ఐరన్ పొయిజనింగ్ అంటే ఏమిటి?
సాధారణంగా స్వల్ప కాల వ్యవధిలోనే ఒక వ్యక్తి అధిక మొత్తంలో ఐరన్ను తీసుకున్నపుడు (తిన్నపుడు), శరీరంలో ఐరన్ అధికమవుతుంది అది ఐరన్ పొయిజనింగ్ కు దారితీస్తుంది. ఐరన్ పొయిజనింగ్ పెద్దలలో కంటే పిల్లలలోఎక్కువగా కనిపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- ఐరన్ పొయిజనింగ్ యొక్క ప్రారంభ సంకేతాలు కడుపులో తిమ్మిరి మరియు జీర్ణాశయ అసౌకర్యం.
- ఐరన్ ఎక్కువగా తీసుకున్న (తిన్న) వ్యక్తి యొక్క మలం నల్ల రంగులోకి మారుతుంది లేదా మలంలో రక్తం కూడా పడుతుంది.
- ఐరన్ పొయిజనింగ్ యొక్క ఇతర ప్రారంభ లక్షణాలు డీహైడ్రేషన్ (నిర్జలీకరణము) మరియు తీవ్రమైన వాంతులు.
- పైన చెప్పిన ప్రారంభ లక్షణాలు 24 గంటల్లోపు తగ్గకపోతే, మరింత తీవ్రమైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. వీటిలో ఇవి ఉంటాయి: శ్వాసలో కష్టం, క్రమరహిత నాడి, మైకము, చర్మం నీలం రంగులోకి మారిపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం
- లక్షణాలు తీవ్రత తీసుకున్న (తిన్న) ఐరన్ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పిల్లల్లో ఐరన్ పొయిజనింగ్ యొక్క అత్యంత సాధారణ కారణం ఐరన్ సప్లిమెంట్లను అధిక మొత్తంలో తీసుకోవడం (తినడం). పిల్లలు గమనించినప్పుడు లేదా మాత్రలు వారికి సులభంగా అందుబాటులో ఉన్నపుడు ఇది సంభవిస్తుంది.
రక్తహీనత కోసం పిల్లలకు మరియు పెద్దలకు ఐరన్ సప్లిమెంట్లు సూచించబడతాయి. కానీ వైద్యుని సలహా తీసుకోకుండా, లేదా నియంత్రణ లేని పరిమాణంలో వాటిని తీసుకోవడం వలన లేదా అధికంగా తీసుకోవడం వలన అది ఐరన్ పొయిజనింగ్ దారి తీస్తుంది.
ఒక వ్యక్తి తన శరీర బరువుకు కేజీ కి 20mg కంటే ఎక్కువ ఐరన్ను తీసుకంటే, టాక్సీసిటీ (విషప్రభావం) యొక్క లక్షణాలు కనిపిస్తాయి.
60mg / kgగా ఉంటే, తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి మరియు తక్షణ చికిత్స అవసరం అవుతుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
- ఒక పిల్లవాడు ఐరన్ పొయిజనింగ్ యొక్క లక్షణాలను చూపిస్తే, అప్పుడు వైద్యులు తీసుకున్న ఐరన్ యొక్క మోతాదు గురించి తెలుసుకుంటారు.
- రక్తంలో ఐరన్ శాతాన్ని తెలుసుకునేందుకు రక్త పరీక్షలను ఆదేశిస్తారు. వీటిని ఐరన్ అధ్యయనాలు అని కూడా పిలుస్తారు.
- ఇమేజింగ్ పరీక్షల ద్వారా, వైద్య నిపుణులు జీర్ణశయాంతర ప్రేగులలో ఐరన్ మాత్రలు తనిఖీ చేయవచ్చు, అయితే ఇది ఎల్లప్పుడూ అనుకూలం కాదు.
ఐరన్ పొయిజనింగ్ కు చికిత్స ఈ విధంగా ఉంటుంది:
- ఐరన్ పొయిజనింగ్ యొక్క లక్షణాలు కొన్ని గంటలలో తగ్గిపోతే, అప్పుడు చికిత్స అవసరం లేదు.
- అయితే, ఏ ఉపశమనం లేకుండా నిరంతరమైన లక్షణాలు ఉన్నట్లయితే చికిత్స అవసరం.
- తక్షణ చికిత్సలో గ్యాస్ట్రిక్ వాష్ (gastric wash) ఉంటుంది, అంటే ఒక రసాయన ఏజెంట్ను ఉపయోగించి కడుపును పూర్తిగా ఖాళీ చేస్తారు.
- ఇంకొక విధానంలో ఒక ప్రత్యేక రసాయనాన్ని ఇంట్రావీనస్ గా (IV, నరాల ద్వారా) శరీరంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. డిఫెర్రోక్సమైన్ (deferoxamine) అని పిలిచే ఒక రసాయనం, ఐరన్ కు బైండ్ (అంటుకుని) అయ్యి మూత్రం ద్వారా దానిని (ఐరన్) విసర్జించటానికి సహాయపడుతుంది. అయితే, ఈ రసాయనం శ్వాసకోశ సంబంధిత దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది.