ఫోలిక్యులైటిస్ అంటే ఏమిటి?
ఫోలిక్యులైటిస్ అనేది వెంట్రుకల/జుట్టు ఫోలికల్ లను ప్రభావితం చేసే ఒక సాధారణ చర్మ వ్యాధి. ఈ సంక్రమణ చర్మం లేదా నెత్తిపై ఎక్కడైనా సంభవించవచ్చు. సాధారణంగా, తల మరియు మెడ ప్రాంతం, చంకలు, గజ్జలు, మరియు పిరుదుల వంటి భాగాలలో అంచున పెరిగే వెంట్రుకలలో ఇది కనిపిస్తుంది. ఇది ఒక మోటిమ మాదిరిగానే ఉంటుంది కానీ సంక్రమణను సూచించే విధంగా గాయం చుట్టూ ఎర్రని వలయం (రింగ్) ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఫోలిక్యులైటిస్ చర్మ దురద, ప్రభావిత ప్రాంతంలో నొప్పి వంటి వివిధ రకాల లక్షణాలు చూపుతుంది లేదా కొన్ని సందర్భాలలో ఏవిధమైన లక్షణనలను చూపకపోవచ్చు. ఫోలిక్యులైటిస్ లక్షణాలు యొక్క జాబితా ఈ విధంగా ఉంటుంది-
- ఎర్రని పొక్కులు లేదా పైన తెల్లని రంగు ఉండే మొటిమలు వెంట్రుకల ఫోలికిల్స్ సమీపంలోగుంపుగా కనిపిస్తాయి.
- చీము నిండిన బొబ్బలు పగిలి తెరుచుకుని ఉంటాయి.
- ఆ పరిసర చర్మంలో దురద మరియు మంట.
- చర్మం సున్నితంగా మారడం.
- చర్మంపై ఉబ్బిన బొడిపె లేదా గడ్డ.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఫోలిక్యులైటిస్ తరచుగా బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లేదా కొన్ని రసాయనాల కారణంగా జుట్టు ఫోలికల్స్ యొక్క సంక్రమణ వలన సంభవిస్తుంది.
- స్టఫైలోకోకల్ (Staphylococcal) ఫోలిక్యులైటిస్ అనేది స్టఫైలోకోకస్ ఆరియస్ (Staphylococcus aureus) వలన కలుగుతుంది. ఈ బాక్టీరియల్ సంక్రమణ/ఇన్ఫెక్షన్ సాధారణంగా జ్వరం లేకుండా సంభవిస్తుంది.
- సూడోమోనాస్ ఎరుజినోసా (Pseudomonas aeruginosa) హాట్ టబ్ ఫోలిక్యులైటిస్ (hot tub folliculitis) కు కారణమవుతుంది, ఇది స్నానపు తొట్టెలను సరిగ్గా శుభ్రపర్చని కారణంగా సంభవిస్తుంది.
- గ్రామ్ నెగటివ్ (Gram negative) ఫోలిక్యులైటిస్, ఇది అరుదైనది మరియు యాంటిబయోటిక్ చికిత్స వలన సంభవిస్తుంది.
- పిటిరోస్పోరమ్ ఓవలే (Pityrosporum ovale) వీపు మరియు ఛాతీ మీద మోటిమలు వంటి చర్మ దద్దుర్లు కారణమవుతుంది, దానిని పిటిరోస్పోరమ్ ఫోలిక్యులైటిస్ అని అంటారు.
- నెత్తి మీద ఉండే టినియా క్యాపిటీస్ (Tinea capitis) లేదా రింగ్ వార్మ్, జుట్టు ఫోలికల్స్ యొక్క ఫంగల్ సంక్రమణకు కారణమవుతుంది.
- హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (Herpes simplex virus) పురుషులలో పునరావృతమయ్యే ముఖ ఫోలిక్యులిటిస్ కారణమవుతుంది ఇది క్షౌరము చేసుకునే రేజర్ ఉపయోగించే మగవారిలో కనిపిస్తుంది.
- జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో చేసే దీర్ఘకాలిక షేవింగ్ (క్షౌరము) మెకానికల్ ఫోలిక్యులిటిస్ కారణమవుతుంది.
- క్రిములు లేదా ఆయింట్మెంట్లు (ointment) లేదా మాయిశ్చరైజర్స్ వెంట్రుకల ఫోలికల్ యొక్క పెరుగుదలని అడ్డుకున్నపుడు అది వాపుకు దారితీసి ఒక్లుషన్ ఫోలిక్యులిటిస్ (Occlusion folliculitis) ను ఏర్పరుస్తుంది.
- బొగ్గు టారు (coal tars) వంటి కొన్ని రసాయనాలు మరియు కార్టికోస్టెరాయిడ్స్ యొక్క అధిక వినియోగం కూడా ఫోలిక్యులిటిస్ కు కారణమవుతాయి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు ప్రభావిత చర్మం ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలిస్తారు మరియు రోగి ఆరోగ్య చరిత్రను గురించి తెలుసుకుంటారు. వ్యాధి సోకిన చర్మం నమూనా యొక్క సూక్ష్మదర్శిని (microscopic ) పరిశీలన కోసం వైద్యులు డెర్మోస్కోపీ (dermoscopy) ను కూడా ఉపయోగించవచ్చు. చికిత్సకు స్పందన సరిగ్గా లేనట్లయితే, అంటురోగం/సంక్రమణను తనిఖీ చేయడానికి శ్వాబ్ (swab) పరీక్ష జరుగుతుంది. దీర్ఘకాలిక కేసుల్లో చర్మపు జీవాణుపరీక్ష (biopsy) అవసరమవుతుంది.
ఫోలిక్యులిటిస్ యొక్క కారణం ఆధారంగా, సమయోచిత యాంటీ ఫంగల్ లేదా యాంటిబయోటిక్ క్రీమ్లు, మందులను, మరియు షాంపూ సూచించబడతాయి. పెద్ద బొబ్బ లేదా కురుపు కనుక ఉంటే ఒక చిన్నపాటి శస్త్రచికిత్సను నిర్వహిస్తారు. లేజర్ థెరపీను ఉపయోగించి ఫోలికల్ సంక్రమణను తీసివేయవచ్చు.
ప్రభావిత ప్రాంతం మీద వెచ్చని తడి వస్త్రాన్ని కప్పి ఉంచితే అసౌకర్యం నుండి ఉపశమనం పొందవచ్చు. యాంటీ బాక్టీరియల్ సబ్బుతో రోజుకు రెండుసార్లు రోజూ కడుగుతూ ఉంటే నిరంతర లేదా పునరావృత్తమయ్యే ఫోలిక్యులైటిస్ను నిరోధించవచ్చు.