మంచు తిమ్మిరి (ఫ్రోస్ట్బైట్) అంటే ఏమిటి?
మంచు తిమ్మిరి (ఫ్రోస్ట్బైట్) అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రతలకు గురైన కారణంగా చర్మానికి గాయాలు ఏర్పడే ఒక పరిస్థితి. దీర్ఘకాలం పాటు తక్కువ ఉష్ణోగ్రతలలో ఉండే ఆర్మీ సిబ్బంది లేదా శీతాకాలపు క్రీడాకారుల (వింటర్ స్పోర్ట్స్ ప్లేయర్స్) లో ఇది సాధారణం.
సాధారణంగా ప్రభావితమయ్యే భాగాలు కాలివేళ్లు, చేతులవేళ్లు, బుగ్గలు మరియు గడ్డం.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- మంచు తిమ్మిరి యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు-
- తిమ్మిరి.
- చర్మం ఎరుపు, తెలుపు లేదా నీలం రంగులోకి మారడం.
- బొబ్బలతో చర్మం గట్టిపడటం.
- మంచు తిమ్మిరి వివిధ దశలుగా సంభవిస్తుంది, మొదటి దశ కంటే ప్రతి దశ మరింత తీవ్రంగా ఉంటుంది.
- మొదటి డిగ్రీ- ఇది ప్రారంభ దశ దీనిలో తాత్కాలిక తిమ్మిరి మరియు పై చర్మ నష్టం ఉంటుంది.
- రెండో డిగ్రీ- బొబ్బలు పెరగడంతో పాటు, చర్మం గట్టిపడటం మరియు తిమ్మిరి దీర్ఘకాలం పాటు ఉంటుంది.
- మూడవ డిగ్రీ- చర్మం యొక్క లోపలి పొరలు గడ్డకట్టుకుపోతాయి, అలాగే నొప్పి మరియు పుండ్లు ఏర్పడతాయి, ఇది కొన్ని వారాలపాటు ఉంటుంది.
- నాలుగో డిగ్రీ- ఎముకలు, కండరాలు, మరియు లోపలి రక్త నాళాలు కూడా ప్రభావితమవుతాయి, చర్మం నల్లగా మారుతుంది దానితో పాటు తీవ్ర శాశ్వత చర్మ నష్టం/హాని కలుగుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- శీతల వాతావరణ పరిస్థితులకు, మంచు, ఐసు లేదా చల్లటి ద్రవాలకు దీర్ఘకాలం పాటు గురికావడం (exposure) అనేవి మంచుతిమ్మిరిని కలిగించే ముఖ్య కారకాలు.
- శీతాకాలంలో చాలా చల్లని చలిగాలులు మంచుతిమ్మిరి సంభవించే అవకాశాలను పెంచుతాయి.
- మంచుతిమ్మిరిని కలిగించే కొన్ని ప్రమాద కారకాలు వీటిని కలిగి ఉంటాయి-
- మధుమేహం మరియు హైపోథైరాయిడిజం.
- డీహైడ్రేషన్ (నిర్జలీకరణమ).
- మద్యపానం మరియు ధూమపానం.
- చర్మానికి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం.
- మునుపటి శారీరక గాయం లేదా మంచుతిమ్మిరి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
- మంచుతిమ్మిరిని ప్రభావిత ప్రాంతం యొక్క వైద్య పరిశీలన, రోగి యొక్క ఇటీవల కార్యకలాపాలు మరియు ఇతర లక్షణాల ఆధారంగా నిర్దారించవచ్చు.
- మంచుతిమ్మిరి యొక్క తీవ్రతని తనిఖీ చేయడానికి మరియు లోపలి చర్మ పొరలు, ఎముకల యొక్క పరిస్థితిని అంచనా వేయడానికి, వైద్యులు ఎక్స్-రే, సిటి (CT) స్కాన్ లేదా ఎంఆర్ఐ (MRI) స్కాన్ లను ఆదేశించవచ్చు.
- మంచుతిమ్మిరి వలె ఉండే కొన్ని పరిస్థితులు ఫ్రోస్ట్నిప్ (frostnip), వాస్కులైటిస్ (vasculitis), బులోస్ పెమ్ఫిగాయిడ్ (bullous pemphigoid) మరియు ట్రెంచ్ ఫుట్ (trench foot) వంటివి.
చికిత్స వెంటనే తీసుకోవాలి మరియు వీటిని కలిగి ఉంటుంది:
- ఎవరైనా వారు మంచుతిమ్మిరికి గురౌతున్నారని అనుమానించినట్లయితే, వారు వేడి ప్రాంతానికి వెళ్లి, ప్రభావిత శరీర భాగానికి వేడి తగిలేలా చెయ్యాలి, అది తిరిగి మళ్ళి గడ్డకట్టకుండా చూసుకోవాలి. వెడి నీటి స్నానం ద్వారా లేదా ప్రభావిత శరీర భాగాన్ని రుద్దడం ద్వారా తిరిగి వేడిని పొందవచ్చు.
- మంచుతిమ్మిరి కోసం సూచించే మందులు నొప్పినివారుణులు మరియు సంక్రమణ (ఇన్ఫెక్షన్) అనుమానం ఉన్నట్లయితే యాంటీబయాటిక్స్ వంటివి. అవసరమైతే వైద్యులు వాపు నిరోధక (anti-inflammatory ) మందులను కూడా సూచిస్తారు.
- దెబ్బతిన్న కణజాలం, సరిచేయడానికి మించి దెబ్బతిన్నట్లయితే, ఆస్పిరేషన్ (aspiration) మరియు డెబ్రీడ్మెంట్ (debridement, గాయాన్ని శుభ్రపర్చడం) వంటి ప్రక్రియల ద్వారా తొలగించబడుతుంది.
- తీవ్రమైన మంచుతిమ్మిర్లకి (ఫ్రోస్ట్బైట్లకు) ప్రభావిత శరీర ప్రాంతాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించవలసి ఉంటుంది.
- హైపర్ బెరిక్ ఆక్సిజన్ థెరపీ (Hyperbaric oxygen therapy) అనేది మంచుతిమ్మిర్ల చికిత్సకు ఒక కొత్త మరియు తక్కువగా తెలిసిన పద్ధతి.