గర్భధారణ సమయ మధుమేహం అంటే ఏమిటి?
గర్భధారణ సమయ మధుమేహం అనేది ప్రతి 100 మంది గర్భిణీ స్త్రీలలో 7 మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ స్థితి. గర్భధారణకు ముందు సాధారణ రక్త చక్కెర స్థాయిల ఉన్న స్త్రీలు కొంతమందిలో గర్భధారణ సమయంలో గ్లూకోస్ అసహనం అభివృద్ధి (glucose intolerance) చెందుతుంది. చాలామంది స్త్రీలలో గర్భధారణకు సంబంధించిన హార్మోన్ల మార్పుల వలన రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవుతాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చాలా సందర్భాలలో, గర్భధారణ సమయ మధుమేహంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. మార్పులు చాలా చిన్నవిగా ఉంటాయి, చాలామంది మహిళలు ఆ మార్పులు అసాధారణమైనవని గుర్తించలేరు. అంతేకాకుండా, సాధారణ గర్భధారణతో ముడిపడి ఉండే అనేక రకాల మార్పులు శరీరంలో కలుగుతాయి. అయితే, ఈ క్రిందివాటిని గమనించినట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోవాలి:
- మూత్ర విసర్జన అవసరం బాగా పెరిగి పోవడం
- అసాధారణమైన దాహము యొక్క భావన
- చికిత్సతో సులభంగా నయంకాని మరియు పునరావృత్తమయ్యే అంటువ్యాధులు
- అలసట
- వికారం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కొన్నిసార్లు, మహిళలలో గుర్తించబడని మధుమేహం ఉండవచ్చు అది గర్భధారణ సమయంలో కనుగొనబడవచ్చు. ఎక్కువగా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీసే హార్మోన్ల మార్పులు కారణంగా సంభవిస్తుంది. గర్భస్థ శిశువుకు పోషకాలని అందించే ప్లాసెంటా (మాయ) కూడా, మహిళ యొక్క శరీరంలో అనేక హార్మోన్ల ఉత్పత్తిని కలిగిస్తుంది. ఈ హార్మోన్లు, వాటి స్వభావం వల్ల, అధిక గ్లూకోజ్ స్థాయిలను ప్రేరేపిస్తాయి. మధుమేహం వచ్చే అవకాశం ఉన్న మహిళలలో గర్భధారణ సమయ మధుమేహం అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు, ప్రీ-డయాబెటిక్, మధుమేహం యొక్క కుటుంబ చరిత్ర, హైపర్ టెన్షన్ లేదా థైరాయిడ్ లోపాలు వంటివి ఇతర ప్రమాద కారకాలు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
గర్భధారణ సమయంలో ప్రినేటల్ (prenatal [ప్రసూతికి ముందు]) మరియు ఆంటీనేటల్ (antenatal) పరీక్షలలో భాగంగా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించడం జరుగుతుంది. ఇది ఒకే పరీక్షలో చేయబడుతుంది, దీనిలో గర్భిణీ స్త్రీకి చక్కెర ఉన్న ద్రవాన్ని త్రాగడానికి ఇస్తారు దాని తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పరీక్షిస్తారు. దీనిని ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అని పిలుస్తారు. ప్రత్యామ్నాయంగా, రక్తంలో చెక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్లయితే మాములుగా రక్త నమూనా సేకరించి పరీక్షిస్తారు దాని తర్వాత నిర్దిష్ట ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
చికిత్సలో ముఖ్యంగా చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలకి తీసుకురావడం లక్ష్యంగా ఉంటుంది. దీనిని ఆహార మార్పులు మరియు క్రమబద్ధమైన వ్యాయామంతో సరిచేయవచ్చు. ఆహార మార్పులు మాత్రమే లక్షణాలను మెరుగుపరచకపోతే వైద్యులు మెట్ఫోర్మిన్ (metformin) లేదా ఇన్సులిన్ (insulin) వంటి మందులను సూచించవచ్చు. గర్భధారణ సమయం మొత్తము మరియు ప్రసవం తర్వాత కూడా చెక్కెర స్థాయిల యొక్క క్రమమైన పర్యవేక్షణ అవసరం.