చర్మం ఎర్రబారడం (ఫ్లషింగ్) అంటే ఏమిటి?
చర్మంలోని రక్తనాళాల వ్యాకోచం కారణంగా చర్మం ఎర్రబారడం (ఫ్లషింగ్) జరుగుతుంది (సంభవిస్తుంది). రెండు రకాలైన చర్మం ఎర్రబారడాలు (ఫ్లషెస్) ఉన్నాయి:
- నరములు రక్తనాళాల మీద పనిచేసి ఎరుపుదనంతో పాటు చెమటను కలిగిస్తే దానిని వెట్ ఫ్లషింగ్ (Wet flushing) అని పిలుస్తారు.
- కొన్ని ఎజెంట్లు రక్తనాళాలపై ప్రత్యక్ష చర్యలను చూపి చెమట లేకుండా ఎరుపుదనం కలిగిస్తే దానిని డ్రై ఫ్లషింగ్ (Dry flushing) అని పిలుస్తారు.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా చర్మం ఎర్రబారడం (ఫ్లషింగ్) తో ముడిపడి ఉన్న లక్షణాలు:
- ముఖ వాపు (ఎడెమా).
- ఊపిరి పీల్చుకునే సమయంలో గుర్రుగుర్రుమనే శబ్దం
- అధిక రక్తపోటు
- తలనొప్పి
- ఉర్టికేరియా లేదా దద్దుర్లు.
- గుండెదడ లేదా క్రమరహిత హృదయ స్పందన.
- చెమటలు.
- హైపోటషన్ (అల్ప రక్తపోటు).
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చర్మం ఎర్రబారడం (ఫ్లషింగ్) యొక్క సాధారణ కారణాలు:
- డ్రగ్స్: వాసోడైలేటర్లు (Vasodilators, రక్తనాళములను పెద్దవిగా చేసేవి), మోర్ఫిన్ (morphine), మరియు అనేక ఇతర మందులు వాటి దుష్ప్రభావాలలో భాగంగా చర్మాన్ని ఎర్రబారేలా చేయవచ్చు.
- మద్యం (ఆల్కహాల్): డైసల్ఫీరం (disulfiram), క్లోరొప్రోపమైడ్ (chlorpropamide) వంటి మందులను మరియు పుట్టగొడుగుల వంటి ఆహారాలను మద్యంతో పాటుగా తీసుకున్నపుడు అవి చర్మం ఎర్రబారడానికి కారణమవుతాయి.
- ఆహార సంకలనాలు (Food additives): మాంసం మరియు పంది మాంసమును నిల్వవుంచేందుకు వేసిన సోడియం నైట్రేట్ కొంత మందిలో చర్మం ఎర్రబడడానికి కారణం కావచ్చు. బీర్ మరియు వైన్లో ఉండే సల్ఫేయిట్లు కూడా ఫ్లషింగ్కు కారణం కావచ్చు.
- తినడం: వేడిగా మరియు కారంగా ఉన్న ఆహారాలు, అలాగే వేడి పానీయాలు (టీ, కాఫీ వంటివి) కొంత మందిలో ఫ్లషింగ్కు కారణం కావచ్చు.
- నరాల సమస్యలు: ఆందోళన, పార్శ్వపు నొప్పి తలనొప్పి, మరియు సాధారణ కణితులు వంటి సమస్యలకి దారి తీయవచ్చు.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
చాలా మందిలో చర్మం ఎర్రబారడం (ఫ్లషింగ్) యొక్క కారణం తెలుసుకోవడం కోసం ప్రత్యేక నిర్ధారణ అవసరం లేదు. సిస్టమిక్ రుగ్మత (శరీరంలో చాలా/మొత్తం అవయవాలను ప్రభావితం రుగ్మత) ఏదైనా చర్మం ఎర్రబారడానికి (ఫ్లషింగ్) కారణమని వైద్యులు అనుమానించినట్లయితే, వారు పూర్తి ఆరోగ్య పరీక్షను నిర్వహిస్తారు, మరియు క్రింది పరీక్షలను ఆదేశిస్తారు:
- రక్త పరీక్ష
- 24-గంటల మూత్ర పరీక్ష (24-hour urine test)
- ఛాతీ ఎక్స్-రే వంటి ఇమేజింగ్ పరీక్షలు
ఫ్లషింగ్ను నిర్వహించడానికి వైద్యులు ఈ క్రింది చికిత్స సూచిస్తారు:
- తెలిసిన కారణాల వలన చర్మం ఎర్రబారడం (ఫ్లషింగ్): ఆహారం మరియు మద్యం వలన ఫ్లషింగ్ సంభవిస్తుంటే, అటువంటి తెలిసిన కారకాలను తీసుకోవడం మానివేయడం లేదా తగ్గించడం చెయ్యాలి.
- ఔషధాల/మందుల కారణంగా చర్మం ఎర్రబారడం (ఫ్లషింగ్): ఫ్లషింగ్ కు కారణమయ్యే మందులను పూర్తిగా ఆపివేయాలి లేదా తగ్గించాలి.
- ఒక నిర్దిష్ట కారణం వలన చర్మం ఎర్రబారడం (ఫ్లషింగ్): కారణం మీద ఆధారపడి ఒక నిర్దిష్ట చికిత్స అవసరమవుతుంది. ఉదాహరణకు: మెనోపాజ్ (రుతువిరతి) వల్ల చర్మం ఎర్రబారుతుంటే క్లోనిడైన్ (clonidine) మరియు నలోక్సోన్ (naloxone) వంటి మందులను ఇవ్వడం జరుగుతుంది.
వైద్యులు కూడా బీటా-బ్లాకర్లని కూడా సూచించవచ్చు, ఎందుకంటే ఇవి రక్తనాళాల సంకోచానికి కారణమవుతాయి మరియు చర్మం ఎర్రబారడాన్ని తగ్గిస్తాయి.