హెపటైటిస్ ఏ (A) అంటే ఏమిటి?
హెపటైటిస్ ఏ (A) కాలేయానికి వాపును కలిగించే ఒక వైరల్ సంక్రమణం/ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలలో కనిపిస్తుంది మరియు ఏ లక్షణాలను చూపదు. ఏదేమైనా, వ్యాధి యొక్క తీవ్రత వయసుతో పాటు పెరుగుతుంది. సాధారణంగా, ఈ ఇన్ఫెక్షన్/సంక్రమణ స్వల్ప కాలం మాత్రమే ఉంటుంది మరియు మరణం చాలా అరుదైన సందర్భాలలో సంభవిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వ్యాధి యొక్క లక్షణాలు వైరస్కు గురైన 2-4 వారాలలో ప్రారంభమవుతాయి. సాధారణంగా కనిపించే లక్షణాలు:
- పసుపు రంగు మూత్రం
- కంటిలో తెల్లగుడ్డు పసుపురంగులోకి మారడం
- జ్వరం
- బలహీనత
- మలం పలచగా మారడం
- వికారం
- ఆకలి తగ్గిపోవడం (మరింత సమాచారం: ఆకలి తగ్గుదల కారణాలు)
- కీళ్ళ నొప్పి
అరుదుగా, కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మరియు వైఫల్యానికి దారితీస్తుంది. (మరింత సమాచారం: కాలేయ వైఫల్య లక్షణాలు)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
హెపటైటిస్ ఏ (A) వైరస్ (HAV) అనే వైరస్ వలన ఈ హెపటైటిస్ సంక్రమణ/ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. ఇది ప్రధానంగా వైరస్ ఉన్న మలంతో కలుషితమైన ఆహారం మరియు నీరు తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.
సంక్రమణ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ ఈ క్రింది విధాలుగా వ్యాపించగలదు:
- వ్యాధి సోకిన వ్యక్తి తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం
- శుద్ధి చేయని నీటిని తాగడం
- సంక్రమిత వ్యక్తితో లైంగిక సంబంధం లేదా వారి వ్యక్తిగత వస్తువులను ఉపయోగించడం
దగ్గు, తాకడం (touch), కౌగిలింత లేదా తల్లి పాలివ్వడం ద్వారా కూడా వైరస్ సంక్రమిస్తుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగి అనుభవించిన లక్షణాలు, శారీరక పరీక్ష మరియు రక్త పరీక్షలు ఆధారంగా వైద్యులు హెపటైటిస్ ఏ (A) ను గుర్తించవచ్చు. హెపటైటిస్ ఏ వైరస్కు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరం ఉత్పత్తి చేసిన యాంటీబోడీలను రక్త పరీక్షలు గుర్తిస్తాయి. హెపటైటిస్ ఏ (A) సంక్రమణకు/ఇన్ఫెక్షన్కు ఎటువంటి ప్రత్యేక చికిత్స లేదు, లక్షణాల తీవ్రత ఆధారంగా మాత్రమే చికిత్స చేయబడుతుంది. సాధారణ చికిత్స కోసం సరైన విశ్రాంతి మరియు అతిసారం, వాంతులు వలన శరీరం కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడానికి శుద్ధి చేసిన నీటిని పుష్కలంగా తీసుకోవాలి.
సంక్రమణ/ఇన్ఫెక్షన్ తర్వాత కొన్ని వారాలలో ఆరోగ్యం మెరుగుపడం మొదలవుతుంది. సాధారణంగా, కాలేయానికి వైఫల్యం జరిగితే కనుక ఆసుపత్రిలో చేర్చడం అవసరం కావచ్చు.
ఈ క్రింది చర్యలను పాటించి ఇన్ఫెక్షన్కి/సంక్రమణకి గురికాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు:
- శుద్ధి చేయబడిన నీటిని త్రాగడం
- సరిగ్గా శుభ్రం చేసిన మరియు వండిన ఆహారాన్ని తీసుకోవడం
- పండ్లు మరియు కూరగాయల పై తొక్కలు తీసివేయకుండా వాటిని తినకూడదు
- ఒకరికి ఉపయోగించిన ఇంజెక్షన్లను వేరొకరు ఉపయోగించకూడదు
- వ్యాధి సోకిన వ్యక్తితో సెక్స్ను నివారించాలి (మరింత సమాచారం: సురక్షిత లైంగిక విధానాలు)
- హెపటైటిస్ ఏ వైరస్ టీకా బాల్యంలో వేయించుకోవాలి