నార్కోలెప్సీ (నిద్రరోగం) అంటే ఏమిటి?
నిద్ర-మెళుకువల చక్రాన్ని నియంత్రించే మెదడు యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీసే రుగ్మతనే “నిద్రరోగం” లేక “నార్కోలెప్సీ” అని పిలుస్తారు. ఒక వ్యక్తి నిద్రలేచిన తర్వాత విశ్రాంతి తీసుకొన్నట్లు అనుభూతి చెందుతారు కానీ తరువాత రోజంతా నిద్రమత్తులోనే ఉంటున్నట్లు ఉంటుంది. ఈ నిద్ర రుగ్మత 2,000 మంది వ్యక్తులలో ఒకరిని బాధిస్తుంది. నిద్రరోగం పురుషులు మరియు మహిళలు ఇద్దర్నీసమానంగా ప్రభావితం చేస్తుంది. ఈ రుద్ర రుగ్మత రోజువారీ పనులకు ఆటంకం కల్గిస్తుంది. నిద్రరోగమున్న వ్యక్తి డ్రైవింగ్, తినడం, మాట్లాడటం వంటి మొదలైన ఏ చర్య చేస్తున్నా మధ్యలో నిద్రలోకి జారిపోవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నార్కోలెప్సీ (నిద్రరోగం) జీవితాంతం ఉంటుంది. వయసుతో పాటు ఈ రుగ్మత అభివృద్ధి చెందదు మరియు వ్యాధిలక్షణాలు కాలంతోబాటు మెరుగుపడుతాయి. నిద్రరోగంలో సర్వసాధారణంగా గుర్తించిన లక్షణాలు:
- పగటిపూట కూడా అధిక నిద్రమత్తు
- ఆకస్మికంగా కండరాల నియంత్రణను కోల్పోవడం (cataplexy)
- భ్రాంతులు
- నిద్రపోతున్నప్పుడు తాత్కాలికంగా కదలడం లేదా మాట్లాడే సామర్ధ్యం లేకపోవడం (నిద్ర పక్షవాతం)
తక్కువ సాధారణంగా పరిశీలించిన ఇతర లక్షణాలు:
- ఏ పని మధ్యలోనైనా స్వల్పకాలిక నిద్ర అధ్యాయాలు
- విచ్ఛిన్నమైన నిద్ర (fragmented sleep) నిద్ర
- కుంగుబాటు (డిప్రెషన్)
- నిద్రలేమి
- విశ్రాంతి లేని నిద్ర (restless sleep)
- తలనొప్పి
- జ్ఞాపకశక్తి (మెమరీ) సమస్యలు (మరింత సమాచారం: జ్ఞాపక శక్తి నష్టం కారణాలు)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
నిద్రరోగం (నార్కోలెప్సీ) యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు, అయినప్పటికీ, నార్కోలెప్సీ సంభవించడానికి పలు కారణాలు బాధ్యత వహిస్తాయి. కెటాప్లెక్సీ (Cataplexy) తో కూడిన నిద్రరోగం (నార్కోలెప్సీ) కలిగి ఉన్న దాదాపు అందరు వ్యక్తులు తమ శరీరంలో “హైపోక్ట్రీటిన్” అనబడే ఒక రసాయనపదార్థాన్ని చాలా తక్కువ స్థాయిలో కలిగి ఉంటారు, ఇది మనిషిలో మేల్కొలుపును ప్రేరేపిస్తుంది. కెటాప్లెక్సీ లేని నిద్రరోగం (నార్కోలెప్సీ) ఉన్న వ్యక్తులు హైపోకాట్రిన్ యొక్క సాధారణ స్థాయిలను కలిగి ఉంటారు.
తక్కువ హైపోకాటిన్ స్థాయిలు కాకుండా, ఈ నార్కోలెప్సీ నిద్రరోగాన్ని కలిగించే ఇతర అంశాలు:
- మెదడుకు గాయం
- నిద్రరోగం (నార్కోలెప్సీ) యొక్క కుటుంబ చరిత్ర
- ఆటోఇమ్యూన్ రుగ్మతలు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్య (క్లినికల్) పరీక్ష మరియు వ్యక్తిగత వైద్య చరిత్రను తీసుకున్న తర్వాత, రోగ నిర్ధారణను నిర్థారించడానికి వైద్యుడు రెండు నిర్దిష్ట రోగనిర్ధారణ చర్యలను సిఫారసు చేయవచ్చు:
- పాలీసోమ్నోగ్రామ్: ఇది రాత్రిపూట శ్వాస, కంటి కదలికలు మరియు మెదడు మరియు కండరములు సూచించే అవలోకనాన్ని ఇస్తుంది.
- మల్టిపుల్ స్లీప్ లేటెన్సీ (అనేక నిద్ర జాప్యం) పరీక్ష: ఈ పరీక్ష రోజులో ఒక వ్యక్తి ఎంత నిద్రిస్తుందో లేక నిద్రిస్తాడో మరియు ఏదైనా పనిని నిర్వహిస్తూ మధ్యలో ఎంత తరచుగా నిద్రపోతారనేదాన్ని నిర్ణయించటానికి ఉపయోగిస్తారు.
నిద్రరోగానికి (నార్కోలెప్సీకి) చికిత్స లేనప్పటికీ, జీవనశైలి మార్పులు మరియు మందులు వ్యాధి లక్షణాలను నియంత్రించడానికి మరియు నిద్రరోగం పరిస్థితిని నిర్వహించడంలో సహాయపడతాయి. సాధారణంగా వైద్యులు సూచించే మందులు యాంటిడిప్రెసెంట్స్, అంఫేటమిన్-వంటి ఉత్ప్రేరక మందులు మొదలైనవి.
కింది జీవనశైలి మార్పులు నిద్రరోగం నార్కోలెప్సీ వ్యతిరేకంగా పని చేయడంలో సహాయపడతాయి:
- క్రమం తప్పకుండా వ్యాయామం
- చిట్టి చిట్టి నిద్రలు చేయండి
- నిద్రపోయే ముందు మద్యం మరియు కెఫిన్ పదార్థాలు తీసుకోవడం మానుకోండి
- ధూమపానం మానుకోండి
- పడుకునే ముందు విశ్రాంతి పొందండి
- పడుకునే ముందు భారీ భోజనం చేయడం మానుకోండి