చెవి దురద అంటే ఏమిటి?
చెవి దురద అనేది ఒక లక్షణం ఇది తరచుగా చెవి సంక్రమణ/ఇన్ఫెక్షన్ ఫలితంగా సంభవిస్తుంది. ఇది సాధారణంగా చెవి వాహిక (ear canal) యొక్క చర్మంలోని సహజ బాక్టీరియాల అసమతుల్యత వలన కలుగుతుంది. చెవి దురద అనేది ఒక సాధారణ సమస్య మరియు అది అంతర్లీన వ్యాధిని సూచిస్తుంది. చెవిలో గులిమిని అధికంగా శుభ్రపరచడం వలన అది చర్మ గాయాలకి కారణం కావచ్చు, అది చెవికి అంటువ్యాధులు సంక్రమించే అవకాశాన్ని కలిగిస్తుంది. ఇయర్ బడ్లు, టూత్ పిక్స్ మరియు పిన్స్ లు వంటి వస్తువులను చెవిని గోకడం కోసం ఉపయోగిస్తే అవి చెవి వాహికకు హాని కలుగవచ్చు.
దాని సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చెవి దురదతో ముడిపడి ఉండే లక్షణాలు:
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చెవి దురదకి కారణమయ్యే సాధారణ సమస్యలు:
- సోరియాసిస్
- ముక్కు వాపు (రినైటిస్)
- స్విమ్మర్స్ ఇయర్ (బయటి చెవి వాహిక సంక్రమణ)
- చెవిలో గులిమి కారణంగా అవరోధం ఏర్పడడం
- అలర్జీలు
- తామర
- చర్మం పొడిబారడం
చెవి దురదకి ఒక సాధారణ కారణం ఫంగల్ సంక్రమణం/ఇన్ఫెక్షన్. కొంతమంది వ్యక్తులలో చెవి చాలా సున్నితంగా ఉంటుంది, అందువల్ల చిన్న మొత్తంలో దుమ్ము లేదా బయటి పదార్దాలు కూడా దురదను ప్రేరేపిస్తాయి.
దీనిని ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
దురద కలిగించే పరిస్థితుల తనిఖీ కోసం వైద్యులు వివరణాత్మక ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు మరియు శారీరక పరీక్ష చేస్తారు. చెవిని పరిశీలించడానికి మరియు ఇతర చెవి రుగ్మతల సంభావ్యతను నిర్ములించడానికి ఒటోస్కోప్ (otoscope) ఉపయోగించబడవచ్చు. రోగనిర్ధారణ ఆధారంగా చికిత్స చేయబడుతుంది.
చికిత్స వీటిని కలిగి ఉంటుంది:
- యాంటీబయాటిక్ లేదా యాంటీ ఫంగల్ ఇయర్ డ్రాప్స్ వ్యాధి చికిత్స కోసం సూచించబడవచ్చు.
- తేలికపాటి స్టెరాయిడ్ డ్రాప్స్ ను చెవులు దురద కోసం ఉపయోగించవచ్చు.
- గులిమిని కరిగించే ఇయర్ డ్రాప్స్ నిరోధాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
నివారణ చర్యలు:
- స్వల్ప కేసులకు ఇంటిలోనే సులభంగా చికిత్స చేసుకోవచ్చు, కానీ సమస్య కొనసాగితే, వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.
- చెవిని ప్రభావితం చేసే చర్మ సంక్రమణ/ఇన్ఫెక్షన్ ఉంటే, ఇ ఎన్ టి (ENT) స్పెషలిస్ట్ లేదా చర్మ వైద్యులని సంప్రదించాలి.
- ఒకవేళ హియరింగ్ ఎయిడ్స్ (వినికిడి సహాయాకాలను)ను ఉపయోగిస్తున్నట్లైతే, అంటువ్యాధులను నివారించడానికి వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని సలహా ఇస్తారు.
- ఏదైనా అసాధారణ రక్తస్రావం జరిగితే, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.