కపోసీస్ సర్కోమా అంటే ఏమిటి?
ప్రాణాంతకమైన “కపోసి సర్కోమా” రుగ్మతకు హంగేరియా దేశ చర్మవ్యాధి నిపుణుడు, డాక్టర్ మొరిట్జ్ కపోసీ పేరు పెట్టడం జరిగింది. 1872 లో మొట్టమొదటగా ఈ రుగ్మత పరిస్థితిని వివరించినందుకు డాక్టర్ మొరిట్జ్ కపోసి పేరును ఈ రుగ్మతకు స్థిరపరిచారు. ఇది చర్మం యొక్క అత్యంత ప్రాణాంతకమైన రక్తనాళాల క్యాన్సర్. చర్మంపై మచ్చలు లేక నరాల గాయాల రూపంలో ఈ వ్యాధి పైకి కనిపిస్తుంది. హ్యూమన్ ఇమ్మ్యునోడైఫిసిఎన్సీ వైరస్ (హెచ్ఐవి) రోగుల్లో కపోసి సార్కోమా ఎక్కువగా గోచరించే ధోరణి ఉంది. ఇది తరచుగా ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్మ్యునో డెఫినిషన్ సిండ్రోమ్) అనారోగ్యాన్ని నిర్వచించే జబ్బుగా పరిగణిస్తారు. ఈ వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా స్వలింగ సంపర్క పురుషులలో కనబడుతుంది.
కపోసీస్ సర్కోమా ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ రుగ్మత చర్మాన్ని బాధిస్తుంది. ఇంకా, చర్మం యొక్క లోపలి గోడల్ని లేదా శ్లేష్మపొరను (mucosa) కూడా ఈ రుగ్మత బాధిస్తుంది. దీనివల్ల శరీరంపై ఎక్కడైనా మచ్చలు కనిపించవచ్చు. గాయాలు తరచూ సమతలమైన వర్ణమయ మచ్చల్లాగా లేదా బాగా పైకి ఉబికిన బొబ్బల్లాగా కనిపిస్తాయి. రక్తనాళాలచే రక్తం బాగా సరఫరా చేయబడినందున ఈ బొబ్బలు ఎరుపు రంగులో లేదా ఊదా రంగులో అగుపిస్తూ ఉంటాయి. ఈ బొబ్బలు నొప్పిలేకుండా ఉంటాయి కానీ మనిషిపై ప్రతికూల మానసిక ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు. కాలక్రమేణా, ఈ గాయాలు నొప్పితో బాధాకరమైనవిగా మారవచ్చు మరియు కాళ్ళలో వాపు కూడా రావచ్చు .
ఈ చర్మ గాయాలు అంతర్గత అవయవాల్లో ఏర్పడితే ప్రాణానికే ప్రమాదంగా మారవచ్చు. ఇవి మూత్రనాళం లేదా ఆసన కాలువను అడ్డుకోవచ్చు. ఊపిరితిత్తులలో, అవి శ్వాసనాళము, ఊపిరి లోపాన్ని మరియు పురోగమన ఊపిరితిత్తుల వైఫల్యాన్ని కలిగించవచ్చు. కాలం గడిచేకొద్దీ చర్మంపైనుండే మచ్చలు కణితులుగా అభివృద్ధి చెందవచ్చు.
కపోసీస్ సర్కోమాకు ప్రధాన కారణాలు ఏమిటి?
కాపోససీస్ సర్కోమా రుగ్మత ‘హ్యూమన్ హెర్పెస్ వైరస్ 8’ కారకమైన సంక్రమణ వలన సంభవిస్తుంది. ఈ సూక్ష్మజీవినే “కాపోసి సార్కోమా-అనుబంధ హెర్పెస్ వైరస్” అని కూడా పిలువబడటం రూఢిలో ఉంది HIV సంక్రమణ ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడి బాధపడుతున్నారు. ఒకసారి సోకినప్పుడు, ఎండోథెలియల్ కణాలు (రక్త నాళాల అంతర్గత ఉపరితలంపై ఉన్న కణాలు) అసాధారణమైనరీతిలో విస్తరిస్తాయి. సాధారణ కణ ప్రతిరూపకల్పనలో అంతరాయం ఏర్పడ్డంవల్లనే ఈ అసాధారణ విస్తరణ కల్గుతుంది.
కపోసీస్ సర్కోమాను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
రోగి కపోసి సర్కోమాతో బాధపడుతున్నాడని క్లినికల్ పరీక్షల సంకేతాలు సూచిస్తున్నప్పుడు, గాయం యొక్క జీవాణు పరీక్ష(బయాప్సీ) ద్వారా రోగనిర్ధారణను ఖచితపర్చవచ్చు. కణితి నుండి కొంత కణజాలం సేకరించబడుతుంది; ఈ ప్రక్రియను మత్తుమందు (అనస్థీషియా) ఇచ్చి జరుపుతారు కాబట్టి నొప్పిలేకుండా ఉంటుంది. ఈ మచ్చలు నరాలకు సంబంధించిన గాయాలు గనుక స్వల్ప రక్తస్రావంతో పాటు తేలికపాటి అసౌకర్యం ఒక రోజు లేదా రెండు రోజులపాటు ఉండవచ్చు. రోగ నిర్ధారణను ఖచితపర్చడానికి కణజాల నమూనాను హై పవర్ మైక్రోస్కోప్ క్రింద పరిశీలింపబడుతుంది. వైవిధ్య కణాల (atypical cells) తో కూడిన డైస్ప్లాస్టిక్ లక్షణాలు మరియు రక్తనాళాల ఉనికి రోగ నిర్ధారణను ఖచితపరుస్తుంది.
కపోసి సర్కోమాకు చికిత్స HIV సంక్రమణ యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది మరియు రోగనిరోధక వ్యవస్థను ఆ సంక్రమణ ఎలా ప్రభావితం చేసిందానిపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులో ఉన్న చికిత్స ఎంపికల్లో యాంటిరెట్రోవైరల్ థెరపీ (ART) ఒకటి. కీమోథెరపీ, ART, రెండింటినీ కలిపి ఉపయోగించవచ్చు. చర్మగాయాలను గడ్డకట్టించడం లేదా శస్త్రచికిత్స ద్వారా వాటిని విచ్ఛేదం కూడా చేయవచ్చు.