సారాంశం
వీర్య గణన అనేది, ఒక వీర్య విశ్లేషణ పరీక్షలో వీర్యము యొక్క నాణ్యతను నిర్ధారించుటకు ఉపయోగించబడే పారామితులలో ఒకటి. వీర్య విశ్లేషణ పరీక్ష అనేది, ఒక పురుషుడి యొక్క సంతాన అర్హతను నిర్ధారించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన పరీక్ష. పరీక్షించు ఒక నమూనా (వీర్యము)లో కనిపించిన సగటు వీర్యకణాల సంఖ్యగా అది కొలవబడుతుంది. తక్కువ వీర్య గణనలు, వీర్యము యొక్క నమూనాలో ఆశించబడిన విలువకంటే తక్కువ సంఖ్యను సూచిస్తాయి. తక్కువ వీర్య గణనతో ఉన్న ఒక వ్యక్తి ఎటువంటి లక్షణాలు లేకుండానూ ఉండొచ్చు లేదా వృషణాల వాపు లేదా ఇతర లక్షణాలను కలిగి ఉండవచ్చు. తక్కువ వీర్య గణనలు ఉండటానికి కారణం పునరుత్పత్తి అవయవానికి సంబంధించి ఉండవచ్చు లేదా అధిక ఉష్ణోగ్రతకు గురి కావడం వంటి బాహ్య అంశాలు కావచ్చు. ఒక లేబొరేటరీలో జరిపే వీర్య అధ్యయనం ద్వారా ఈ నిర్ధారణ చేయబడుతుంది. కారణమైన వాహకమునకు (ఏదైనా ఉంటే) గురి కావడం తప్పించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించుకోవడం మరియు డాక్టరు సూచించిన మందులను తీసుకోవడం ద్వారా తక్కువ వీర్య గణనను మెరుగుపరచుకోవచ్చు.