చెమట కాయలు అంటే ఏమిటి?
చెమట కాయలు, సాధారణంగా వాటిని చెమట పొక్కులు అని కూడా పిలుస్తారు, చర్మం దురదతో పాటు శరీరంలో వివిధ ప్రదేశాలలో పై ఎరుపు రంగు మచ్చలు కనిపించే ఒక చర్మ పరిస్థితి (సమస్య). చెమట కాయలు సాధారణంగా సంవత్సరంలోని వేడి నెలలలో ఏర్పడతాయి, శరీరానికి సాధారణం కంటే అధికంగా చెమటలు పెట్టేటప్పుడు వీటిని గమనించవచ్చు మరియు అవి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
దీని సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చెమట కాయల యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు చర్మంపై కనిపిస్తాయి మరియు వాటిని సులువుగా గుర్తించవచ్చు.
లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:
- చర్మంపై ఎరుపు మచ్చలు కనిపిస్తాయి
- చర్మం పైన బొబ్బలు ఏర్పడటం
- చర్మం యొక్క తీవ్రమైన దురద
- దుస్తులు చర్మానికి వ్యతిరేకంగా రుద్దుకున్నపుడు అసౌకర్యం
- చర్మం గరుకుగా మారడం
ఈ లక్షణాలు సాధారణంగా మెడ, భుజాలు, ఛాతీ మరియు నడుము వంటి భాగాలలో సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో, మోచేతుల మరియు గజ్జల మడతలలో కూడా చెమట కాయలు ఏర్పడవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
శరీరం వేడికి గురైనప్పుడు, చెమట అధికంగా పడుతుంది. అధిక వేడి మరియు తేమ కారణంగా చెమట వాహికలకు (sweat ducts) అవరోధం ఏర్పడినప్పుడు చెమటకాయలు/పొక్కులు సంభవిస్తాయి. ఈ అవరోధం కారణంగా, చర్మం వాచీ, అది దురద మరియు ఎరుపుదనానికి దారితీస్తుంది.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
చెమటకాయలు/పొక్కులు అనేవి సాధారణం మరియు అవి ఎటువంటి సమస్యలకు దారితీయవు. కొన్ని రోజులు లేదా కొన్ని వారాల వరకు లక్షణాలు ఉండవచ్చు మరియు సాధారణంగా ఏ చికిత్స లేకుండా తగ్గిపోతాయి. అయితే, ఈ పరిస్థితి చాలా అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వైద్యులు దానిని నివారించడానికి మరియు ఉపశమనానికి కొన్ని నివారణ చర్యలను సూచించవచ్చు.
నివారణ చర్యలు వీటిని కలిగి ఉంటాయి:
- చర్మం శ్వాసించడానికి వీలుగా వదులుగా ఉండే బట్టలను ధరించాలి
- చల్లని, పొడి వాతావరణంలో ఉండాలి
- శారీరక వ్యాయామం తర్వాత స్నానం చెయ్యాలి
- చర్మపు చికాకును నివారించడానికి మృదువుగా ఉండే బట్టలు ధరించాలి
చల్లటి కలబంద జెల్ను వాడటం మరియు చల్లటి నీటితో కడగడం వంటి గృహ చిట్కాలు దురద నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి.
ఒకవేళ చెమటవాహికలకు ఇన్ఫెక్షన్ సోకితే, మరింత చికిత్స అవసరమవుతుంది.