హెచ్.పి.వి (హ్యూమన్ పాపిలోమా వైరస్) - HPV (Human Papillomavirus) in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 06, 2018

March 06, 2020

హెచ్.పి.వి
హెచ్.పి.వి

హెచ్.పి.వి (హ్యూమన్ పాపిలోమా వైరస్) అంటే ఏమిటి?

120 రకాల హ్యూమన్ పాపిలోమా వైరస్లు (హెచ్.పి.వి,HPV) ఉన్నాయి, వీటిలో 40 రకాలు లైంగికంగా సంక్రమిస్తాయి.

హెచ్.పి.వి (HPV) సంక్రమణ అత్యంత సాధారణ లైంగిక సంక్రమణలలో ఒకటి. పురుషులు మరియు స్త్రీలు ఇద్దరినీ ఇది ప్రభావితం చేస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

  • హెచ్.పి.వి (HPV) ఇన్ఫెక్షన్/సంక్రమణ యొక్క లక్షణాలు శరీరంలోకి ప్రవేశించిన వైరస్ రకాన్ని బట్టి మారుతుంటాయి.
  • దాదాపు అన్ని హెచ్.పి.వి (HPV) వైరస్ జాతులు పులిపిరులను (లేదా ఒక రకమైన పొక్కులను) కలిగిస్తాయి. ఇవి ముఖం, చేతులు, మెడ మరియు జననేంద్రియ ప్రాంతాల పై ఏర్పడతాయి.
  • హెచ్.పి.వి (HPV) కూడా ఎగువ శ్వాస నాళ సంబంధిత భాగాల గాయాలకు (హానికి) కారణమవుతుంది, అవి ప్రధానంగా టాన్సిల్స్, స్వరపేటిక మరియు గొంతులో సంభవిస్తాయి.
  • కొన్ని రకాల వైరస్లు మహిళలలో గర్భాశయ క్యాన్సర్ మరియు ఓరోఫారింజియల్ క్యాన్సర్ల (oropharyngeal cancer) కు కారణమవుతాయి. నోరు లేదా గొంతు క్యాన్సర్ కూడా గుర్తిచబడింది.
  • వైరస్ గర్భాశయ క్యాన్సర్కు కారణమైనప్పుడు, చివరి దశ వరకు లక్షణాలు కనిపించవు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • హెచ్.పి.వి సాధారణంగా సంక్రమిత వ్యక్తితో లైంగిక సంభోగం వలన శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఎందుకంటే లైంగిక  సంభందం ఈ వ్యాధి వ్యాప్తికి అత్యంత సాధారణ విధానం. (మరింత సమాచారం: సురక్షిత శృంగారాన్ని ఎలా పొందాలి)
  • బహుళ లైంగిక భాగస్వాములు ఉండడం మరియు ఓరల్ సెక్స్ కూడా సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ఎయిడ్స్ (AIDS) మరియు ఇతర రోగనిరోధక వ్యవస్థ వ్యాధులతో (immune system diseases) ఉన్న వ్యక్తులకు హెచ్.పి.వి సంక్రమణ యొక్క అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • బహిరంగ పుండు, కట్ (ఘాటు) లేదా బహిర్గత చర్మం (exposed skin) ద్వారా కూడా ఈ వైరస్లు శరీరంలోకి ప్రవేశించవచ్చు.
  • లైంగిక సంక్రమణ ద్వారా కాకుండా సంక్రమిత వ్యక్తి శరీరంలోని పులిపిరులను (పొక్కులను) తాకడం వలన కూడా వ్యాపించవచ్చు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

  • రోగ నిర్ధారణ కోసం వైద్యులు, శారీరక పరీక్షలో  పులిపిరులను (పొక్కులను) పరిశీలిస్తారు. ఆరోగ్య మరియు లైంగిక చరిత్ర కూడా రోగ నిర్ధారణకు కీలకమైనది.
  • హెచ్.పి.వి (HPV) అనుమానం ఉన్నట్లయితే, అసాధారణతలను గుర్తించటానికి గర్భాశయ కణాలపై కాటన్ శ్వాబ్ ను ఉపయోగించి పాప్-స్మియర్ పరీక్ష (pap-smear test) నిర్వహించబడుతుంది.
  • గర్భాశయ క్యాన్సర్కు కారణమయ్యే హెచ్.పి.వి వైరస్ సాధారణంగా గర్భాశయ కణాలలో వైరల్ డిఎన్ఏ (DNA) గా ఉంటుంది దీనిని ప్రయోగశాల పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు.

వైరస్ను తొలగించడానికి ఏ చికిత్స అందుబాటులో లేదు. ఏ చికిత్స అవసరం లేకుండానే ఇది అంతర్గతంగా (లక్షణాలు చూపకుండా) ఉండవచ్చు లేదా నయం కావచ్చు.

  • తేలికపాటి పులిపిరుల (పొక్కుల)కోసం, వైద్యులు నోటి ద్వారా తీసుకునే మందులు అలాగే సమయోచిత క్రీమ్లు సూచించవచ్చు.
  • మందుల ద్వారా పులిపిరులు (పొక్కులు) తొలగించబడకపోతే, లేజర్ లేదా క్రయోథెరపీ (cryotherapy) ద్వారా శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం జరుగుతుంది.
  • హెచ్.పి.వి (HPV) క్యాన్సర్ కలిగిస్తే, కీమోథెరపీ లేదా రేడియోథెరపీలతో సహా విస్తృతమైన చికిత్స అవసరమవుతుంది.
  • హెచ్.పి.వి (HPV) వలన సంభవించే గర్భాశయ క్యాన్సర్కు టీకాలు ఉన్నప్పటికీ, మహిళలు లైంగిక సంభోగం ద్వారా సంక్రమణను నివారించడానికి కండోమ్ను ఉపయోగించడం వంటి చర్యలు తీసుకోవాలి.

 



వనరులు

  1. Science Direct (Elsevier) [Internet]; Efficacy of human papillomavirus (HPV)-16/18 AS04-adjuvanted vaccine against cervical infection and precancer caused by oncogenic HPV types (PATRICIA): final analysis of a double-blind, randomised study in young women.
  2. Science Direct (Elsevier) [Internet]; Epidemiology and transmission dynamics of genital HPV infection.
  3. The Journal of Infectious Diseases. [Internet]. Infectious Diseases Society of America. Prevalence of HPV Infection among Men: A Systematic Review of the Literature .
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Human Papillomavirus (HPV).
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Human Papillomavirus (HPV).

హెచ్.పి.వి (హ్యూమన్ పాపిలోమా వైరస్) వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 Years of Experience
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 Years of Experience
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 Years of Experience
Dr. Anupama Kumar Dr. Anupama Kumar Infectious Disease
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు