ముక్కు ఫ్రాక్చర్ (ముక్కు విరగడం) అంటే ఏమిటి?
ముక్కు ఫ్రాక్చర్ అంటే ముక్కు ఎముకలో లేదా ముక్కు పక్క గోడలలో పగులు ఏర్పడడం. ఒక ముక్కు ఫ్రాక్చర్ ఇతర ముఖ ఫ్రాక్చర్స్ తో పాటు సంభవిస్తుంది. ముక్కు కార్టిలేజ్ యొక్క ఫ్రాక్చర్ ముక్కు లోపల రక్తస్రావానికి దారి తీయవచ్చు, ఇది పోగుపడి (అధికంగా చేరిపోయి) ముక్కు అవరోధానికి (బ్లాకేజ్) కారణం కావచ్చు.
ముక్కు ఫ్రాక్చర్లు ఆకస్మిక గాయాల సమయంలో పక్క వైపు నుండి కానీ, ఎదురు వైపు/(నేరుగా) నుండి కానీ ఏర్పడవచ్చు. పక్క వైపు నుండి గాయం ఐతే, ముక్కు మధ్య నుండి పక్కకు కదిలిపోతుంది. ఎదురు వైపు/(నేరుగా) గాయంలో, ముక్కు ఎముకలు ముందుకు తోయబడతాయి మరియు సాగిపోతాయి, తద్వారా ముక్కు బ్రిడ్జ్ పెద్దగా కనిపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ముక్కు ఫ్రాక్చర్ యొక్క లక్షణాలు:
- ముక్కును తాకినప్పుడు నొప్పిపుడుతుంది
- ముక్కు నుండి రక్తస్రావం
- ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో కఠినత
- నొప్పి మరియు వాపు
- కన్ను చుట్టూ కమిలిన గాయం అది 2 వారాల తరువాత తగ్గిపోతుంది
- తీవ్ర (క్రూరమైన) తలనొప్పి
- మెడ నొప్పి
- స్పృహ కోల్పోవడం
- ముక్కు లేదా ముఖానికి చీలిన గాయం
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ముక్కు ఎముకలు మరియు కార్టిలేజ్, ముఖం మీద దాని ప్రత్యేక స్థానం కారణంగా ఫ్రాక్చర్లకు అధికంగా గురవుతుంది.
ముక్కు ఫ్రాక్చర్ సాధారణంగా ఆకస్మిక గాయం కారణంగా సంభవిస్తుంది, కొన్నిసాధారణంగా కారణాలు:
- కొట్లాటలు, ప్రమాదాలు మరియు క్రీడలు
- మోటారు వాహన ప్రమాదాలు
- ముక్కు మీద ఏవైనా పడిపోవడం
ముక్కు ఫ్రాక్చర్లు ఈ విధమైన సమస్యలకు కారణం కావచ్చు:
- ముఖం సౌందర్య వైకల్యం (తగ్గిపోవడం)
- నిరంతర ముక్కు భాగం యొక్క లోపం (వైకల్యం)
- సెరెబ్రోస్పానియల్ ద్రవం (CSF) యొక్క లీకేజ్
- కంటి చుట్టూ వాపు
- ముక్కులో అవరోధం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ముక్కు ఫ్రాక్చర్ లక్షణాలను గమనించిన, వెంటనే వైద్యులని సంప్రదించండి. వైద్యులు పూర్తి అంతర్గత మరియు బాహ్య ముక్కు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష బాధాకరముగా ఉండవచ్చు. అప్పుడు వైద్యులు ఫ్రాక్చర్ స్థానాన్ని మరియు తీవ్రతను నిర్ధారించడానికి ఎక్స్-రే ని ఆదేశించవచ్చు. తీవ్రమైన ఫ్రాక్చర్ జరిగినప్పుడు, సిటి (CT) స్కాన్ అవసరమవుతుంది.
వైద్య సహాయం అందుకునే వరకు, 15 నిముషాలపాటు చన్నీటి కాపడాన్ని పెట్టాలి మరియు అది ప్రతి 1-2 గంటలకు దాన్ని పునరావృతం చేయాలి. నొప్పిని సాధారణంగా ఓవర్ ది కౌంటర్ మందులతో నియంత్రించవచ్చు. గాయం యొక్క తీవ్రతను బట్టి, ఒక బహిరంగ (ఓపెన్డ్)లేదా మూసిన (క్లోజ్డ్) పరివర్తనం (reduction) సూచించబడవచ్చు. చికిత్స చేయకపోతే, ముక్కు ఫ్రాక్చర్లు ముక్కు ఆకృతి నష్టానికి దారితీస్తాయి మరియు కంటి చూపు వైకల్యాలు మరియు శ్వాస సమస్యలు కూడా ఏర్పడవచ్చు.