దవడ విరగడం (ఫ్రాక్చర్) అంటే ఏమిటి?
ఫ్రాక్చర్ అంటే ఎముకలో చీలిక లేదా పగులు ఏర్పడడం. దవడ ఎముక విరిగినప్పుడు దీనిని దవడ విరగడం (ఫ్రాక్చర్) అని పిలుస్తారు (క్రింది దవడ). ముక్కు మరియు బుగ్గ ఎముక (పై దవడ ఎముక [cheekbone]) ఫ్రాక్చర్ల తర్వాత దవడ ఫ్రాక్చర్లు మూడవ అత్యంత సాధారణ రకాలైన ముఖ ఫ్రాక్చర్లు.
దవడ ఎముకలను వైద్యపరంగా మెండిబిల్ (క్రింది దవడ ఎముక) అని పిలుస్తారు. ఈ ఎముక చివరిలో ఉండే కాండిలిస్ (Condyles) చెవికి ముందు ఉండే టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ (temporomandibular joint) లో భాగంగా ఉంటాయి. దవడ ఫ్రాక్చర్ టెంపోరోమాండబ్యులర్ జాయింట్ దవడ యొక్క స్థానభంగానికి (స్థాన మార్పు) కారణమవుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
దవడ ఫ్రాక్చర్ యొక్క లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- ముఖం లేదా దవడలో నొప్పి అది ముఖ కదలికలప్పుడు తీవ్రమవుతుంది
- ఆహారం నమలడంలో సమస్య
- నోరు తెరవడం లేదా మూయడంలో సమస్య
- నోటిని తెరిచేటప్పుడు దవడ ఒకవైపుకి వెళ్ళిపోతుంది
- దంతాలు దెబ్బతింటాయి
- తక్కువ పెదవి యొక్క తిమ్మిరి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
దవడ ఎముక యొక్క ఫ్రాక్చర్ అనేక విధాలుగా సంభవించవచ్చు. దీనికి కారణాలు ఈవిధంగా ఉండవచ్చు:
- పిల్లలు కనిపించే విధంగా, గడ్డం మీద బరువు ఉండిపోయేలా/ఆనిపోయేలా ప్రమాదవశాత్తు పడిపోవడం
- మోటార్ సైకిల్ లేదా సైకిల్ నుండి పడిపోవడం
- దవడ మీద పిడిగుద్దులు (punch)
- క్రీడల సమయంలో పడిపోవడం
- పారిశ్రామిక దుర్ఘటన
దీనిని ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
దవడ యొక్క కదలికలను, ముఖ మీద కమిలిన గాయాలను, వైకల్యం, వాపు లేదా ఎర్రదనం వంటివి పరిశీలించడం ద్వారా వైద్యులు స్పష్టమైన శారీరక పరీక్షను నిర్వహిస్తారు. బాహ్య పరీక్ష తర్వాత, వైద్యులు నోటి లోపల చెదిరిన లేదా విరిగిన దంతాల కోసం తనిఖీ చేస్తారు. ఫ్రాక్చర్ యొక్క స్థానాన్ని మరియు తీవ్రతను నిర్ధారించడానికి పనోరమిక్ ఎక్స్-రేలు చేస్తారు.
నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి మందులు సూచించబడతాయి, మరియు మెత్తగా ఉండే ఆహారం తీసుకోమని సూచిస్తారు. స్థిరమైన ఫ్రాక్చర్లకు ఎక్కువగా పైన మరియు కింద ఉండే దంతాలకు వైరింగ్ చేయడం అవసరం. ఈ వైర్లను 6 నుంచి 8 వారాల పాటు అలాగే ఉంచుతారు. అస్థిరమైన ఫ్రాక్చర్లకు టైటానియం ప్లేట్లు మరియు మరలు సహాయంతో విరిగిన విభాగాలను/ఎముకలను స్థిరీకరించడానికి ఓపెన్ రిడక్షన్ టెక్నిక్ (open reduction technique) అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎవరికీ వారు సొంతంగా వారి దవడ యొక్క స్థానాన్ని సరిచేసుకోకూడనని సలహా ఇస్తారు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి మరియు వాపును తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు సూచిస్తారు.