దవడ నొప్పి అంటే ఏమిటి?
కణత ఎముక (temporomandibular joint) కీళ్లలో మరియు దాని చుట్టూ ఉండే నొప్పినే, “దవడ నొప్పి”గా సూచిస్తారు. నొప్పి దవడకు ఒకవైవుగాని లేక దవడకు రెండు వైపులా గాని ఉండవచ్చు. దవడనొప్పి తీవ్రమైనదిగా ఉంటుంది లేదా దీర్ఘకాలికంగానూ ఉంటుంది.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా దవడ నొప్పికి సంబంధించిన లక్షణాలు:
- తలనొప్పి
- దవడ సున్నితత్వం
- నమిలినపుడు లేక నోరు తెరిచినప్పుడు నొప్పి
- చెవిలో లేదా చెవి చుట్టూ నొప్పి లేదా కణత చుట్టూ నొప్పి
- దవడ యొక్క కదలికల వల్ల క్లిక్ మనే శబ్దం “టప్-టప్” మనే శబ్దం లేదా పండ్ల రాపిడి (గ్రైండింగ్) శబ్దం రావచ్చు.
- నోరు తెరిచినప్పుడు దవడలు సహకరించకుండా మూసుకుపోయి ఉండడం (locking of jaws)
- దవడనొప్పి చాలా అరుదుగా ముఖంలో నొప్పికి దారి తీస్తుంది
- గుండె సంబంధిత పరిస్థితుల సందర్భంలో, నొప్పి ఛాతీ నుండి దవడకు వ్యాపిస్తుంది, ఈ నొప్పితోబాటు మెడ, వీపు, చేతులు, లేదా కడుపుల నుండి కూడా నొప్పి కల్గుతుంది. దీనికితోడు వికారం, శ్వాస ఆడకపోవుట, తలతిరగటం, లేదా చల్లని చమట పట్టడం వంటి లక్షణాలుంటాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
దవడ నొప్పికి అత్యంత సాధారణ కారణాలు
- గాయం
- అంటువ్యాధులు
- పంటినొప్పి లేదా పళ్ళరాపిడి (పండ్లు నూరడం లేక tooth grinding)
- నాశికా రంధ్రాలకు (sinus-related) సంబంధించిన సమస్యలు
- కాలానుగుణ దంత-సంబంధ స్నాయువు యొక్క వ్యాధులు (periodontal ligament)
- కీళ్లనొప్పులువంటి (ఆర్థరైటిస్) వంటి పరిస్థితులు
- కణత కీలుకు సంబంధించిన (temporomandibular joint ), లేదా ఇతర దవడ-సంబంధిత సమస్యలు
- గుండెపోటు వంటి హృదయ సంబంధిత పరిస్థతులు
దవడ నొప్పిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు దవడ నొప్పిని నిర్ధారించడానికి మరియు కారణాన్ని నిర్ధారించడానికి లక్షణాల పూర్తి చరిత్రను తీసుకుంటాడు. తరువాత దవడ నొప్పి నిర్ధారణ, కారణాల నిర్ధారణకు కింది పరీక్షలు సూచించబడవచ్చు:
- కీళ్ళనొప్పుల నిర్ధారణకు రోగనిరోధక రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, జీవాణుపరీక్షలు (కండరాలు, మూత్రపిండాలు, చర్మం), మరియు కీళ్ల ద్రవం పరీక్షలు (నొప్పి ఉపశమనం) నిర్వహించబడతాయి.
- ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG), ఎఖోకార్డియోగ్రఫీ (2 డి-ఎకో), మరియు ఆంజియోగ్రఫీ పరీక్షల్ని హృదయ సమస్యలను అంచనా వేయడానికి సూచించబడతాయి.
- కణత కీళ్ల X -రే (TMJ రుగ్మతలు), ఛాతీ X- రే లు (గుండె రుగ్మతలు) మరియు సింగిల్ టూత్ లేదా పూర్తి నోటిలోని అన్ని పళ్ళ ఎక్స్-రేలు (సింగిల్ టూత్ లేదా పీరియోడోంటల్ సమస్యలు) సంబంధిత పేర్కొన్న వ్యాధులను నిర్ధారించడానికి సూచించబడతాయి.
- కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT స్కాన్), మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI), మరియు సింటిగ్రాఫి (ఎముక స్కాన్) కణత (టెంపోరోమ్యాండిబ్యులార్) కీళ్లు ఉన్న సందర్భాలలో ఆదేశించబడతాయి.
దవడ నొప్పికి కారణాన్ని గుర్తించిన తరువాత, క్రింది విధంగా చికిత్స చేయబడుతుంది:
- కీళ్లనొప్పి నుండి ఉపశమనానికి వ్యాయామాలు
- యాంటీబయాటిక్స్- నొప్పికి సంక్రమణం మూలకారణంగా ఉంటే గనుక
- వాపు వలన కలిగే నొప్పి నుంచి ఉపశమనాన్నికలిగించే మంటవాపు-నిరోధక మందులు
- కండరాలకు ఉపశమనకారి మందులు (muscle relaxants) కండరాల సంకోచాల ఉపశమనకారి మందులు
- దవడ నొప్పికి దెబ్బతిన్న పంటినొప్పి కారణమైతే రూట్కెనాల్ చికిత్స లేదా చెడిపోయిన పంటిని తొలగించడం.
- నోటి రక్షకం - కణతకీలు వైఫల్యం విషయంలో మౌత్ ప్రొటెక్టర్ పొందడం
- దంత-సంబంధ చికిత్స- పళ్లకు సంబంధించిన సమస్యలకు దంత చికిత్సలు (periodontal treatment) (మరింత చదువు: పిరియోడాంటైటిస్ చికిత్స)
- గుండె చికిత్స - గుండె సంబంధిత పరిస్థితులు కూడా దవడ నొప్పికి కారణమవుతాయి