తుంటి (హిప్) ఫ్రాక్చర్ అంటే ఏమిటి?
తుంటి జాయింట్ (ఉమ్మిడి) లో ఉండే ఎముకల పగులుని తుంటి (హిప్) ఫ్రాక్చర్ అని పిలుస్తారు. తుంటి (హిప్) అనేది పొత్తికడుపు (పెల్విస్) దగ్గర ఉండే తొడ ఎముక యొక్క పై భాగం నుండి ఏర్పడుతుంది మరియు అది విరిగిపోవడమనేది ప్రాణాంతకమైన సమస్యలకు దారితీయవచ్చు. చాలా వరకు తుంటి (హిప్) ఫ్రాక్చర్లు మహిళలు మరియు బలహీనమైన ఎముకలు కారణంగా 65 ఏళ్ల వయస్సు పైబడిన వ్యక్తులలో సంభవిస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ లక్షణాలు:
- పై తొడ భాగం లేదా గజ్జల ప్రాంతంలో నొప్పి
- విరిగిన ప్రాంతం వద్ద తీవ్రమైన వాపు మరియు కమిలిన గాయం
- అసౌకర్యం మరియు తుంటి (హిప్) కదలికలో కఠినత
- నడవడంలో కష్టం
- ప్రభావితమైన తుంటి (హిప్) మీద బరువును పెట్టడంలో అసమర్థత
ఇతర అసాధారణ లక్షణాలు:
-
ప్రభావిత తుంటి (హిప్) బయట వైపుగా తిరగడం లేదా తుంటి వైకల్యం సంభవించవచ్చు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అతి సాధారణ కారణాలు వీటిని కలిగి ఉంటాయి:
- తుంటి ఎముకకు నేరుగా దెబ్బ తగిలేలా చేసే ఆకస్మిక గాయాలు లేదా ప్రమాదాలు. వృద్ధులకి వారి కాళ్లు మాములుగా మెలిపడినా లేదా బలహీనమైన ఎముకల వల్ల చాలా సమయం పాటు నిలబడటం వలన కూడా తుంటి (హిప్) ఫ్రాక్చర్లు సంభవించవచ్చు, అయితే ఆకస్మిక గాయం సంభవించినట్లయితే ఇది సాధారణంగా ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేస్తుంది.
- తరచుగా వృద్దులు వారు నిలబడి ఉన్న ప్రదేశం నుండి పడిపోవడం వలన తుంటి ఫ్రాక్చర్ జరుగుతుంది.
- కొన్ని ఆరోగ్య సమస్యలు ఫ్రాక్చర్లతో ముడిపడి ఉంటాయి. అవి ఎముకలు బలహీనం చేస్తాయి (విటమిన్ D మరియు కాల్షియం లోపం, బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్), థైరాయిడ్ యొక్క అధికచర్య [ఓవర్ ఆక్టివ్]) లేదా పడిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి (చిత్తవైకల్యం, పార్కిన్సన్స్ వ్యాధి).
- కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందులు ఎముకలను బలహీనం చేస్తాయి, అయితే మత్తుమందులు మరియు యాంటిసైకోటిక్స్ పడిపోవడం (కింద పడడం) తో సంబంధం కలిగి ఉంటాయి.
- పొగాకు నమలడం లేదా మద్యపానం వంటి అలవాట్లు బలహీనమైన ఎముకలతో సంబంధం కలిగి ఉంటాయి మరియు ఎముక గాయాలు నయం కావడంలో ఆలస్యం కలిగిస్తాయి.
- శారీరక స్తబ్దత (శ్రమ లేకపోవడం) మరియు కూర్చుని ఉండే జీవనశైలి ఎముక సాంద్రతను తగ్గిస్తాయి మరియు ఎముకల బలహీనతతో ముడిపడి ఉంటాయి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగ నిర్ధారణకి ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం, లక్షణాల అంచనా మరియు శారీరక పరీక్ష సహాయం చేస్తాయి.
ఎక్స్-రే ద్వారా ఫ్రాక్చర్ ను సులభంగా నిర్ధారించవచ్చు. వివరణాత్మక అంచనా కోసం ఎంఆర్ఐ (MRI) లేదా సిటి (CT)స్కాన్ అవసరం కావచ్చు.
చికిత్స ఫ్రాక్చర్ స్థానం మరియు రకం మీద ఆధారపడి ఉంటుంది. తుంటి పగుళ్లును సరిచేయడానికి సాధారణంగా శస్త్రచికిత్స అవసరం.
తీవ్రమైన పరిస్థితుల విషయంలో, శస్త్రచికిత్సను నివారించి, కేవలం లక్షణాల ఉపశమనం మరియు సంరక్షణ ఇవ్వబడతాయి.
కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే, శస్త్రచికిత్సను నివారించి, రోగికి పూర్తి విశ్రాంతి మరియు స్థిరీకరణను (ఇమ్మొబిలైసెషన్) సిఫార్సు చేస్తారు.