హంటింగ్టన్స్ వ్యాధి అంటే ఏమిటి?
హంటింగ్టన్ వ్యాధి నరాలకు సంభందించిన వారసత్వంగా సంక్రమించే వ్యాధి. ఇది HTT (హెచ్ టి టి) జీన్ అనే ఒక జన్యువులో లోపము కారణంగా నాడీ కణములకు హాని కలిగించే వ్యాధి. హంటింగ్టన్స్ వ్యాధి రోగి యొక్క సాధారణ సామర్ధ్యాలను పాడుచేస్తుంది మరియు అది కదలికల, ఆలోచనల మరియు మానసిక రుగ్మతలను కలిగిస్తుంది. ప్రధానంగా, హంటింగ్టన్ వ్యాధి యొక్క సంకేతాలు మరియు లక్షణాలు పెద్ద వయసులో అంటే 30 లేదా 50ల మధ్యలో కనిపిస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హంటింగ్టన్స్ వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు 3 ప్రధాన విభాగాలుగా ఉంటాయి:
- కదలికలలో రుగ్మతలు
- అసంకల్పితంగా కదలడం
- కండరాల సమస్యలు
- బలహీనమైన నడక, భంగిమ మరియు సంతులనం చేసుకోవడంలో కఠినత
- సంభాషించుట లేదా మ్రింగుట వంటి శారీరక పనులలో సమస్యలు (మరింత సమాచారం: మ్రింగుటలో సమస్య)
- మేధాశక్తి (ఆలోచన) రుగ్మత
- ఆలోచనలు మరియు పనులపై దృష్టి కేంద్రీకరించడంలో కఠినత
- సొంత (స్వా) ప్రవర్తన మరియు సామర్ధ్యాల మీద కూడా అవగాహన లేకపోవడం
- జారీపోవడం (stumbling)
- కొత్త సమాచారం తీసుకోవడంలో సమస్య
- మానసిక రుగ్మత
- చిరాకు
- నిద్రలో సమస్యలు
- సామాజిక ఉపసంహరణ
- మరణం లేదా ఆత్మహత్య గురించి తరచూ ఆలోచించడం
హంటింగ్టన్స్ వ్యాధి రోగిని రోజువారీ పనులకు కూడా ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది, చివరకు మరణానికి దారితీస్తుంది. దీనిలో మరణానికి అత్యంత ప్రధాన కారణం న్యుమోనియా.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
హంటింగ్టన్స్ వ్యాధి వారసత్వంగా సంక్రమించే ఒక మానసిక రుగ్మత. తల్లి లేదా తండ్రి నుండి పిల్లలకు సంక్రమించిన లోపముతో కూడిన హెచ్ టి టి (HTT) జన్యువు ఈ రుగ్మత సంభవించేలా చేస్తుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
హంటింగ్టన్స్ వ్యాధి ఆరోగ్య సంకేతాలు మరియు లక్షణాల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. రోగ నిర్ధారణలో రోగి యొక్క పూర్తి కుటుంబ చరిత్రను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అనేది ముఖ్య పాత్రను పోషిస్తుంది. డిఎన్ఏ డిటెర్మినేషన్ (DNA determination ), ఇటీవలి కాలంలో హంటింగ్టన్స్ వ్యాధి నిర్దారణని ధృవీకరించడానికి వచ్చిన ఆధునిక పద్దతి.
ప్రస్తుతానికి హంటింగ్టన్స్ వ్యాధిని పూర్తిగా తగ్గించే చికిత్స విధానం లేదు. అందుబాటులో ఉన్న చికిత్సలో థెరపిటిక్ మరియు నాన్ థెరపిటిక్ విధానాలు ఉన్నాయి సర్జరీ ఎటువంటి ముఖ్య పాత్రని పోషించలేదు.
- హైపర్బాక్టివిటీని తగ్గించడానికి ఓలాన్జపైన్ (olanzapine) మరియు పిమోజైడ్ (pimozide) లను ఉపయోగిస్తారు.
- సీటాలోప్రామ్ (Citalopram) మరియు ఫ్లూక్సటైన్ (fluoxetine) వంటివి మందులు కుంగుబాటుని పరిష్కరించడానికి ఉపయోగిస్తారు.
- జీన్ థెరపీ (జన్యు చికిత్స) అనేది అత్యంత సంతృప్తికర చికిత్స మరియు ఈ పద్ధతి వ్యాధికి చికిత్స చేయడానికి కాకుండా పూర్తిగా నివారించడానికి అభివృద్ధి చేయబడింది.