మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
కొన్ని ఎముకల లోపల ఎముక మజ్జ (bone marrow) అని పిలవబడే ఒక మెత్తటి కణజాలం ఉంటుంది, అది మూల కణాలను(stem cells) కలిగి ఉంటుంది. ఈ స్టెమ్ సెల్స్ (మూల కణాలు) ఎర్ర రక్త కణాలు (RBCలు), తెల్ల రక్త కణాలు (WBCలు) మరియు ప్లేట్లెట్స్ (platelets) వంటి కణాలు అభివృద్ధి చేయగల అపరిపక్వ కణాలు (immature cells). ఎర్ర రక్త కణాలు (RBCలు) ఆక్సిజన్ క్యారియర్లు, తెల్ల రక్త కణాలు (WBCలు) అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయి మరియు ప్లేట్లెట్లు (platelets) రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ (MDS) లేదా మైలోడిస్ప్లాసియా వ్యాధి సంభవిస్తే, స్టెమ్ సెల్స్ (మూల కణాలు) అవసరమైన రక్త కణాలలా పరిపక్వం (mature) చెందవు మరియు అవి ఎముక మజ్జలోపలే చనిపోతాయి. ఆరోగ్యకరమైన రక్త కణాల లేకపోవడం వలన రక్తహీనత, సంక్రమణం లేదా రక్తస్రావం జరుగుతుంది, ఇది లోపం ఉన్న కణాల యొక్క రకాన్ని మీద ఆధారపడి ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ముందుగా ఎటువంటి లక్షణాలు కనిపించవు, కాని ఈ క్రింది లక్షణాలు కనిపించవచ్చు
- అలసట
- బలహీనత
- అంటురోగాల/ఇన్ఫెక్షన్ల శాతం పెరగడం
- జ్వరం
- చర్మం పాలిపోవడం
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- సులువుగా రక్తస్రావం కావడం
- ఎముకల నొప్పి
- బరువు తగ్గుదల
- ఆకలిలేమి
- రక్తస్రావం కారణంగా చర్మం కింద మచ్చలు ఏర్పడడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ను దాని కారణాన్ని బట్టి ఈ క్రింది విధాలుగా విభజించవచ్చు:
- ప్రాథమిక మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ : దీని కారణం ఇంకా తెలియలే దు. కానీ ఇది చాలా సాధారణ రకం.
- ద్వితీయ మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్: దీని కారణం కెమోథెరపీ వంటి చికిత్సా ప్రక్రియలు. దీనిని చికిత్స సంబంధిత మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ (treatment-related MDS) అని కూడా పిలుస్తారు.
మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ జన్యుపరంగా సంక్రమించేది కాదు మరియు కుటుంబాలలో కనిపించదు, కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో,తల్లితండ్రుల నుండి పిల్లలకి సంక్రమించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ నిర్ధారణకు ఈ క్రింది పరీక్షలు నిర్వహిస్తారు:
- రక్త పరీక్షలు: రక్తంలోని మార్పు మరియు రక్తంలో సాధారణ మరియు అసాధారణ కణాలు గుర్తించబడతాయి
- ఎముక మజ్జ పరీక్ష (Bone marrow test): లోకల్ అనస్థీషియాను ఉపయోగించి, ఎముక మజ్జ నమూనాను సూదితో (needle) సేకరిస్తారు, మరియు మూల కణాలలో లోపము ఉన్న రకాన్ని గుర్తిస్తారు.
- సైటోజెనెటిక్ పరీక్షలు (Cytogenetic tests): ఇవి వ్యాధి యొక్క రకాన్ని గుర్తించడంలో సహాయపడతాయి.
ఆరోగ్య స్థితిని గుర్తించేందుకు ఉపయోగపడే ఇతర పరీక్షలు ఎక్స్- రే మరియు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (electrocardiogram).
మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ యొక్క రకం, వయస్సు, ఆరోగ్యం, మొదలైనటువంటి పలు కారకాలపై ఆధారపడి ఖచ్చితమైన చికిత్స అనేది ఉంటుంది. మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ కోసం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు:
- కెమోథెరపీ: ఇది ఎముక మజ్జలో అసాధారణ కణాల సంఖ్యను తగ్గించటానికి ఉపయోగపడే ఒక కెమికల్ చికిత్స.
- మూల కణాల మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్): సరైన/తగిన పోలిక ఉండే దాతల నుండి స్టెమ్ సెల్స్ (మూల కణాలు) గ్రహీత యొక్క ఎముక మజ్జలో నాటబడతాయి/చేర్చబడతాయి, కానీ ఎంపిక చేయబడిన రోగులలో మాత్రమే ఇది సహాయపడుతుంది.
- మందులు: ఇది ఇమ్యూన్ బూస్టర్లు (immune booster), బయోలాజికల్ మోడీఫెయిర్స్ (biological modifiers), కెమోథెరపీ మందులు మొదలైన పలు రకాల మందులను కలిగి ఉండవచ్చు.
- సహాయక చర్యలు: జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ చికిత్సా విధానం ఒక ప్రధాన అంశంగా చెప్పవచ్చు.