కాళ్ళ తిమ్మిర్లు అంటే ఏమిటి?
కాళ్ళ తిమ్మిర్లు అనేవి తొడ లేదా పిక్కల ప్రాంతంలో బాధాకరమైన నొప్పితో కూడిన కండరాల సంకోచాలు. అవి సాధారణంగా ఆకస్మికంగా మరియు వాటికవే సంభవిస్తాయి. ఈ కండరాల సంబంధమైన సంకోచాలు వాటికవే మళ్ళి పరిష్కరించబడతాయి/నయం అవుతాయి. యువకులు కంటే పెద్దలలో కాళ్ళ తిమ్మిర్లు ఎక్కువగా సంభవిస్తాయి. అథ్లెట్లు లేదా స్పోర్ట్స్ వ్యక్తులలో శారీరక శ్రమ/బడలిక కారణంగా ఆకస్మికంగా ఈ కాళ్ళ తిమ్మిర్లు అభివృద్ధి చెందుతాయి. పాదాల మరియు తొడల కండరాలు కూడా తిమ్మిరిని అభివృద్ధి చెయ్యగలవు అయినప్పటికీ, కాళ్ళ పిక్కల కండరాలు అధికంగా ఈ తిమ్మిర్ల వలన ప్రభావితం అవుతాయి
ఈ తిమ్మిర్లు సాధారణంగా తీవ్రమైన కావు, మరియు చాలా సందర్భాలలో, అవి ఏ ఇతర సమస్యలను కలిగించవు.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కొన్నిసార్లు, కాళ్ళ తిమ్మిర్లు ప్రత్యేకంగా రాత్రి సమయంలో సంభవించవచ్చు, అవి వ్యక్తిని నిద్ర నుండి మేల్కొనేలా చేస్తాయి. ఈ రకమైన కాళ్ళ తిమ్మిర్లను రాత్రి సంభంది తిమ్మిర్లు (nocturnal cramps) అంటారు. కాళ్ళ తిమ్మిర్లు పాదముల వాపుతో కూడా ముడిపడి ఉండవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
దాదాపు అన్ని కాళ్ళ తిమ్మిర్లు ఎల్లప్పుడూ ఎటువంటి కారణం, ఏజెంట్ లేదా ప్రేరేపకం లేకుండానే ఉత్పన్నమవుతాయి. కొన్ని కారకాలు కాళ్ళ తిమ్మిర్లను మరింత తీవ్రతరం చేస్తాయి లేదా ప్రేరేపింస్తాయి. అవి వీటిని కలిగి ఉంటాయి:
- మద్యపానం మరియు ధూమపానం అలవాట్లు కాళ్ళ తిమ్మిర్లను మరింత తీవ్రతరం చేయగలవు లేదా ఎక్కువ సమయం పాటు ఉండడానికి కారణమవుతాయి.
- గర్భధారణ లేదా ఎక్కువసేపు కూర్చోవడం వంటి శారీరక పరిస్థితులు కూడా కాళ్ళ తిమ్మిర్లకి కారణం కావచ్చు.
- పార్కిన్సనిజం (Parkinsonism) వంటి న్యూరోమస్కులర్ వ్యాధులు తరచుగా బాధాకరమైన కాళ్ళ తిమ్మిర్లకు కారణమవుతాయి.
- కొందరి వ్యక్తులలో, కాళ్ళ తిమ్మిర్లు ఔషధాల యొక్క దుష్ప్రభావాల ఫలితంగా సంభవిస్తాయి.
- ఒక నిర్దిష్ట కండరం లేదా కండరాల యొక్క మితిమీరిన వాడుక వలన కూడా ఇవి సంభవించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
కాళ్ళ తిమ్మిర్లు వ్యక్తి ఎదుర్కుంటున్న ఒకే ఒక లక్షణం ఐతే వాటికి ఎటువంటి ప్రత్యేక పరీక్షలు అవసరం లేదు. వైద్యులు ఏదైన వాపు, గాయం లేదా ఇతర సంబంధిత సమస్యల తనిఖీ కోసం కాళ్ళను పరిశీలిస్తారు. ఇతర సమస్యల అనుమానం ఉన్నట్లయితే, ఎక్స్-రే ఆదేశించబడవచ్చు.
చాలా వరకు, కాళ్ళ తిమ్మిర్లు వాటికవే నయం అయ్యిపోతాయి. సరైన వ్యాయామం మరియు తగినంత విశ్రాంతి మినహా ఎటువంటి పెద్ద చికిత్స అవసరం లేదు. తక్షణ ఉపశమనం కోసం వేడి కాపడం సహాయపడవచ్చు. చురుకైన నడక లేదా కాలివేళ్ళ మీద నడవడం వంటివి ముఖ్యంగా కాళ్ళ తిమ్మిరి ఉపశమనానికి సహాయబడతాయి. నొప్పి నిరంతరంగా ఉంటే లేదా భరించలేక పోతే, ఓవర్ ది కౌంటర్ పెయిన్కిల్లర్లు లేదా కండరాల సడలింపు కర్తలు (muscle relaxant) ప్రభావవంతంగా పనిచేస్తాయి.