కనుపాప సంకోచం (మయోసిస్) అంటే ఏమిటి?
“కనుపాప సంకోచ రుగ్మత” కల్గినవారి కంటిలో నల్లకనుగుడ్డు (కృష్ణపటలం-iris) లోని కండరవలయం యొక్క తీవ్ర సంకోచం కారణంగా కనుపాప (pupil) కుంచించుకునిపోయి ఉంటుంది, దీన్నే “కనుపాప సంకోచం” గా చెబుతారు. కనుపాప (pupil) వ్యాకోచానికి కారకమయ్యే నల్లకనుగుడ్డు కండర వలయం (dilator pupillae muscle) పక్షవాతానికి గురి కావడం కూడా కనుపాప సంకోచానికి (miosis) కారణం కావచ్చు. కనుపాప సంకోచం (మియోసిస్) సాధారణంగా అంతర్లీన వ్యాధివల్ల లేదా మాదకద్రవ్యాల మరియు నల్లమందు (opium-related) వంటి కొన్ని మత్తుమందులసేవనంవల్ల వస్తుంది.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కనుపాప సంకోచానికి సంబంధించిన ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:
- వాంతులు
- శ్వాసలో సమస్య
- మసక దృష్టి
- సన్నిపాతం
- వికారం
- తలనొప్పి
- నిద్రమత్తుగా ఉండడం
- నొప్పి
- చురుకుదనం లేకపోవడం
- గందరగోళం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కనుపాప సంకోచం (Miosis) యొక్క ప్రధాన కారణాలు:
- నల్లమందుకు-సంబంధించిన (opioid drugs) మందుల వ్యసనానికి లోనవడం
- బ్రెయిన్ హేమరేజ్
- దూరదృష్టి (farsightedness)
- తీవ్రమైన విటమిన్ D లోపం
- న్యూరోసిఫిలిస్ (చికిత్స చేయని సిఫిలిస్ వలన వచ్చే కంటిలో బ్యాక్టీరియా సంక్రమణ)
- వయస్సు (నవజాత శిశువులు మరియు వృద్ధులు)
- పుట్టుకతో వచ్చే లోపము
- నల్లకనుగుడ్డు యొక్క పీచులకు (ఫైబర్లకు) ప్రయాణించే అనుకంపనాడుల్లో (నరాలలో) చికాకు
- నల్లకనుగుడ్డు (ఐరిస్) యొక్క అనుకంప నాడీ వ్యవస్థతో కలుపబడే నరాలలో గాయం
- హోర్నర్స్ సిండ్రోమ్ (ఈ వ్యాధి లక్షణాలలో కనుపాప సంకోచాన్నిఒకటిగా ప్రదర్శిస్తుంది)
- కంటిలో వాపు
- త్రిశాఖ (ట్రిగెమినల్) నరాలలో గాయం లేదా పుండు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
కనుపాప సంకోచం (మియోసిస్) రుగ్మతను క్రింది పద్ధతులను ఉపయోగించి నిర్ధారణ చేయబడుతుంది:
నేత్ర వైద్యుడు కాంతి యొక్క తీవ్రతకు ప్రతిస్పందనగా కనుపాపల సంకోచం మరియు వ్యాకోచాన్ని పరిశీలించి, కొలవవచ్చు. హోర్నర్ సిండ్రోమ్ను తోసిపుచ్చేనందుకు డాక్టర్ CT స్కాన్ మరియు MRI వంటి మెడ, ఛాతీ లేదా మెదడు ఇమేజింగ్ పరీక్షలకు ఆదేశించవచ్చు. న్యూరోసైఫిలిస్ ను తనిఖీ చేయటానికి ఫ్లోరోసెంట్ ట్రోపోనెమల్ యాంటీబాడీ శోషణ (FTA-ABS) మరియు VDRL పరీక్షలు జరుగుతాయి.
కనుపాప సంకోచ రుగ్మతకు క్రింది పద్ధతులను ఉపయోగించి చికిత్స చేస్తారు:
- కంటిలో ఉన్న కణితి లేదా గాయాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స
- కీమోథెరపీ మరియు రేడియేషన్ ద్వారా కంటిలోని ప్రాణాంతక కణితులకు చికిత్స
- ఆర్గాన్ లేజర్ ఫోటో మైడ్రియాసిస్
- కనుపాపను విస్తరించే పరికరాలు, ఉదాహరణకు, కంటి శస్త్రచికిత్స సమయంలో కనుపాప సంకోచాన్ని నిరోధించడానికి కనుపాప విస్తరణ పరికరం (pupil dilator) మరియు కనుపాప (ప్యూపిల్లరీ) వలయాలు
- అత్రోపిన్ లేదా హోమాట్రోపిన్ కంటి చుక్కలమందు
- స్పిన్క్టెరోటోమీ ప్రక్రియ
- మందులను మార్చడంవల్ల కలిగే కనుపాప సంకోచం
- నల్లమందు (అఫిని లేదా అభిని) మత్తు మందు వ్యసనానికి లోనైన వారికి పునరావాసం కల్పించడం