కనుగుడ్డు వాపు (ఐరైటిస్) అంటే ఏమిటి?
ఐరైటిస్ ఐరిస్ (కంటి నల్లగుడ్డు, కంటిలో కనుపాప చుట్టూ ఉండే రంగు గల భాగం మరియు దాని పరిమాణాన్ని నియంత్రించేది) యొక్క వాపుని సూచిస్తుంది. చికిత్స చేయకుండా విడిచిపెడితే, ఇది పాక్షిక లేదా పూర్తి అంధత్వం వంటి తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. ఐరిస్ కళ్ళలోకి ప్రవేశించే కాంతిని నియంత్రిస్తుంది. ఐరిస్ కు ముందు కన్నులో ద్రవంతో నిండిన ఒక అర (chamber) ఉంటుంది. అందువలన, ఐరిస్ యొక్క వాపు పూర్తి కంటి వాపుకు దారి తీస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కనుగుడ్డు వాపు (ఐరైటిస్) ఏకపక్షంగా (unilateral) లేదా ద్వైపాక్షికంగా (bilateral) ఉంటుంది, మరియు దీనికి సంబంధించిన సాధారణ లక్షణాలు:
- తలనొప్పి
- నొప్పి
- కళ్ళు ఎర్రబారడం (మరింత సమాచారం: కళ్ళు ఎర్రబారడం కారణాలు)
- కొంతమంది వ్యక్తులకు ఫ్లోటర్లు (దృష్టి/కను చూపు పరిధిలో చిన్న చిన్న చుక్కలు కదులుతున్నట్లు కనిపించడం) కలుగవచ్చు
- ప్రభావిత కనుపాప చిన్నదిగా అవుతుంది
- కాంతికి సున్నితత్వం
- దృష్టి/చూపు క్షీణించడం
- కనుపాపలు క్రమరహిత ఆకారంలోకి మారడం
- జువెనైల్ ఇడియయోపేతిక్ ఆర్థరైటిస్ (JIA) లో, ఎక్కువగా లక్షణాలు చూపని ఐరైటిస్ సంభవిస్తుంది మరియు అది దృష్టికి నష్టం కలిగించినప్పుడు గుర్తించబడుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఐరైటిస్ వీటివలన సంభవించవచ్చు:
- ట్రామా (ఆకస్మిక గాయం)
- అంటువ్యాధులు
- ఆటోఇమ్యూన్ వ్యాధులు
- రియాక్టివ్ ఆర్థరైటిస్
- జువెనైల్ ఇడియయోపేతిక్ ఆర్థరైటిస్ (JIA)
- నెఫ్రైటిస్ (మూత్రపిండాల వాపు)
- ఇన్ఫలమేటరీ బౌల్ వ్యాధి (పెద్దప్రేగు పుండ్లు, క్రోన్స్ వ్యాధి)
- ఆర్థరైటిస్, లుకేమియా, క్షయవ్యాధి, కవాసాకి సిండ్రోమ్ (Kawasaki syndrome) మరియు సిఫిలిస్ వంటి కొన్ని రుగ్మతలు
- ఇడియోపతిక్
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
నిర్ధారణ వైద్యులు లక్షణాలను అర్థం చేసుకున్న తర్వాత కంటి యొక్క పూర్తి పరీక్ష ఆధారంగా ఉంటుంది. క్రింది నిర్ధారణ విధానాలను ఉపయోగించవచ్చు:
- స్లిట్-లాంప్ కంటి పరీక్ష
- ఐరైటిస్ ఇతర వ్యాధులతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు, కాబట్టి పూర్తి ఆరోగ్య తనిఖీ కోసం ఈ పరీక్షలు చేయవచ్చు:
- HLA-B27 హాప్లోటైప్ (haplotype), యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ (ANA, antinuclear antibodies), రుమాటాయిడ్ ఫాక్టర్ (RF, rheumatoid factor), వివిధ అంటువ్యాధుల తనిఖీ కోసం పరీక్షలు మరియు ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ (ESR, erythrocyte sedimentation rate) వంటి వివిధ రకాల రక్తపరీక్షలు
- చర్మ పరీక్షలు
- ఎక్స్-రేలు
- ఛాతీ యొక్క కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
- గాలియమ్ (Gallium) స్కాన్
- సార్కోయిడోసిస్ (sarcoidosis) ను అనుమానించినట్లయితే కణజాలపు బయాప్సీ
ఐరైటిస్ యొక్క కారణం మరియు తీవ్రత చికిత్సను నిర్ణయిస్తాయి. వివిధ చికిత్సా పద్ధతులు ఈ విధంగా ఉంటాయి:
- మూల కారణానికి చికిత్స చేయడం: కంటి వైరల్ సంక్రమణ కోసం యాంటివైరల్స్ మరియు బాక్టీరియల్ సంక్రమణ కోసం యాంటీబయాటిక్స్
- వాపు చికిత్స కోసం స్టెరాయిడ్లను ఉపయోగించడం
- మరింత సంక్లిష్టతను నివారించడానికి, కంటి చుక్కలను (eye drops) ఉపయోగించవచ్చు, అవి రెండు రకాలు:
- కంటిని విస్తరించేలా (డైలెట్) చేసే కంటి చుక్కలు, అవి నొప్పిని తగ్గిస్తాయి ; అందువలన కళ్ళకు విశ్రాంతి అందుతుంది.
- వాపును తగ్గించడానికి స్టెరాయిడ్ డ్రాప్స్, ఇది మసకను నివారించడానికి సహాయపడుతుంది. (మరింత సమాచారం: కళ్ళ మసకలు కారణాలు)
- ఇమ్యునోస్ప్రూసివ్ మందులు కూడా సిఫార్సు చేస్తారు, కానీ అరుదుగా.