గాయం అంటే ఏమిటి?
బాహ్య కారకాలవల్ల మన శరీరానికి సంభవించిన ఏదైనా (నొప్పిని కల్గించే) నష్టాన్ని లేక హానిని ”గాయం” అని పిలుస్తారు. శరీరంపై కలిగే ఈ గాయాన్ని, అలాగే గాయంవల్ల మనసుకు కలిగే భయాన్ని “అఘాతం” (trauma) అని అంటారు. తల నుండి బొటనవేలు వరకు శరీరంలో ఏ భాగానికైనా గాయం సంభవించవచ్చు. కొన్ని గాయాలు సులభంగా మానేవిగా ఉంటాయి, పెద్ద స్థాయిలో సంభవించే బాధాకరమైన గాయాలు బాధితున్ని వికలాంగుడిగా మిగిల్చవచ్చు లేదా ప్రాణాంతకమూ కావచ్చు. గాయాలను స్థానం, తీవ్రత మరియు కారణం వంటి పలు కారకాలపై వర్గీకరించవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గాయం యొక్క స్థానం మరియు తీవ్రతను బట్టి గాయం సంకేతాలు మరియు దాని లక్షణాల్లో మార్పు ఉంటుంది. గాయం యొక్క సామాన్య లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి.
- నొప్పి.
- వాపు మరియు మృదుత్వం (లేదా సున్నితత్వం- tenderness).
- శారీరక కదలికలను కోల్పోవడం లేదా ఏదేని భౌతికమైన పనిని కొనసాగించడానికి లేదా చేసుకోవడంలో అసమర్థత.
- రక్తస్రావం అయ్యే పుండు లేదా గాయం.
- హేమాటోమా (కణజాలంలో రక్తం గడ్డ కట్టడం).
- వాంతులు.
- మైకము.
- స్పృహ కోల్పోవడం.
- సరిగా చూడలేకపోవటం.
- సమన్వయం కోల్పోవడం.
- జ్ఞాపకశక్తి నష్టం.
ప్రధాన కారణాలు ఏమిటి?
క్రిందిచ్చినవి గాయానికి ప్రధాన కారణాలు:
- ప్రమాదాలు
- పడిపోవడాలు (falls)
- కాల్పులు
- భౌతికమైన దాడి
- ఆత్మహత్య ప్రయత్నం
- క్రీడలవల్ల గాయాలు
- హింస లేదా యుద్ధం
- పునరావృత ఆయాసం
- మందులు విషపూరితమవడం
గాయాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
గాయం యొక్క రోగనిర్ధారణ ప్రధానంగా ఉపరితలంగా కనిపించే సంకేతాలు మరియు లక్షణాల ద్వారా లేదా అంతర్గతంగా అదృశ్యంగా ఉండే సంకేతాలు మరియు లక్షణాల బట్టి కావచ్చు. గాయం యొక్క తీవ్రతా గణన (స్కోర్) ను ఉపయోగించి గాయం యొక్క వర్గీకరణను (గ్రేడింగ్) నిర్ధరించడం చాలా ముఖ్యమైన భాగం. వ్యాధి నిర్ధారణ క్రింది విధంగా ఉంటుంది:
- శారీరక పరీక్ష
గాయం యొక్క స్థానం యొక్క వివరమైన భౌతిక పరీక్ష తీవ్రతను అర్థం చేసుకోవడానికి మరియు చికిత్సను నిర్ణయించడానికి చాలా అవసరం. ఎముక మరియు కండరాల గాయం విషయంలో వైద్యుడు మీ నడక భంగిమను మరియు బాధిత భాగానికి చెందిన కదలిక శ్రేణిని అంచనా వేస్తాడు. - నరాల పరీక్షలు
డాక్టర్ కంటి కదలికలను, ఇంద్రియ అనుభూతిని మరియు నరాల పనితీరును అంచనా వేయడానికి కండరాలపై నియంత్రణను పరిశీలిస్తాడు. - ఇమేజింగ్
- ఎక్స్-రే.
- MRI .
- అల్ట్రాసౌండ్.
- CT స్కాన్.
- రక్త పరీక్ష
మెదడు గాయంలో విడుదలైన రెండు ముఖ్యమైన ప్రోటీన్ల (GFAP మరియు UCH-L1) ఉనికిని గుర్తించేందుకు రక్త పరీక్ష జరుగుతుంది.
గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందే సమర్థవంతమైన ప్రథమ చికిత్సతో వ్యక్తికీ చికిత్స ప్రారంభమవుతుంది. చికిత్స నియమావళి సాధారణంగా కిందివిధంగా అనుసరించబడుతుంది:
- నొప్పి నివారణలు, వాపు నివారిణులు (యాంటీ ఇన్ఫ్లమేటరీ) మరియు వాంతి-వికారం నివారణా (యాంటీ-ఎమేటిక్ ) మందులు మరియు శాంతపరిచే మందులు (ట్రాన్క్విలైజర్స్) వంటి ఔషధాలు.
- దెబ్బ తగిలిన శరీర భాగాన్ని పైకెత్తి ఉంచడం.
- పగుళ్లు (fractures) విషయంలో సాగే కుదింపు పట్టీలు, స్లింగ్స్ లేదా అచ్చులు.
- ఫిజియోథెరపీ.
- సర్జరీ.
గాయం విషయంలో మీరు నిపుణుల నుండి సలహాలను పొందవచ్చు. చిన్న గాయాల నుండి కోలుకుని స్వస్థత పొందడం పెద్ద గాయం నుండి కోలుకోవడం కంటే వేగంగా ఉంటుంది. పునరావాసం, సున్నితమైన వ్యాయామాలు, సరైన ఆహారం మరియు మీ డాక్టర్ మరియు ఫిజియోథెరపిస్ట్ నుండి క్రమం తప్పకుండా సలహాలు తీసుకుంటూ చేసుకునే చికిత్స వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి.