గుండె వైఫల్యం అంటే ఏమిటి?
గుండె వైఫల్యం అనేది గుండె రక్త ప్రసరణ పనిలో దాని సామర్థ్యం తగ్గిపోవడం, దానివలన మిగిలిన శరీర అవయవాలకు తగినంత రక్తం సరఫరా అందదు. చాలా కాలం పాటు గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తులలో లేదా వృద్ధులలో ఇది తరచూగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని ఒక వైద్య అత్యవసరంగా గుర్తించి, వెంటనే ఆసుపత్రిలో చికిత్స చేయాలి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- తలనొప్పి, గందరగోళం
- ఆందోళన
- పల్స్ రేటులో పెరుగుదల (టేకీకార్డియా)
- అల్ప రక్తపోటు (హైపోటెన్షన్)
- జలోదరం (కడుపులో ద్రవం ఏర్పడటం)
- ముఖ్యంగా రాత్రి సమయంలో తరచూ మూత్రవిసర్జన
- దడ
- ఛాతీ ప్రాంతంలో నొప్పి ఉదరం మరియు ఎగువ శరీర భాగాల వైపు వ్యాపిస్తుంది
దాని కారణాలు ఏమిటి?
గుండె వైఫల్యానికి ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉంటాయి:
- గుండె సంభందిత కారణాలు
- అధిక రక్త పోటు
- స్టెనోసిస్ (అయోర్టిక్ లేదా పల్మోనరీ అనగా రక్త నాళాలఇరుకుగా మారడం)
- ఇంటర్ ఆట్రియల్ లేదా ఇంటర్వెంట్రిక్యూలర్ సెప్టాలలో లోపము వంటి గుండె లోపాలు (గుండె గోడలలో (వాల్స్) రంధ్రం)
- మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (Myocardial Infarction, గుండె కండరాల నష్టం)
- ఇన్ఫెక్టివ్ ఎండోకార్డయిటిస్ (Infective Endocarditis)
- ఇతర కారణాలు
- అంటువ్యాధులు/ ఇన్ఫెక్షన్స్
- పల్మోనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం)
- బీటా-బ్లాకర్లు, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు లాంటి మందుల యొక్క అధిక వినియోగం
- శారీరక మరియు మానసిక ఒత్తిడి
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు లక్షణాలను అర్థం చేసుకోవడానికి రోగి యొక్క వివరణాత్మక ఆరోగ్య చరిత్ర తెలుసుకుంటారు, రక్తపోటు స్థాయిలు మరియు గుండె శబ్దాలను కూడా తనిఖీ చేస్తారు.
ప్రయోగశాల ఆధారిత పరీక్షలు మరియు వైద్యునిచే భౌతిక పరీక్షలు, రెండింటి ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ప్రయోగశాల పరీక్షలు వీటిని అంచనా వేయడానికి చేస్తారు
- యూరియా
- ఎలెక్ట్రోలైట్లు
- పూర్తి రక్త గణన (Complete blood count)
- బిఎన్ పి (BNP, బ్రెయిన్ నాట్రియురెటిక్ పెప్టైడ్)
- కాలేయ పనితీరు (Liver function)
- కిడ్నీపనితీరు (Kidney function)
ఎలెక్ట్రోకార్డియోగ్రామ్ (ECG,Electrocardiogram), ఛాతీ ఎక్స్-రే మరియు ఎకోకార్డియోగ్రఫీ (Echocardiography) వంటి ఇమేజింగ్ పరీక్షలు కూడా నిర్వహించబడతాయి.
గుండె వైఫల్యం ఉన్న రోగి యొక్క నిర్వహణ (చికిత్స) ఈ క్రింది విధంగా ఉంది:
- శారీరక మరియు భావోద్వేగ (emotional) విశ్రాంతి
- బరువు తగ్గుదల
- ఆక్సిజన్ థెరపీ ద్వారా శ్వాస అందకపోవడనికి చికిత్స చేయడం
- డైట్ కౌన్సెలింగ్
- మద్యం మరియు ధూమపానం ఆపివేయడం
- క్రమమైన శారీరక వ్యాయామం
మందుల చికిత్సలో ఈ క్రింది మందులు ఉపయోగించబడతాయి:
- డైయూరిటిక్స్ (Diuretics)
- వాసోడైలేటర్స్ (Vasodilators)
- ACE ఇన్హిబిటార్స్
- ARBలు
- β-బ్లాకర్స్
- స్టాటిన్స్