హైపర్పారాథైరాయిడిజం అంటే ఏమిటి?
క్యాల్షియం నష్టం వల్ల కలిగే ఎముక బలహీనతకు హైపర్ ప్యారాథైరాయిడిజం రుగ్మతే కారణం. రక్తంలో అసాధారణ పారాథైరాయిడ్ హార్మోన్ల గాఢతను “హైపర్పారాథైరాయిడిజం” అంటారు. పారాథైరాయిడ్ గ్రంధులు అనేవి థైరాయిడ్ గ్రంధికి సమీపంలో ఉన్న చిన్న గ్రంథులు. రక్తంలో క్యాల్షియం గాఢతను నియంత్రించడానికి ప్రధానంగా నాలుగు ప్యారాథైరాయిడ్ గ్రంథులు మన శరీరంలో ఉంటాయి. హైపర్ ప్యారాథైరాయిడిజం అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్యారాథైరాయిడ్ గ్రంధులనుండి మితిమీరిన ప్యారాథైరాయిడ్ హార్మోన్ను శరీరంలో స్రవిస్తుంది, ఇదే ఎముకల్లో క్యాల్షియం నష్టానికి కారణం. 50 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల స్త్రీలలో ఈ పరిస్థితి సర్వసాధారణం. పెరిగిన పారాథైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి రక్తంలో కాల్షియం స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది, ఇది ఎముకలలో కాల్షియం సాంద్రత నష్టానికి దారి తీస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
-
తేలికపాటి హైపర్ ప్యారాథైరాయిడిజం క్రింది వ్యాధి లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది:
- బాధాకరమైన నొప్పితో కూడిన కీళ్ళు మరియు ఎముకలు
- బలహీనమైన కండరాలు
- అలసట
- కుంగుబాటు (డిప్రెషన్)
- ఆకలిని కోల్పోవడం
- ఏకాగ్రత పెట్టడంలో కష్టం
- తీవ్రమైన హైపర్ ప్యారాథైరాయిడిజంతో సంబంధం ఉన్న లక్షణాలు:
- వికారం మరియు వాంతులు
- గందరగోళం
- అధిక దాహం మరియు తరచుగా మూత్రవిసర్జన
- ఇతర లక్షణాలు:
- సన్నబడిపోయే ఎముకలు లేదా పెళుసుబారిపోయే ఎముకలు (బోలు ఎముకల వ్యాధి)
- తగ్గిన మూత్రపిండాల పనితీరు
- మూత్రపిండాల్లో రాళ్లు
- అధిక రక్త పోటు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
రెండు రకాలైన హైపర్ ప్యారాథైరాయిడిజం రుగ్మతలు ఉన్నాయి, అవి:
- ప్రాధమిక హైపర్ ప్యారాథైరాయిడిజం : ఈ స్థితిలో, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మితిమీరిన పారాథైరాయిడ్ గ్రంధుల కారణంగా, పారాథైరాయిడ్ హార్మోన్ యొక్క అధిక స్రావం ఉంటుంది. ప్యారాథైరాయిడ్ గ్రంథుల్లో రుగ్మత ఉద్భవించిన కారణంగా ఈ పరిస్థితిని 'ప్రాధమిక' మని పిలుస్తారు. ప్యారాథైరాయిడ్ గ్రంధిపై ఓ కణితి లేదా నిరపాయమైన కండరవృద్ధి హార్మోన్ యొక్క అధిక స్రావానికి దోహదం చేస్తుంది. (80% రోగులలో ప్రాధమిక హైపర్ ప్యారాథైరాయిడమ్కు అడెనోమానే ప్రధాన కారణం) విస్తరించిన లేదా హైపర్ప్లాస్టిక్ పారాథైరాయిడ్ గ్రంధులు కూడా ప్యారాథార్మోన్ అధిక ఉత్పత్తికి దారి తీయవచ్చు.
- సెకండరీ హైపర్ ప్యారాథైరాయిడిజం: ఇది ప్యారాథైరాయిడ్ గ్రంథులు మరియు పారాథైరాయిడ్ హార్మోన్ యొక్క స్రావం కంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగించే అంతర్లీన వైద్య పరిస్థితి ఫలితంగా సంభవిస్తుంది.
- మూత్రపిండాల వైఫల్యం, ఈ వ్యాధిలో రక్తంలో కాల్షియం స్థాయిలు తక్కువగా ఉంటాయి.
- వారసత్వపు కారకాలు లేదా జన్యు కారకాలు.
- విటమిన్ D లోపాలు.
- తగ్గిపోయిన ఆహార శోషణం.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
రోగి యొక్క వైద్య చరిత్ర మరియు సంబంధిత వ్యాధి లక్షణాల యొక్క అంచనా వైద్యుడికి హైపర్ ప్యారాథైరాయిడిజం రోగాన్ని నిర్ధారించడానికి అవసరమైన పరీక్షలకు సలహా ఇవ్వడంలో మార్గనిర్దేశనం చేస్తాయి.
- ఇందుకు వైద్య పరిశోధనలు కింది విధంగా ఉంటాయి:
- రక్త కాల్షియం మరియు పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయిల అంచనా కోసం రక్త పరీక్షలు.
- DEXA స్కాన్ అనబడే ఎముక సాంద్రత స్కాన్ పరీక్ష.
- మూత్రపిండ వ్యాధిని గుర్తించటానికి CT స్కాన్ మరియు అల్ట్రాసోనోగ్రఫీ.
- విటమిన్ D స్థాయిలు.
ప్రాథమిక హైపర్ థైరాయిడిజం వ్యాధికి సాధారణంగా శస్త్రచికిత్స అవసరమవుతుంది. అతి ఉత్తేజక (ఓవర్యాక్టివ్) పారాథైరాయిడ్ గ్రంధి లేదా కణితి యొక్క తొలగింపు ప్రాధమిక హైపర్ ప్యారా థైరాయిడిజం కేసులలో మంచి ఫలితాలు చూపించాయి.
-
శస్త్రచికిత్స ఎంపికలు:
- కనిష్టంగా దెబ్బతీసే (minimally invasive) ప్యారా థైరాయిడెక్టమీ: అతి ఉత్తేజక (ఓవర్యాక్టివ్) గ్రంధిని మాత్రమే తొలగించడం జరుగుతుంది.
- గొంతు పరిశోధన (neck exploration): నాలుగు పారాథైరాయిడ్ గ్రంధుల్ని శస్త్రచికిత్స ద్వారా అన్వేషించడం జరుగుతుంది, అటుపై వాటిలో అతి ఉత్తేజక (ఓవర్యాక్టివ్) గ్రంధిని మాత్రం తొలగించబడుతుంది.
- తేలికపాటి హైపర్ ప్యారా థైరాయిడిజం రుగ్మతను రక్త పరీక్షలతో పర్యవేక్షించడం జరుగుతుంది. చికిత్సను మందులు, విటమిన్ D మరియు కాల్షియం సప్లిమెంట్లతో నిర్వహించబడుతుంది. ఆహారం, పోషకాహారం మరియు భౌతిక చికిత్స కూడా హైపర్ ప్యారా థైరాయిడిజం రుగ్మతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
- సెకండరీ హైపర్ ప్యారా థైరాయిడిజం రుగ్మత చికిత్సకు అంతర్లీన స్థితిలో చికిత్స చేయడం అవసరం. కాల్సిమిమెటిక్స్ (calcimimetics) అని పిలవబడే ఔషధాల సమూహాన్నిఅనుబంధ చికిత్సగా సూచించబడవచ్చు.