ఇంటర్స్టిషియల్ సీస్టైటిస్ - Interstitial Cystitis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 04, 2018

March 06, 2020

ఇంటర్స్టిషియల్ సీస్టైటిస్
ఇంటర్స్టిషియల్ సీస్టైటిస్

ఇంటర్స్టిషియల్ సిస్టిటిస్/మూత్రాశయ వాపు  అంటే ఏమిటి?

మూత్రాశయం వాపు  లేక ఇంటెర్-స్టీషియల్ సిస్టిటిస్ రుగ్మత అంటే మూత్రాశయం యొక్క దీర్ఘకాలిక వాపు మరియు మంటతో కూడిన స్థితి. మూత్రాశయం నొప్పి రుగ్మత నొప్పి, బాధ మరియు పిత్తాశయము ప్రాంతంలో ఒత్తిడిని కలుగ చేస్తుంది. ఈ రుగ్మత మగాళ్ళలో కంటే స్త్రీలలోనే చాలా సాధారణం. మూత్రాశయం వాచి మండే నొప్పిని కల్గిస్తూ ఉండగా, మూత్రాశయానికి సున్నితత్వం కూడా దాపురిస్తుంది. అంతేకాకుండా, మూత్రాశయం యొక్క గోడలు వాపెక్కుతాయి మరియు రక్తాన్ని స్రవిస్తాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మూత్రాశయ నొప్పి లక్షణాలు తేలికపాటి నుండి తక్కువ స్థాయి వరకూ మారుతూ ఉంటాయి. కొందరు రోగులలో, లక్షణాలు వైద్య చికిత్స లేకుండా పూర్తిగా తగ్గిపోవచ్చు.

  • పెరిగిన మూత్రవిసర్జన (మరింత సమాచారం: తరచూ మూత్రవిసర్జనకు కారణాలు )
  • మూత్రవిసర్జనకు పోవాలన్నకోరిక
  • మూత్రం కారడం, ప్రతిసారీ మూత్రం తక్కువ-తక్కువ ప్రమాణాల్లో రావడం
  • కటి స్థానంలో (పెల్విక్) నొప్పి, మహిళల్లో లైంగిక కార్యకలాపాల్లో నొప్పి
  • దిగువ పొత్తి కడుపులో, తొడలు, దిగువ వీపులో, యోని లేదా పురుషాంగము నొప్పి
  • హార్మోన్ల మార్పులు, ఒత్తిడి , తినే మసాలాలతో కూడిన ఆహారాలు మరియు మద్య పానీయాల సేవనం కారణంగా మూత్రాశయ నొప్పి యొక్క వ్యాధి లక్షణాల్ని  మరింత పెంచి బాధిస్తాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మూత్రాశయ నొప్పికి ఖచ్చితమైన కారణం ఇప్పటివరకు గుర్తించబడలేదు. కానీ మూత్రాశయ నొప్పి ఈ క్రింది వైద్య పరిస్థితులకు సంబంధించి ఉంటుంది:

  • కడుపులో మంట (ప్రేగుల్లో మంట), సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసస్ మరియు అటోపిక్ అలెర్జీ వంటి స్వయంరక్షక వ్యాధి (ఆటో ఇమ్యూన్ వ్యాధి)
  • రక్తనాళాల గాయం, రక్తనాళాల దుర్బలత్వాన్ని కలిగించే రక్తనాళ వ్యాధులు
  • కాల్షియం ఫాస్ఫేట్ వంటి అసహజ పదార్ధం మూత్రంలో ఉండటం
  • నిర్ధారణ చేయని బాక్టీరియల్ సంక్రమణలు, ఇవి “యూరియా-స్ప్లిట్టింగ్” బ్యాక్టీరియా వల్ల సంభవిస్తాయి.

మూత్రాశయ నొప్పిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మూత్రాశయ నొప్పి రుగ్మత నిర్ధారణకు ఖచ్చితమైన పరీక్ష లేదు. అయినప్పటికీ, ఈ క్రింది పరీక్షలు దానిని నిర్ధారించడానికి నిర్వహిస్తారు:

  • మూత్రం నమూనా విశ్లేషణ మరియు దాని సాగు
  • మూత్రనాళం మరియు మూత్రాశయం యొక్క గోడల జీవాణుపరీక్ష
  • మూత్రాశయాంతర్దర్శిని (Cystoscopy-అంటే ఒక వంపుడు గొట్టముద్వారా మూత్రాశయములోపల పరీక్షించుట)

మూత్రాశయంలో నొప్పి (ఇంటెర్- స్టిషియల్ సిస్టిటిస్) పూర్తిగా నయం చేయబడదు. అయితే, ఈ క్రింది చికిత్సలు వ్యాధి లక్షణాలను తగ్గించగలవు. ఔషధ ద్రావణంతో పిత్తాశయం లోపల స్నానం (శుభ్రం) చేయడం

  • మూత్రాశయాన్ని ఉబ్బించడం (పెంచడం)
  • మందులు
  • పథ్యముతో కూడిన ఆహారం (డైట్)
  • ఒత్తిడిని తగ్గించడం
  • భౌతిక చికిత్స
  • విద్యుత్ పద్ధతి ద్వారా నరాల ప్రేరణ
  • మూత్రాశయ శిక్షణ
  • శస్త్ర చికిత్స (సర్జరీ)



వనరులు

  1. Berry SH, Elliott MN, Suttorp M, Bogart LM, Stoto MA, et al. (2011). Prevalence of symptoms of bladder pain syndrome/interstitial cystitis among adult females in the United States.. J Urol 186: 540-544
  2. Ricardo Saba. Angiogenic factors, bladder neuroplasticity and interstitial cystitis—new pathobiological insights. Transl Androl Urol. 2015 Oct; 4(5): 555–562. PMID: 26816854.
  3. University of Rochester Medical Center. [Internet]. Rochester, NY. Interstitial Cystitis.
  4. Cleveland Clinic. [Internet]. Euclid Avenue, Cleveland, Ohio, United States; Interstitial Cystitis (Painful Bladder Syndrome): Diagnosis and Tests.
  5. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Interstitial Cystitis (Painful Bladder Syndrome).

ఇంటర్స్టిషియల్ సీస్టైటిస్ వైద్యులు

Dr. Samit Tuljapure Dr. Samit Tuljapure Urology
4 Years of Experience
Dr. Rohit Namdev Dr. Rohit Namdev Urology
2 Years of Experience
Dr Vaibhav Vishal Dr Vaibhav Vishal Urology
8 Years of Experience
Dr. Dipak Paruliya Dr. Dipak Paruliya Urology
15 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు