గ్లాకోమా అంటే ఏమిటి?
గ్లాకోమా అనేది కంటిలో ఒత్తిడికి పెరిగిన కారణంగా ఆప్టిక్ నరాలు (కంటి నరాలు) దెబ్బతినే ఒక రకమైన వ్యాధి. అదనపు ద్రవం కారణంగా కంటి ముందు భాగంలో ఒత్తిడి పెరుగుతుంది దానిని గ్లాకోమాగా పిలుస్తారు. గ్లాకోమా రెండు రకాలు:
- ఓపెన్-యాంగిల్ గ్లాకోమా (Open-angle glaucoma)- ఇది గ్లాకోమాలలో సాధారణ రకం మరియు దీనిని వైడ్-యాంగిల్ గ్లకోమా (wide-angle glaucoma) అని కూడా పిలుస్తారు.
- యాంగిల్-క్లోసుర్ గ్లాకోమా (Angle-closure glaucoma)- ఇది తక్కువగా ఉంటుంది మరియు అక్యూట్ లేదా క్రానిక్ యాంగిల్-క్లోసుర్ లేదా నారో-యాంగిల్ గ్లాకోమా అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా కంటిశుక్లం మరియు దగ్గరవి మసకగా/సరిగ్గా కనిపించకపోవడం (farsightedness) ముడిపడి ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ వ్యాధి యొక్క సంకేతాలు మరియు లక్షణాలు చాలా తేలికపాటివిగా, అందువల్ల సుదీర్ఘకాలం పాటు గుర్తించబడవు. మొదటి సంకేతం సాధారణంగా పరిధీయ దృష్టి (peripheral vision) లోపం కలుగడం.
ఈ క్రింద గ్లాకోమా యొక్క లక్షణాలు ఉన్నాయి:
- కాంతి-వెదజల్లే (light-emitting) వస్తువుల చుట్టూ హాలోస్ (halos,కాంతి చుట్టూ వెలుతురూ కనిపించడం) కనిపించడం.
- చూపులో లోపం.
- కంటిలో ఎరుపుదనం.
- మసకగా కనిపించే కన్ను(శిశువుల్లో).
- దురద మరియు నొప్పి కూడిన కళ్ళు.
- సన్నని లేదా అస్పష్టమైన దృష్టి.
- వికారం మరియు వాంతులు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అదనపు ద్రవం కారణంగా కంటిలో ఒత్తిడి పెరుగడం గ్లాకోమాకు కారణం. అయినప్పటికీ, గ్లాకోమా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచే పలు అంశాలు:
- వయస్సు - వయసుతో పాటు గ్లాకోమా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ.
- జాతియత (Ethnicity) - ఆఫ్రికన్, కరేబియన్ మరియు ఆసియా జనాభాకు అధిక ప్రమాదం ఉంది.
- కుటుంబ చరిత్ర - తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు గ్లాకోమా ఉన్నట్లయితే అప్పుడు ఇది సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- ఇతర ఆరోగ్య సమస్యలు- స్వల్ప దృష్టి (short-sightedness), దూరదృష్టి (farsightedness) మరియు మధుమేహం వంటివి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
గ్లాకోమా వంటి కంటి సమస్యలను గుర్తించడానికి సాధారణ కంటి పరీక్ష ఉపయోగపడుతుంది. కంటి ఒత్తిడిని పరీక్షించడానికి, టొనోమెట్రీ (tonometry) అని పిలువబడే ఒక పరీక్షను నిర్వహిస్తారు. అంతేకాకుండా, పరిధీయ దృష్టిని (peripheral vision) తగ్గుదలను పరీక్షించడానికి విజువల్ ఫీల్డ్ టెస్ట్ (visual field test) నిర్వహించబడుతుంది.
గ్లాకోమా నిర్ధారణకు ముందు కోల్పోయిన దృష్టిని (చూపుని) తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు, కానీ సమస్య మరింత తీవ్రమవడాన్ని ఆపవచ్చు. చికిత్స గ్లాకోమా రకం మీద ఆధారపడి ఉంటుంది. గ్లాకోమాకు అందుబాటులో ఉన్న సాధారణ చికిత్సలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- స్టెరాయిడ్ కంటి చుక్కలు (eye drops) - కళ్ళలో ఒత్తిడి తగ్గించడానికి.
- లేజర్ చికిత్స - నిరోధిత ఆప్టిక్ డ్రైనేజ్ (drainage) గొట్టాలను తెరవటానికి లేదా కళ్ళలో ద్రవం ఉత్పత్తిని తగ్గించడానికి.
- శస్త్రచికిత్స - కంటి మూలలో ఇరుకైన నరాన్ని విస్తరించడం ద్వారా ద్రవం యొక్క పారుదలని (బయటకు) పెంచేందుకు.