గుండెకండరాల వాపు అంటే ఏమిటి?
గుండె కండరాల వాపునే “గుండెకండరాల వాపు రుగ్మత”, అని పిలుస్తారు. దీన్నే “మయోకార్డియం” అని కూడా పిలుస్తారు, ఇతర గుండె జబ్బుల్లాగా కాకుండా, జీవనశైలి ఈ రుగ్మత యొక్క ఉనికిలో ఎలాంటి పాత్ర పోషించదు. గుండెకండరాల వాపు (మయోకార్డిటిస్) నివారణకు ఎలాంటి పద్ధతి ఇంకా అందుబాటులోకి రాలేదు. చాలా సందర్భాలలో, గుండెకండరాల వాపుతో బాధపడుతున్న వ్యక్తులు ఎటువంటి సంక్లిష్టత లేకుండా తిరిగి కోలుకుంటారు, కానీ అరుదైన సందర్భాలలో ఈరుగ్మతవల్ల గుండెకు నష్టం జరగవచ్చు. అయినప్పటికీ, ఇది తీవ్రమైన వాపుకల్గిన కేసులలో మాత్రమే సంభవిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గుండెకండరాల వాపు జబ్బు సంభవించిన ఒక వారం లేదా రెండు వారాల్లోక్రింది వ్యాధి లక్షణాలను గమనించవచ్చు:
- వ్యాయామం చేస్తున్నపుడు లేదా శ్రమతో కూడిన పనుల్లో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది
- మొత్తం శరీరానికి విస్తరించే ఛాతీలో పెడసరం మరియు పొడుస్తున్నట్లుండే నొప్పి
- విశ్రాంతి సమయంలో శ్వాసలో సమస్యలు
- అక్రమమైన గుండె లయ (మరింత సమాచారం: టాఖికార్డియా కారణాలు)
- కాళ్ళలో వాపు
- ఫ్లూ -వంటి లక్షణాలు, ఉదా, బలహీనత లేక సుస్తీ, అలసట, మరియు అధిక ఉష్ణోగ్రత
- ఆకస్మికంగా స్పృహ కోల్పోవడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కొన్నిసార్లు, గుండె కండరాల వాపు వ్యాధికి (మయోకార్డిటిస్ కు) కారణం తెలియకుండానే ఉంటుంది, ఈ వ్యాధికి తెలిసిన కారణాలు ఇలా ఉన్నాయి:
- సాధారణ కారణాలు: వైరస్లు, ఉదాహరణకు, ఎగువ శ్వాసకోశ అంటువ్యాధులకు బాధ్యత వహిస్తాయి
- తక్కువ సాధారణ కారణాలు: లైమ్ వ్యాధి వంటి అంటువ్యాధులు
- అరుదైన కారణాలు: కొకైన్ మత్తుమందు ఉపయోగం, పాము కాటు, సాలెపురుగు (స్పైడర్) కాటు వంటి విషపూరిత కారకాలకు గురికావడం.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
చాలా సందర్భాలలో, హృదయ కండర వాపు జబ్బు ఎటువంటి లక్షణాలను ఉత్పత్తి చేయదు మరియు గుర్తించబడనిదిగా ఉంటుంది. అయితే, ఒక వ్యక్తి మయోకార్డిటిస్ యొక్క లక్షణాలు అనుభవిస్తే, క్రింది రోగనిర్ధారణ చర్యలు తీసుకోవచ్చు:
- ఎలెక్ట్రొకార్డియోగ్రామ్: మీ గుండె యొక్క విద్యుత్ చర్యల అధ్యయనం
- ఎఖోకార్డియోగ్రామ్: మీ గుండె యొక్క పనితీరును రూపొందించడానికి మరియు రక్తం యొక్క ప్రవాహాన్ని విశ్లేషించడానికి
- ఛాతీ X- రే: ఏవేని నిర్మాణ మార్పులు కోసం గుండె మరియు ఊపిరితిత్తుల నిర్మాణం అధ్యయనం
- కార్డియాక్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI): మీ గుండె పనితీరు (image of your heart) ను విశ్లేషించడానికి
- గుండె జీవాణు పరీక్ష (heartbiopsy): అప్పుడప్పుడూ రోగ నిర్ధారణను నిర్ధారించడానికి నిర్వహిస్తారు.
కింది చికిత్సా పద్దతులు సాధారణంగా గుండెకండరాల వాపు జబ్బుకు (మయోకార్డిటిస్ కొరకు) సూచించబడతాయి:
- గుండె వైఫల్యం చికిత్స కోసం ఉపయోగించే మందులు
- తక్కువ ఉప్పుకల్గిన ఆహారం
- విశ్రాంతి (రెస్ట్)
- వాపు తగ్గించడానికి స్టెరాయిడ్స్
- గుండె కండరాల వాపు (మయోకార్డిటిస్)తో ఉన్న వ్యక్తికి మానసిక సహాయం కోసం కౌన్సెలింగ్ ఉపయోగపడుతుంది.