హెపటైటిస్ సి (C) అంటే ఏమిటి?
హెపటైటిస్ సి అంటే హెపటైటిస్ సి వైరస్ (HCV) కారణంగా కాలేయానికి వాపు సంభవించడం. ప్రధానంగా (కలుషిత) రక్తం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి తీవ్ర ఇన్ఫెక్షన్/సంక్రమణగా ప్రారంభమై 80% వ్యక్తులలో దీర్ఘకాలిక సంక్రమణగా దారితీస్తుంది. తీవ్ర సంక్రమణం/ఇన్ఫెక్షన్ గరిష్టంగా 6 నెలల పాటు ఉంటుంది మరియు ఎటువంటి చికిత్స లేకుండా కూడా నయం కావడం సాధ్యపడవచ్చు. ఐతే, దీర్ఘకాల సంక్రమణ చాలా కాలం పాటు కొనసాగుతుంది మరియు సిర్రోసిస్ మరియు/లేదా క్యాన్సర్లకు కూడా దారి తీయవచ్చు.
జినోటైప్ (genotype) పై ఆధారపడి, హెచ్.సి.వి (HCV) 1 నుండి 6 వరకు 6 రకాలుగా వర్గీకరించబడింది. జినోటైప్ 3 అనేది సాధారణంగా భారతదేశంలో ఎక్కువగా నివేదించబడింది, తర్వాత జినోటైప్ 1 ఉంది. సరైన చికిత్స అందించడానికి జినోటైప్ ను గుర్తించడం అవసరం.
WHO ప్రకారం, భారత ఉపఖండంలో హెచ్.సి.వి (HCV) సంక్రమణ యొక్క ప్రాబల్యం 0.5 - 1%గా ఉంది అలాగే ప్రపంచవ్యాప్తంగా 1.6% గా ఉంది అందువలన ఇది జనాభాకు ముప్పుగా పరిగణించబడుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
తీవ్రమైన దశ (Acute phase)
సాధారణంగా లక్షణాలు కనిపించడానికి 2 వారాల నుండి 6 నెలల వరకు సమయం పడుతుంది. వ్యాధి సోకిన 80% మంది వ్యక్తులు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండరు, అయితే వీటిని అనుభవించవచ్చు:
దీర్ఘకాలిక దశ (Chronic phase)
తరువాతి దశల్లో, లక్షణాలు ఈ విధంగా ఉంటాయి :
- బాక్టీరియల్ సంక్రమణతో కూడా ముడి పడి పొత్తికడుపులో ద్రవం చేరడం
- వాంతులు లేదా మలవిసర్జనలో రక్తస్రావం
- ముదురు రంగు మలం
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- కీళ్ళలో నొప్పి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
హెచ్.సి.వి (HCV) ప్రధానంగా రక్తం నుండి ఈ క్రింది మార్గాల ద్వారా వ్యాపిస్తుంది:
- వ్యాధి సోకిన వ్యక్తులతో రేజర్ల వంటి వ్యక్తిగత ఉత్పత్తులు మరియు ఇంజెక్షన్లు పంచుకోవడం
- ఆసుపత్రులలో కలుషిత సూదులు మరియు సిరంజిల వాడకం
- వైద్య పరికరాల సరిలేని స్టెరిలైజేషన్ (క్రిములను తొలగించడం/నాశనం చేయడం)
- కలుషితమైన రక్తంతో రక్త మార్పిడి (బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్)
వ్యాధి వ్యాపించే ఇతర విధానాలు:
- లైంగిక మార్గం
- తల్లి నుండి శిశువుకు
ఇన్ఫెక్షన్ కలుషిత ఆహారం మరియు నీటి ద్వారా లేదా గృహ వస్తువులను పంచుకోవడం ద్వారా వ్యాపించదు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వ్యక్తి పైన పేర్కొన్న లక్షణాలను అనుభవిస్తే, వైద్యులని సంప్రదించాలీ, వారు వైరస్ను గుర్తించడానికి కాలేయ ఎంజైమ్ల స్థాయిని గుర్తించేందుకు రక్త పరీక్షలను అలాగే దానితో పాటు హెచ్.సి.వి యాంటీబాడీ (యాంటీ-HCV) మరియు హెచ్.సి.వి రిబోన్యూక్లియిక్ యాసిడ్ ([HCV ribonucleic acid] HCV RNA) కూడా సిఫారసు చేయవచ్చు. ఈ పరీక్ష వైరస్ శరీరంలోకి ప్రవేశించిన కేవలం ఒక వారం లోపూనే గుర్తించగలదు ..
కాలేయ నష్టాన్ని గుర్తించడానికి కాలేయ జీవాణు పరీక్ష (బయాప్సీ) జరుగుతుంది. చికిత్స ప్రారంభించటానికి ముందు HCV జినోటైప్ పరీక్ష కూడా నిర్వహించబడుతుంది.
ప్రత్యక్షంగా పనిచేసే యాంటీవైరల్స్ (Direct acting antivirals) హెపటైటిస్ సి సంక్రమణ చికిత్సకు కొత్త అందుబాటులోకి వచ్చిన మందులు వీటిని చికిత్స కోసం 3 నెలలు వ్యవధి పాటు ఉపయోగించాలి. భారతదేశంలో కొత్త ఎజెంట్లు (కొత్త రకాల మందులు) త్వరగా అందుబాటులోకి రాని కారణంగా, సాధారణ హెపటైటిస్ చికిత్సే ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
ప్రస్తుతం, సంక్రమణ/ఇన్ఫెక్షన్ నివారణకు టీకా అందుబాటులో లేదు, కానీ ఈ వ్యాధిని వైరస్ కు గురికావడాన్ని తగ్గించటం ద్వారా నిరోధించవచ్చు (సూది మరియు సిరంజి పంచుకోవడం, రక్త మార్పిడి మరియు ప్రభావిత వ్యక్తులతో లైంగిక సంబంధాలు వంటివి నిరోధించాలి).
వైద్యులు సూచించిన మందులను సక్రమంగా వాడడం వలన, సంక్రమణను అధిగమించి మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అది సహాయపడుతుంది.