తలలో పేలు అంటే ఏమిటి?
తలలో పేలు మానవుల తల మీద పెరిగుతూ తలలో రక్తాన్ని పీల్చే చిన్న పరాన్నజీవులు. పేలు ఈనులు (ఈపులు) నుండి వస్తాయి, అవి పేల గుడ్లు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పేలు ఈనులుగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రారంభ దశలలో, ఈ పేల సమస్యను గుర్తించడం చాలా కష్టం. తలలో పేలు సమస్య యొక్క ముఖ్య సంకేతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- గుర్తించడం (స్పాటింగ్) - కొన్ని సార్లు జుట్టు దువ్వుతున్నపుడు, చిన్న ఈనులు తల వెంట్రుకలకి అంటుకుని ఉండడాన్ని గమనించవచ్చు. ఈనులు చిన్న తెల్లని గ్రాన్యూల్ లాంటివి అవి తల వెంట్రుకలకి అంటుకుని ఉంటాయి
- దురద - తరువాతి దశలలో, తలలో పేలు చేరడం మరియు పెరుగడం వలన తరచుగా దురద వస్తుంది ఎందుకంటే అవి రక్తం పీల్చడానికి తలపై చర్మం లోపలికి చొచ్చుకునిపోతాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
తలలో పేలు (పెడిక్యులస్ హ్యూమస్ కాపిటీస్ [Pediculus humanus capitis]) పరిస్థితులు మరియు ఉష్ణోగ్రత అనుకూలంగా ఉన్నప్పుడు వృద్ధి చెందుతాయి. పేలు తరచుగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. పేలు పిల్లలలో చాలా సాధారణంగా కనిపిస్తాయని, పాఠశాలల్లో లేదా ఆటల సమయంలో వారు ఇతర పిల్లలతో ఎక్కువగా కలుస్తూ ఉండడం వలన ఇది జరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పేల సమస్య ఉన్న వ్యక్తితో దుస్తులను పంచుకోవడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. టోపీలు మరియు స్కార్ఫులు వంటివి ఎవరితోనూ పంచుకోకూడదు మరియు విడిగా ఉంచాలి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
తలలో పేల నిర్ధారణకు ఏ పరీక్షలు సూచించబడిలేవు. కేవలం పేల దువ్వెనను ఉపయోగించి లేదా తలను పరిశీలించి పేల సమస్యను నిర్ధారించవచ్చు.
పేల చికిత్స కోసం ఔషధపూరిత షాంపూలు, నూనెలు మరియు ఇతర ఉత్పత్తులు ఉంటాయి, ఉత్పత్తి రకం మీద ఆధారపడి వాటిని నేరుగా తల మీద పూసుకుని (రాసుకుని) తలను దువ్వుకోవడం లేదా కడగడం చెయ్యాలి. మార్కెట్లో అత్యంత సాధారణ మరియు విస్తృతంగా ఉపయోగించే ఉత్పత్తులు పేనులను మరియు వాటి గుడ్లను చంపే ఐవెర్మీక్టీన్ (ivermectin) ను కలిగి ఉంటాయి.
పళ్ళు దగ్గరికి ఉండే ప్రత్యేక దువ్వెనలు తయ్యారు చెయ్యబడి ఉంటాయి , వాటితో జుట్టును నేరుగా దువ్వడం ద్వారా పేలు మరియు ఈనులను తీసివేయవచ్చు.
పేల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు దుస్తులను విడిగా ఉంచాలి మరియు ప్రత్యేకించి తలకు ఉపయోగించే వస్తువులను పంచుకోవడం వంటివి చెయ్యకూడదు.