స్థానిక అనస్థీషియా (లోకల్ అనస్థీషియా) అంటే ఏమిటి?
స్థానిక అనస్థీషియా అనేది శరీరంలో ఎక్కడైనా ఒక చిన్న స్థిరమైన భాగంలో తిమ్మిరిని ఉత్పత్తి చేయడానికి నిర్వహించే ఓ సాధారణమైన వైద్య విధానం. చర్య యొక్క యంత్రాంగం పరిధీయ నరాలలో ప్రసరణను నిరోధించడం లేదా నరాల ముగింపులోని ఉత్తేజాన్ని అణచిపెట్టడం, తద్వారా జ్ఞానాన్ని (స్పర్శజ్ఞానం) పోగొట్టడం.
మత్తుమందు ఇవ్వడమనేది ఎందుకు జరుగుతుంది?
క్రింది కారణాలకుగాను మన శరీరంలోని ఓ చిన్న భాగానికి తిమ్మిరెక్కించడానికి మత్తుమందును (అనస్థీషియా) మన శరీరంలోని ఓ చిన్న ప్రదేశానికి లేదా భాగానికి ఉపయోగిస్తారు:
- మీరు మెలుకువగా ఉన్నప్పుడే నొప్పిరహిత శస్త్రచికిత్సను మీకు నిర్వహించడానికి, అలా శస్త్ర చికిత్స జరిగేటప్పుడు మీరు ప్రశాంతతతో ఉండి అసౌకర్యాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి మత్తుమందిస్తారు.
- ప్రసవ సమయంలో కలిగే వేదన, నొప్పి, గడ్డలు, పూతలు, ఆకస్మిక గాయాల నొప్పి నుండి ఉపశమనం కల్పించేందుకు మత్తు మందిస్తారు.
- నరాలకు తేలికగా మత్తు మందును వాడేందుకు వీలున్నప్పుడు స్థానిక మత్తుమందులను స్ప్రేలు, ఆయింట్మెంట్లు, లేదా సూది మందుల రూపంలో ఉపయోగించబడతాయి.
మత్తు మందు ఎవరికి అవసరం అవుతుంది?
కొన్ని శస్త్రచికిత్సా విధానాలలో చికిత్స పొందుతున్న రోగులకు స్థానిక అనస్థీషియా అవసరం వస్తుంది:
- జ్ఞాన దంతాలు లేదా తీవ్రంగా దెబ్బ తిన్న దంతాలను తొలగించేందుకు లేదా లోతుగా పుచ్చిన లేదా పుప్పిపట్టిన దంతాల పునరుద్ధరణకు మత్తు మందిస్తారు.
- కంటిశుక్లం శస్త్రచికిత్సలు లేదా ఇతర రకాల కంటి శస్త్రచికిత్సలకు మత్తు మందిస్తారు.
- మచ్చలు (మోల్స్) లేదా పులిపిర్లు, మొటిమలను తొలగించే చిన్న శస్త్రచికిత్సలకు మత్తుమందిస్తారు.
- జీవాణుపరీక్ష మరియు ఆంజియోగ్రఫీ వంటి పరిశోధనలలో మత్తుమందిస్తారు.
- మెదడు శస్త్రచికిత్సలో మాదిరిగానే, రోగి మేల్కొని ఉండాల్సిన శస్త్రచికిత్సలు జరిపేటపుడు (రోగికి) మత్తు మందిస్తారు.
- సాధారణ అనస్థీషియా కింద చేసిన ఒక పెద్ద శస్త్రచికిత్స అనంతరం స్వస్థత చేకూరే సమయంలోనూ స్థానిక మత్తు మందు ఉపయోగిస్తారు.
మత్తు మందు ఇవ్వడమనేది ఎలా జరుగుతుంది?
స్థానిక అనస్థీషియాను నిర్వహించే పలు పద్ధతులు ఉన్నాయి:
- పైపూత (topical)గా స్థానిక అనస్థీషియా
శరీరంలోని ఏభాగానికి మత్తు (తిమ్మెర)ను కల్పించాలో ఆ భాగానికి చర్మం ఉపరితలంపై మత్తుమందును (అనస్థీషియా) ఇవ్వడం జరుగుతుంది. జెల్, క్రీమ్, స్ప్రే లేదా పాచ్ రూపంలో స్థానిక మత్తుమందును ఉపయోగిస్తారు. - ఉప-చర్మసంబంధమైన స్థానిక అనస్థీషియా
మత్తును ఏభాగానికి కల్గించాలో అక్కడ రక్తం సరఫరా చేసే నరాలకు (చర్మం మరియు పొర ఉపరితలం క్రింద) మత్తు ఇంజక్షన్ ను ఇస్తారు. - ప్రాంతీయ అనస్థీషియా
ప్రాంతీయ అనేస్తేషియా (మత్తుమందు) ప్రక్రియ మరింత సాధారణమైన అనస్తీషియా రూపాన్ని అందిస్తుంది మరియు క్రింది రకాలను కలిగి ఉంటుంది:- ఎపిడ్యూరల్ అనస్థీషియా
ఒక స్థానిక మత్తుమందును వెన్నుపూసను రక్షించే ద్రవంతో నిండిన తిత్తి పరిసరాల్లోకి ప్రవేశపెట్టబడుతుంది. ఇది ప్రధానంగా దిగువ పొత్తికడుపు మరియు కింది భాగంలోని అవయవాలకు చేసే శస్త్రచికిత్సలలో ఉపయోగించబడుతుంది. - వెన్నెముక అనస్థీషియా
ఒక స్థానిక మత్తుమందు వెన్నెముక చుట్టూ ద్రవంతో నింపబడిన తిత్తిలోకి చొచ్చుకుపోతుంది, తద్వారా ఆ ప్రాంతానికి తిమ్మెరను కల్గిస్తుంది. - పెరిఫెరల్ నెర్వ్ బ్లాక్ అనస్థీషియా
నరాల మరియు దాని శాఖల ద్వారా సరఫరా చేయబడిన మరియు ఉద్దీపన చేయబడిన నిర్దిష్ట ప్రాంతాలకు తిమ్మెరను కల్గించేందుకు ప్రధాన నరాల (ట్రంక్ యొక్క) ప్రాంతంలో స్థానిక మత్తుమందును ఇవ్వడం జరుగుతుంది.
- ఎపిడ్యూరల్ అనస్థీషియా