చేతులు వణికే రుగ్మత - Hand Tremors in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 05, 2018

July 31, 2020

చేతులు వణికే రుగ్మత
చేతులు వణికే రుగ్మత

చేతులు వణికే రుగ్మత అంటే ఏమిటి?

వణుకుడు అనేది అప్రయత్న పూర్వకమైన చర్య మరియు కొన్ని కండర సమూహాల లయబద్దమైన కదలికలు. చేతికండరాల (మణికట్టు, వేళ్లు మరియు బొటన వ్రేలి మొదట్లో ఉబ్బు) యొక్క అసంకల్పిత కదలికలే “చేతులు వణికే రుగ్మత” గా పిలువబడుతోంది. దీన్నే “అదిరే చేతులు” అని కూడా పిలుస్తారు. ఇలాంటి పరిస్థితి వృద్ధులలో చాలా సాధారణం మరియు వారి సాధారణ పనులకు ఈ రుగ్మత కష్టం కల్గిస్తుంది. అయితే ఇది ప్రాణాంతకమైన స్థితి కాదు, కానీ మెదడు కణాలలో సంభవించే ప్రమాదకరమైన ప్రక్రియగా దీన్ని సూచించవచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చేతులు వణికే రుగ్మత యొక్క లక్షణాలు తేలికైనవి మరియు చేతుల అప్రయత్నపూర్వక కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ, కొన్నిసార్లు, చేతి వణుకుడు కొన్ని వ్యాధిలక్షణాలను కలిగి ఉంటుంది.

  • వణుకుడు క్రమంగా ఒక-వైపు చేతికి మాత్రమే ప్రారంభమై మరోవైపు చేతికి కూడా  వ్యాపించే ప్రకంపనలు (రెండు వైపుల చేతులను బాధించేదిగా ఉంటుంది)గా మారతాయి.
  • చేతుల్ని కదిలించే కొద్దీ చేతుల వణుకుడు తీవ్రమవుతుంది.  
  • ఒత్తిడి , అలసట, ఉత్ప్రేరకాల వాడకం, తదితరాల వలన చేతుల వణుకుడు తీవ్రతరమవుతుంది.
  • దుర్బలత్వం, అస్థిరతతో కూడిన నడక (ataxia) వంటి సాధారణ లక్షణాలు

బట్టలు తొడుక్కోవడం, గ్లాసు లేదా కప్పు పట్టుకొని తాగడం లేదా తినడం లేదా షేవింగ్ వంటి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం కష్టంగా తయారవుతుంది, ఈ లక్షణాలు మరింత సమస్యాత్మకంగా మారతాయి. రాయడం కూడా కష్టం అవుతుంది, దీంతో  చట్టపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

చేతుల వణుకుడు (హ్యాండ్ ట్రెమర్లు) సాధారణంగా ముఖ్యమైన వణుకుల్ల (నాడీ వ్యవస్థ రుగ్మత) కారణంగా లేదా పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా సంభవిస్తాయి. ఈ రెండు రకాలైన వ్యాధులూ జన్యుపరమైన రుగ్మతలే. జన్యువుల్లో పరివర్తన కారణంగా కూడా ఈ రెండువణుకువ్యాధులు రావడం జరుగుతుంది. .

చేతుల వణుకుడు రుగ్మతకు  ఇతర కారణాలు:

చేతుల వణుకుడు వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కుటుంబం చరిత్ర మరియు సరైన క్లినికల్ పరీక్షలతో పాటు రోగి సంపూర్ణ వైద్య చరిత్ర సాధారణంగా చేతుల వణుకుడు రుగ్మత నిర్ధారణను నిర్ధారిస్తాయి. పూర్తి రక్త గణన (CBC), విటమిన్ బి 12 స్థాయిలు, మరియు మెదడు CT స్కాన్ వంటి సాధారణ పరిశోధనల వంటి కొన్ని పరీక్షల ద్వారా చేతుల వణుకుడు వ్యాధికి ఇతర కారకాలను తోసిపుచ్చడంలో సహాయకారి అవుతాయి.

చేతులు వణికే రుగ్మతకు చికిత్స పద్ధతులు:

చేతులు వణికే రుగ్మతను (హ్యాండ్ ట్రైమర్లు) నయం చేయలేము, కానీ వ్యాధి లక్షణాలను  మెరుగుపర్చడానికి సహాయపడే కొన్ని చికిత్స పద్ధతులు కింది విధంగా ఉన్నాయి:

  • మందులు - బీటా-బ్లాకర్స్ (ఉదా., ప్రొప్ర్రానోలోల్ మరియు ప్రిమిడోన్) వంటి ఔషధాలు, మూర్ఛవ్యాధి మందులు, బొటోక్స్ (తాత్కాలిక మత్తు మందు) మరియు ఆందోళనను తగ్గించే ఔషధాలు చేతుల వణుకుడు వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి . .
  • శస్త్ర చికిత్స - లోతైన మెదడు ఉద్దీపన మరియు థాలమోటోమీ శస్త్ర చికిత్సలు వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.
  • శారీరక చికిత్స - బరువులను ఉపయోగించడం, మణికట్టు పట్టీలు ధరించడం (మణికట్టు బరువులు) మరియు ఒత్తిడి బంతి వ్యాయామాలు చేతుల వణుకుడు రుగ్మత తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Tremor
  2. National Institute of Neurological Disorders and Stroke. [Internet]. U.S. Department of Health and Human Services; Tremor Fact Sheet.
  3. Ibáñez J. et al. PLoS One. 2014 Mar 25;9(3):e93159. doi: 10.1371/journal.pone.0093159. eCollection 2014. PMID: 24667763
  4. Wissel J, Masuhr F, Schelosky L, Ebersback G, Poewe W. Quantitative Assessment of Botulinum Toxin Treatment in 43 Patients with Head Tremor. Mov Disord 1997; 12:722–726.
  5. National Health Service [Internet] NHS inform; Scottish Government; Tremor or shaking hands

చేతులు వణికే రుగ్మత వైద్యులు

Dr. Hemant Kumar Dr. Hemant Kumar Neurology
11 Years of Experience
Dr. Vinayak Jatale Dr. Vinayak Jatale Neurology
3 Years of Experience
Dr. Sameer Arora Dr. Sameer Arora Neurology
10 Years of Experience
Dr. Khursheed Kazmi Dr. Khursheed Kazmi Neurology
10 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

Lab Tests recommended for చేతులు వణికే రుగ్మత

Number of tests are available for చేతులు వణికే రుగ్మత. We have listed commonly prescribed tests below: