్పటికీ, నరాల బలహీనత యొక్క వ్యాధి లక్షణాలు చాలా నిర్దిష్టమైనవి కాదు; అందువల్ల వైద్యపర నిర్ధారణ (క్లినికల్ డయాగ్నొసిస్) చాలా కీలకమైనది. రోగి వైద్య చరిత్ర, కుటుంబం చరిత్ర, మరియు వృత్తి చరిత్రల గురించి అధ్యయనం చేయటం వలన డాక్టర్కు వ్యాధి యొక్క ముఖ్యమైన సమాచారాన్ని అందించవచ్చు, ఇది అంతర్లీన కారణాన్ని నిర్ధారణ చేయడంలో సహాయపడుతుంది. క్రింది రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు:
- ఎలెక్ట్రో డయాగ్నగ్నోస్టిక్ పరీక్షలు
- జ్ఞాన మరియు మోటార్ నరాల ప్రసరణ
- ఎఫ్ (F) ప్రతిస్పందన
- హెచ్ (H) రిఫ్లెక్స్
- నీడిల్ ఎలెక్ట్రోమయోగ్రఫీ
- రక్త పరిశోధన (బ్లడ్ ఇన్వెస్టిగేషన్)
- రోగనిరోధక రుగ్మతలు (ఆటోఇమ్యూన్ డిజార్డర్స్)
- హెచ్ఐవి
- సియస్ఎఫ్ (CSF) పరీక్ష (సెరెబ్రోస్పైనల్ ద్రవం)
నరాల బలహీనత అనేది ఒకటి లేదా మరిన్ని అంతర్లీన పరిస్థితులు లేదా వ్యాధుల ఫలితంగా సంభవిస్తుంది. అందువల్ల, చికిత్స ప్రధానంగా వ్యాధికి కారకమైన అంతర్లీన పరిస్థితుల లేకవ్యాధుల్ని నయం చేయడంపై దృష్టి పెడుతుంది. ఇందుగ్గాను కింది చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:
నొప్పిని నియంత్రించే మందులు:
- నల్లమందు
- నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDS)
- క్యాప్సైసిన్ పాచెస్
- నైరాశ్య నిరోధకాల.
- నరాల మరమ్మత్తు మరియు ప్రేరణ కోసం కైనెటిక్ థెరపీ.
- విద్యుత్ప్రేరకం:
- ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రోస్టిములేషన్ (TCES)
- విద్యుత్ ద్వారా సూదివైద్యం (electroacupuncture)
- మాగ్నెటోథెరపీ: పల్సెడ్ అయస్కాంత క్షేత్రం ఎంజైమ్ ప్రేరణ ద్వారా నరములు పునరుత్పత్తి, రక్త ప్రసరణ పెరిగింది.
- బయో లేజర్ ఉద్దీపన: నరాలని సరిచేయడానికి లేజర్ రేడియేషన్లను ఉపయోగించవచ్చు.
- ముఖ పక్షవాతం చికిత్స కోసం ముఖ నాడీకండర నిరోధక పద్ధతులు.
- కండరాలను బలోపేతం చేసేందుకు భౌతిక చికిత్స వ్యాయామాలు
- యోగా మరియు ధ్యానం నరముల ఉధృతిని శాంతపరిచి వాటిని బలోపేతం చేసేందుకు.
- శస్త్రచికిత్స జోక్యం.
నరాల బలహీనతను నిర్వహించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం మరియు సమతుల్య ఆహారాన్ని తినడం ముఖ్యం.