కనుపాప పెరగడం (మైడ్రైసిస్) - Mydriasis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 03, 2019

March 06, 2020

కనుపాప పెరగడం
కనుపాప పెరగడం

కనుపాప పెరగడం (మైడ్రైసిస్ )అంటే ఏమిటి?

కళ్ళలో కాంతి ప్రతిఫలించే చర్యలో భాగంగా, కనుపాపలు చీకటిలో మరింత విస్తరించి ఎక్కువ కాంతిని లోనికి రాణిస్తాయి, అదే ప్రకాశవంతమైనప్పుడు కనుపాపలు కుంచించుకుపోతాయి. ఆరు మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ పరిమాణంలో అసాధారణంగా పెరిగే కనుపాపల రుగ్మతనే మైడ్రియాసిస్ అని అంటారు. కాంతివల్ల ఉద్దీపన కలిగినపుడు కనుపాపలు తిరిగి కుంచించుకుపోవడంలో విఫలమవుతాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కనుపాప పెరగడం అనేరుగ్మత యొక్క ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు:

  • ఈ వ్యాధిలక్షణ సంకేతం ఏమంటే కనుపాపల పరిమాణం కాంతికి ప్రతిస్పందనగా మారదు. కనుపాపలు సాధారణం కంటే పెద్దవిగా అట్లాగే ఉంటాయి.
  • మసక దృష్టి
  • కళ్ళు మరియు నుదిటిపై కుంచించుకుపోయిన కదలికల భావన
  • తలనొప్పి
  • మైకము
  • కళ్ళలో మంట, చికాకు
  • కళ్ళను కదిలించాలంటే కష్టం
  • వాలిపోయే కనురెప్పలు

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

కనుపాపలు పెరగడమనే రుగ్మతకు ప్రధాన కారణాలు:

  • అఘాతం (ట్రామా)
  • యాంటీ హిస్టామైన్ వంటి మందులు మరియు కండరాల సడలింపుకిచ్చే మందులు
  • మత్తుమందుల దుర్వినియోగం మరియు మత్తుమందుల వ్యసనం
  • కనుపాపకు సంబంధించిన నరాలకు గాయం
  • మూసిన కోణంతో కూడిన గ్లాకోమా
  • జిమ్సోన్ కలుపు మొక్కలు, ఏంజెల్స్ ట్రంపెట్ మరియు బెల్లడోన్న కుటుంబానికి చెందిన మొక్కలు
  • బహుళవిధమైన తలనొప్పి (ఒంటిచెంప తలనొప్పిరకాలు  లేక మైగ్రేన్లు చరిత్ర)
  • ఒత్తిడి
  • ఆక్సిటోసిన్ స్థాయిల్లో పెరుగుదల
  • కపాల నరములు దెబ్బతినడం, మెదడుకు గాయం లేదా మెదడుపై పెరిగిన ఒత్తిడి
  • కంటికి సంక్రమణ లేదా గాయం
  • మధుమేహం

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

నిర్ధారణ:

  • వ్యాధి కారణం గుర్తించడానికి వైద్యపరమైన చరిత్ర మరియు మందుల చరిత్ర  నిర్ణయించబడుతుంది.
  • ప్రకాశవంతమైన పరిసరాలలో తరచుగా కనుపాపలు విస్తరించడం వంటి సంకేతాలు గుర్తించబడుతాయి.
  • కంటి కండరాల పనితీరును విశ్లేషించడానికి దృశ్య తీక్షణత మరియు కంటి చలనం పరీక్షలు వంటివి నిర్వహిస్తారు.
  • 1% పైలోకార్పైన్ చుక్కలమందును వేయడం జారుతుతుంది, ఇది సాధారణంగా 45 నిమిషాల తర్వాత కనుపాపల సంకోచాన్ని కలిగిస్తుంది.

నివారణ:

  • నేరుగా ఎండను (సూర్యకాంతిని) చూడ్డం మానుకోండి
  • ప్రకాశవంతమైన పరిసరాలలో సన్ గ్లాసెస్ ఉపయోగించండి
  • వాచకాన్ని కళ్ళకు చాలా దగ్గరగా ఉంచుకుని చదవకండి

చికిత్స:

  • చికిత్స విధానం కళ్ళ యొక్క కార్యాచరణను రక్షించడం. చికిత్స అంతర్లీన కారణం ఆధారంగా నిర్ణయించబడుతుంది.
  • నరాలు లేదా కంటి నిర్మాణాలకు జరిగిన నష్టాన్ని మరమ్మతు చేయడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు.



వనరులు

  1. Spector RH. The Pupils. In: Walker HK, Hall WD, Hurst JW, editors. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 58.
  2. American Academy of Ophthalmology [Internet] California, United States; Pupil Efferent Defects.
  3. Wilhelm H,Wilhelm B,Schiefer U. Mydriasis caused by plant contact. Fortschr Ophthalmol. 1991;88(5):588-91. PMID: 1757054
  4. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Lidocaine Usage for Pupil Dilatation (Mydriasis).
  5. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Optimal Method for Mydriasis in Cataract Surgery.