హైపర్కలైమియా అంటే ఏమిటి?
హైపర్కలైమియా రక్తంలో అధిక పొటాషియం స్థాయిలని సూచించే ఒక ఆరోగ్య సమస్య. పొటాషియం శరీరంలో నరాల మరియు కండరాల పనితీరుకు చాలా అవసరం. అయితే రక్తంలోని అధిక పొటాషియం స్థాయిలు తీవ్రమైన ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు.
దాని సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
5.5 mmol / L కంటే అధికంగా ఉన్న పొటాషియం స్థాయిలు హైపర్కలైమియాను సూచిస్తాయి.
ఈ పరిస్థితి సాధారణంగా ఏ లక్షణాలను చూపదు మరియు కనిపించే లక్షణాలు హైపర్కలేమియా వలన అభివృద్ధి చెందిన అంతర్లీన వైద్య పరిస్థితుల కారణంగా గమనింపబడతాయి:
- గుండె దడ, అసాధారణ హృదయ లయల రూపంలో గుండె పనితీరులో మార్పులు
- కండరాల సరిగ్గా పనిచేయకపోవడం అది కండరాల అలసట మరియు బలహీనతకు దారితీస్తుంది
- పక్షవాతం
- వికారం
- అసాధారణ ఇంద్రియ జ్ఞానము (Paraesthesia)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- హైపర్కలైమియాకు సాధారణ కారణాలు
- మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం: తీవ్రమైన లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం (మరింత సమాచారం: తీవ్రమైన మూత్రపిండ వైఫల్య కారణాలు)
- శరీర కణాలలో లోపలి నుండి బయటకి అణువుల (molecules) యొక్క పరివర్తనములో (exchange) లోపం
- ఇతర కారణాలు
- టైప్ 1 డయాబెటిస్
- డీహైడ్రేషన్ (నిర్జలీకరణము)
- అడిసన్స్ వ్యాధి
- రక్త కణాల యొక్క అమితమైన చీలికకి (rupture) దారి తీసే తీవ్రమైన గాయాలు లేదా కాలిన గాయాలు
- బీటా బ్లాకర్లు మరియు యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE, angiotensin-converting enzyme) ఇన్హిబిటర్లు వంటి కొన్ని మందులు కూడా హైపర్కెలెమియా ప్రమాదాన్ని కలిగిస్తాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
హైపర్కలేమియా యొక్క నిర్ధారణ అనేక పరీక్షల ఆధారంగా ఉంటుంది:
- పొటాషియం స్థాయిలను అంచనా వేసేందుకు రక్త పరీక్షలు
- గుండె ప్రసరణను (cardiac conduction) అంచనా వేయడానికి ఎలక్ట్రోకార్డియోగ్రఫీ (ECG)
- కిడ్నీ ఫంక్షన్ పరీక్ష
- మూత్ర పరీక్ష
- నరాల పరీక్ష (Neurological examination)
చికిత్స హైపర్కలైమియా యొక్క తీవ్రత మరియు కారణం మీద ఆధారపడి ఉంటుంది.
తేలికపాటి హైపర్కలామియాను ఆహార మార్పులతో మరియు మందులలోని మార్పులతో నిర్వహించడం జరుగుతుంది.
కణాల బయట (extracellular) నుండి కణాల లోపలికి (intracellular) పొటాషియంను బదిలీ (షిఫ్ట్) చేయడానికి చికిత్సా విధానాలు ఉన్నాయి. మందులు వీటిని కలిగి ఉంటాయి
- కాల్షియం
- ఇన్సులిన్
- అల్బుటేరాల్ (Albuterol)
- మెటబోలిక్ అసిడోసిస్ (metabolic acidosis) ఉన్నపుడు అనుబంధ చికిత్సగా (adjuvant therapy) సోడియం బైకార్బొనేట్ సూచించబడింది.
తీవ్రమైన హైపర్కలైమియాలో ఇంట్రావీనస్ (నరాల లోనికి) కాల్షియం, గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ థెరపీ అవసరమవుతుంది.
నిరంతర గుండె పర్యవేక్షణ పాటు ముఖ్యమైన శారీరక సంకేతాల యొక్క పర్యవేక్షణ అవసరం.
ఏదైనా అంతర్లీన వైద్య పరిస్థితికి తక్షణ శ్రద్ధ అవసరం.
మూత్రపిండాల వైఫల్య విషయంలో డయాలసిస్ అవసరం కావచ్చు.