కాలివేలు విరగడం (ఫ్రాక్చర్) అంటే ఏమిటి?
పాదాలకి ఏదైనా ఆకస్మిక గాయం లేదా ఒక మాములు గాయం అనేది ఎముకను రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విరిగిపోయెలా లేదా ఎముక మీద సన్నని పగుళ్ళు (హెయిర్లైన్ ఫ్రాక్చర్స్) ఏర్పడేలా చేస్తుంది. గాయం తీవ్రత ఆధారంగా, అనేక చికిత్సా విధానాలు ఉన్నాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- నిరంతరమైన సలుపుతో కూడిన నొప్పి విరిగిన వేలి యొక్క ప్రాధమిక లక్షణం.
- వేలి మీద వాపు కూడా సంభవిస్తుంది.
- విరిగిన కాలి వేలి యొక్క ఏవిధమైన కదలికైనా బాధాకరంగా ఉంటుంది, ఇది నడవడాన్నీ లేదా కదలడాన్నీ కష్టంగా చేస్తుంది.
- సన్నని ఫ్రాక్చర్ (హెయిర్లైన్ ఫ్రాక్చర్స్) సందర్భంలో, నొప్పి తక్కువగా ఉంటుంది మరియు ఏ ఇబ్బంది లేకుండా నడవడం కూడా సాధ్యమవుతుంది.
- పగులు (ఫ్రాక్చర్ ) చాలా తీవ్రంగా ఉంటే, కాలివేలు నీలం రంగులోకి మారుతుంది మరియు వైకల్యంతో కనిపిస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- వేలు మీద ఏదైనా భారీ వస్తువు పడినప్పుడు ఫ్రాక్చర్ జరుగవచ్చు. కాలి వేళ్ళు కాళ్ళ నుండి ముందుకి ఉండే పొడుగైన భాగం కాబట్టి,సాధారణంగా వేళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ.
- పాదాలు ఏవైనా గట్టివస్తువులకి ఆకస్మికంగా గుద్దుకున్నపుడు కూడా ఫ్రాక్చర్ ఏర్పడవచ్చు.
- బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్) కారణంగా బలహీనమైన ఎముకలు ఉన్న వ్యక్తులు తరచూ ఒత్తిడి పగుళ్ల (stress fractures) తో బాధపడుతుంటారు. దీని అర్థం, ఎక్కవగా నడవడం వలన లేదా సరిపడని బూట్లు కారణంగా కూడా ఎముకలు విరిగిపోతాయి.
- ఎముకలపై నిరంతర ఒత్తిడి లేదా అధిక కదలికల కారణంగా కూడా ఒత్తిడి పగుళ్లు లేదా సన్నని పగుళ్లు (హెయిర్లైన్ ఫ్రాక్చర్స్) సంభవించవచ్చు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
కీళ్ళ వైద్యు నిపుణులు (orthopaedic doctor) వేలి యొక్క భౌతిక పరీక్ష మరియు ఎక్స్-రే ఆధారంగా వేలి ఫ్రాక్చర్ను నిర్ధారించగలరు. ఏవైన కమిలిన గాయాలు లేదా బహిరంగ పుండ్ల కారణంగా గాయమైతే, సంక్రమణను/ఇన్ఫెక్షన్ను అనుమానించవచ్చు. దాని నిర్దారణ కోసం, వైద్యులు రక్త పరీక్షను ఆదేశించవచ్చు.
చికిత్స అనేది ఫ్రాక్చర్ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.
- హెయిర్లైన్ ఫ్రాక్చర్స్ వంటి చిన్న ఫ్రాక్చర్లకు విశ్రాంతి మరియు నొప్పి నివారుణులకి మించి వేరే చికిత్స అవసరం లేదు. పగుళ్లను (ఫ్రాక్చర్ను) అదే స్థానంలో పట్టివుంచడానికి బ్యాండేజ్ సరిపోతుంది.
- ఫ్రాక్చర్ తో పాటు సంక్రమణ (ఇన్ఫెక్షన్) ఉంటే కనుక యాంటీబయాటిక్స్ సూచించబడతాయి.
- విరిగిన వేలుకి స్ప్లింట్లు (బద్ద కట్టడం) పెట్టడం వలన అది కదలికను తగ్గిస్తుంది మరియు వేలుని దృఢపరుస్తుంది.
- ఫ్రాక్చర్ వేలుని దాని స్థానం నుండి మారిపోయేలా చేస్తే, ఎముకను (వేలును) తిరిగి స్థానంలో అమర్చాలి. అదేవిధంగా, రెండు కన్నా ఎక్కువ ముక్కలుగా ఎముక విరిగితే శస్త్రచికిత్స అవసరమవుతుంది.
- పగుళ్లు కోసం గృహ సంరక్షణలో కాలుని పైకి పెట్టడం, ఐసుని ఉపయోగించడం (ప్రభావిత వేలి పై రుద్దడం) మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం వంటివి ఉన్నాయి.
- చాలా సందర్భాలలో, ఒక విరిగిన వేలు నాలుగు నుంచి ఎనిమిది వారాల్లోనే నయమవుతుంది.