ఇక్తియోసిస్ అంటే ఏమిటి?
ఇక్తియోసిస్ అనేది చర్మం యొక్క జన్యుపరమైన రుగ్మత, ఇది చర్మాన్ని పొడిబారేలా మరియు పొలుసులుగా మారేలా చేస్తుంది. ఇది అన్ని వయసుల, జాతుల, మరియు లింగాల వారిని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పుట్టినప్పుడు లేదా పుట్టిన మొదటి సంవత్సరం లోపల, సంభవిస్తుంది మరియు వ్యక్తికి తన జీవితకాలం మొత్తం ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఇక్తియోసిస్ యొక్క రకాన్ని బట్టి సంకేతాలు మరియు లక్షణాలు మారుతూ ఉంటాయి.
- ఇక్తియోసిస్ వల్గారిస్ (Ichthyosis Vulgaris) - ఇది చాలా సాధారణ రకం మరియు శిశువు పుట్టిన మొదటి సంవత్సరంలోనే లక్షణాలను చూపిస్తుంది. చర్మం పొరలుగా, పొడిగా మరియు గరుకుగా అవుతుంది, అరచేతులు మరియు అరికాళ్ళులో చర్మం గట్టిపడటంతో పాటు సాధారణం కన్నా ఎక్కువ గీతాలు కనపడతాయి. మోచేతులు మరియు మోకాళ్ళు ముఖం ఎక్కువగా ప్రభావితం కావు.
- X- లింక్డ్ ఇక్తియోసిస్ ఎక్కువగా మగవారిని ప్రభావితం చేస్తుంది, మోండెం మరియు కాళ్ళ మీద చర్మం పొలుసులగా ఏర్పడడానికి కారణమవుతుంది.
- హార్లేక్విన్ ఇక్తియోసిస్ (Harlequin Ichthyosis) - ఇది చాలా అరుదైన రకం మరియు చర్మం మీద తీవ్రమైన పొలుసులు ఏర్పడడానికి కారణమవుతుంది.
- చెమట సరిగ్గా పట్టదు అందువల్ల అది అధిక శరీర ఉష్ణోగ్రతకి లేదా జ్వరానికి దారితీస్తుంది.
- భౌతిక రూపం కారణంగా ఆత్మభిమానం తక్కువ అవ్వడం వంటి మానసిక లక్షణాలు కూడా కనిపిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
తల్లిదండ్రుల నుండి సంక్రమించిన జన్యు మార్పులు (జీన్ మ్యుటేషన్లు) ఇక్తియోసిస్ కు కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో, తల్లిదండ్రులు లోపపూరిత జన్యువు యొక్క వాహకాలుగా (కారియర్స్) ఉంటారు, అంటే వారు లోపాయుక్త జన్యువు కలిగి ఉంటారు, కాని వ్యాధి లక్షణాలు వారికి సంభవించవు. అయితే, తల్లిదండ్రులు ఇద్దరూ వాహకాలుగా ఉంటే, పిల్లవాడికి ఈ వ్యాధి సంభవిస్తుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కొన్ని ఔషధాల వలన కూడా ఇక్తియోసిస్ సంభవించవచ్చు.
లోపపూర్వక జన్యువు (default gene) చర్మ పునరుత్పత్తికి భంగం కలిగిస్తుంది. కొత్త చర్మ కణాలు చాలా వేగంగా ఏర్పడతాయి లేదా పాత చర్మం చాలా నెమ్మదిగా రాలుతుంది, ఇది చర్మం గరుకుగా మారడానికి దారితీస్తుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు చర్మ మార్పులను పరిశీలించడం ద్వారా ఇక్తియోసిస్ను నిర్ధారణ చేయవచ్చు. వారు రోగి యొక్క ఆరోగ్య మరియు కుటుంబ చరిత్ర గురించి వివరాలు తెలుసుకుంటారు. ఇతర చర్మ వ్యాధుల నుండి ఇక్తియోసిస్ను వేరు చేయటానికి చర్మపు జీవాణుపరీక్ష (బయాప్సీ) నిర్వహించబడుతుంది.
ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదా నివారణ చర్య ఏది లేదు. చికిత్స యొక్క ప్రాధమిక లక్ష్యం చర్మం పొడిబారడాన్ని తగ్గించడం మరియు చర్మాన్ని హైడ్రేట్డ్ (hydrated) గా ఉంచడం. తరుచుగా స్నానం చేయడం, స్నానం చేసే సమయంలో మృదువుగా ఉన్న చర్మ పొలుసులను తొలగించడం, స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ను ఉపయోగించడం మరియు బహిరంగ పుండ్ల (open wounds) మీద పెట్రోలియం జెల్లీని పూయడం వంటివి లక్షణాల ఉపశమనానికి సహాయపడతాయి.