గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మే (మెదడు మరియు వెన్నులో కంతి) అంటే ఏమిటి?
మెదడు మరియు వెన్నులో కంతి (గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మే-GBM) అనేది మెదడు మరియు వెన్నుపాములో వేగంగా పెరిగే ప్రాణాంతకమైన (క్యాన్సర్) కంతి లేక గడ్డ. ఈ రకమైన కణితి మెదడు మరియు వెన్నుపాములో కనపడే నరాల కండర కణజాలం నుండి ఏర్పడుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కణితి వేగంగా పెరుగుతుంటుంది కాబట్టి, నాడీ వ్యవస్థ యొక్క పనితీరుపై తీవ్రమైన నొప్పిప్రభావాన్ని కలిగి ఉంటుందిది. మెదడు, వెన్నులో కంతి (GBM) యొక్క లక్షణాలు ఇలా ఉండవచ్చు:
- జరిగిన సంఘటనలు (ఈవెంట్స్) గుర్తుంచుకోవడం లేదా వాటిని గుర్తుచేసుకోవడం కష్టమవుతుంది (మరింత సమాచారం: మెమరీ నష్టం కారణాలు)
- భావోద్వేగ అస్థిరత
- అసంకల్పిత కదలికలు
- దృష్టి సంబంధమైన ఇబ్బందులు
- వినికిడి సమస్యలు
- మాట్లాడడంలో ఇబ్బందులు
- మూర్చలు
- తరచుగా మానసికావస్థలో మార్పులు
- వికారం మరియు వాంతులు
- తరచుగా తీవ్రమైన తలనొప్పులు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మెదడు, వెన్నులో కంతి పెరగడానికి ప్రాధమిక కారణం తెలియదు. ఏదేమైనప్పటికీ, మెదడు, వెన్నుపాములో కంతి పెరగడానికి పర్యావరణం, జన్యుపరకారణాలు మరియు వృత్తిపరమైన ప్రమాదాలు వంటి వివిధ అంశాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి అధ్యయనాలు ఇంకా నిర్వహించబడుతున్నాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
శారీరక పరీక్ష ద్వారా రోగి యొక్క లక్షణాలను విశ్లేషించడంతో రోగ నిర్ధారణ ప్రారంభమవుతుంది. రోగి యొక్క వైద్య చరిత్ర మరియు వారి కుటుంబం వైద్య చరిత్ర గురించి డాక్టర్ విచారణ జరిపి తెలుసుకుంటాడు.
నరాల వైద్య నిపుణులు కింది విషయాల్ని అంచనా వేయడం కోసం న్యూరోలాజికల్ పరీక్ష నిర్వహిస్తారు:
- ప్రతిచర్యలు
- సమన్వయం
- నొప్పి ప్రతిస్పందన
- కండరాల బలం
వ్యాధి లక్షణాల ప్రాధమిక అంచనా తరువాత, వైద్యుడు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI), కంప్యూట్ టోమోగ్రఫీ (CT) మరియు పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలను మెదడు యొక్క చిత్రాలను పొందటానికి మరియు వాపు లేదా అసాధారణ పెరుగుదలను గుర్తించడానికి నిర్వహిస్తారు.
మెదడు, వెన్నుపాములో కంతి యొక్క రోగ నిర్ధారణలను ధృవీకరించడానికి జీవాణు (biopsy) పరీక్ష (మెదడు కణజాల పరీక్ష) చేయవచ్చు.
ప్రస్తుతానికి మెదడు, వెన్నుపాములో పెరిగే కంతి రుగ్మతను నయంచేసే చికిత్స లేదు. చికిత్స వ్యాధి లక్షణాల తీవ్రతను తగ్గించటానికి మరియు రోగి మనుగడను పొడిగించేందుకు కృషి చేస్తుంది..
ఈ చికిత్సలో 3 ప్రధాన కోర్సులు ఉన్నాయి:
- రేడియేషన్ థెరపీ: కణితి కణాలను నాశనం చేయడానికి మరియు చుట్టుపక్కల ఉన్న కణజాలాలకు నష్టం జరగకుండా ఉండేందుకు రేడియేషన్ థెరపీ ఉపయోగించబడుతుంది. ఈ చికిత్స కణితి పెరుగుదలను నిరోధిస్తుంది.
- కెమోథెరపీ: కెమోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోవడాన్ని నివారించేందుకు మందులను ఉపయోగించుకుంటుంది . ఈ మందులు నోటి ద్వారా లేదా సూది మందులు ద్వారా రోగికి నిర్వహించబడతాయి. కీమోథెరపీ మందులు వికారం మరియు వాంతులు వంటి దుష్ప్రభావాలు సృష్టించగలవు.
- శస్త్రచికిత్స: మెదడు నుండి క్యాన్సర్ కణజాలాన్ని తొలగించేందుకు కెమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీలతో కూడుకున్న శస్త్ర చికిత్స ఉంటుంది.