కండరాల బెణుకు అంటే ఏమిటి?
కండరాల బెణుకు అనేది ఒకటి లేదా ఎక్కువ కండరాలకు అయ్యే ఓ రకమైన గాయం. ఒక వ్యక్తి కండరాల బెణుకులకు గురయ్యేదెప్పుడంటే అతని కండర నరాలు (ఫైబర్స్) సాగతీతకు లేదా చింపివేతకు గురైనప్పుడు. ఒక వ్యక్తి కండరాల ఒత్తిడిని కలిగి ఉంటాడు. చాలా మటుకు కండర బెణుకులు తేలికగానే ఉంటాయి మరియు కండరాల నరాలు బలంగా మరియు చెక్కుచెదరకుండా ఉంటాయి. కండరాల నరాలు దాని పరిధులను మించి విస్తరించడమో, సాగతీతకు గురవడమో జరిగి చిరిగిపోవడమనేది కొన్ని సందర్భాలలో మాత్రమే జరుగుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కండరాల ఒత్తిడికి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:
- గాయం అయిన సమయంలో కండరాలలో ఒక రకమైన విపరీతమైన నొప్పి
- కండరాల సంకోచం లేదా తిమ్మిరినొప్పులు
- కండరాల సున్నితత్వం మరియు నొప్పి
- కండరాలలో వాపు
- గాయం అయినా భాగంలో రంగుమారడం
- వాపు, మంట
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
కండరాల బెణుకులకు ప్రధాన కారణాలు:
- డ్యాన్స్ లేదా పరుగుపందెం వంటి కార్యకలాపాల్లో స్నాయువు కండరాలు, తొడకండరాలు వాటి స్థితిస్థాపకత సామర్త్యానికి మించి సాగతీతకు గురికావడం
- అధిక మెలితిప్పబడటం లేదా దూకడం వంటి చర్యలు వీపు వైపున్నకండరాల్లో బెణుకు ఏర్పడడానికి కారణమవుతుంది
- క్రీడల గాయాలు
- భారీ బరువుల్ని ఎత్తడం
- పేలవమైన భంగిమ
- భౌతిక కార్యకలాపాలకు ముందు సరిగ్గా సిద్ధమవకపోవడం (not warming up)
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
క్రింది పద్ధతుల ద్వారా కండరాల బెణుకుల్ని వ్యాధినిర్ధారణ చేస్తారు:
- కండరాల కదలిక మరియు శక్తికి సంబంధించిన లక్షణాలను గుర్తించటానికి వాటిని వివరించమని మీ వైద్యుడు మిమ్మల్ని అడుగుతాడు.
- కండర సంకోచాలు, బలహీనత మరియు కండరాల సున్నితత్వం లక్షణాల్ని వైద్య చరిత్రతో తనిఖీ చేయబడి, పోల్చబడతాయి.
- అవసరమైనప్పుడు X- రే లేదా MRI స్కాన్ను వైద్యుడు ఆదేశించవచ్చు.
- వెన్నెముక మరియు వెన్నుపూస డిస్కులలో సమస్యల పరిశీలనకు అదనపు పరీక్షల్ని మీ వైద్యులచే సిఫారసు చేయబడవచ్చు.
క్రింది పద్ధతులను ఉపయోగించి కండర బెణుకులకు చికిత్స చేస్తారు:
- కండరాల బెణుకుల చికిత్సకు ఉపయోగించే అత్యంత సాధారణ పద్దతిగా చెప్పబడేది ఏదంటే RICE పధ్ధతి. RICE అంటే విశ్రాంతి (rest), మంచు తాపడం (ice application), పలుచని క్రేప్ వస్త్రంతో కూడిన కట్టు కట్టడం (compression bandage) గుండెకు ఎగువన ఉండేలా బెణుకులకు గురైన భాగాన్ని ఎత్తి ఉంచడం (elevation).
- శారీరక చికిత్స ద్వారా తేలికపాటి కండర బెణుకులకు చికిత్స చేయబడుతుంది, ఇది కండరాల ఒత్తిడిని తగ్గించి బెణుకుల్ని మాన్పుతుంది.
- తీవ్రమైన కండరాల బెణుకులకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు, తరువాత శారీరక చికిత్స అవసరం ఉండవచ్చు.
- వాపు మరియు నొప్పి నుండి ఉపశమనం అందించడానికి వైద్యుడు స్టెరాయిడ్లు కాని శోథ నిరోధక మందుల (NSAIDs)ను, నొప్పి నివారణ మందులులు లేదా కండరాల సడలింపు మందులనులను సిఫార్సు చేయవచ్చు.
కార్యాచరణల్లో పరిమితులు నియమించుకోవడం మరియు తొడుగులు (cast) ఉపయోగించడం, కట్టుకట్టేబద్ద వాడకం, వీల్ చైర్ లేదా ఊతకర్రల వాడకం ఇతర చికిత్స ఎంపికలు.