వేళ్ళ గోళ్ళకి గాయం - Fingernail Injury in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 30, 2018

July 31, 2020

వేళ్ళ గోళ్ళకి గాయం
వేళ్ళ గోళ్ళకి గాయం

వేళ్ళ గోళ్ళకి గాయం అంటే ఏమిటి?

వేళ్ళ గోర్లకి గాయం అంటే  వ్రేళ్ళగోళ్ళ యొక్క బాహ్య (బయటి) గాయాన్ని సూచిస్తుంది, ఇది గోళ్ళ యొక్క ఆకృతి మరియు పనితీరును మార్చివేస్తుంది. పని ప్రదేశంలో మొండి పని చేయడం వలన కానీ, అతిగా పెరిగిన గోళ్లు వలన కానీ, లేదా అధికంగా గోళ్లను కొరికడం వలన కానీ  ఈ గాయం ఏర్పడుతుంది. గోర్లు యొక్క స్వీయ సంరక్షణ ఈ గాయాలు నివారించవచ్చు. ఈ గోళ్ళ గాయాలు రోజువారీ పనులకు ఆటంకాలు కలిగిస్తాయి.

దీని ప్రధాన సంబంధం సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వేళ్ళగోళ్ళ గాయాలకు సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

  • గోరు కింద రక్తం పేరుకుపోవడం వలన, గోరు నీలం లేదా నలుపు రంగులోకి మారడం
  • నిరంతర నొప్పి
  • జ్వరం
  • గోరులో సలుపుతో కూడిన నొప్పి
  • గోర్ల పగుళ్లు
  • వాపు
  • అప్పుడప్పుడూ రక్తస్రావం కావడం
  • కొన్ని సార్లు చీము ఏర్పడటం

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

వేళ్ళ గోళ్ళ గాయాలకు కొన్ని అత్యంత సాధారణ కారణాలు

  • కత్తిరించని పొడవైన గోర్లు
  • కమిలిన గాయాలు
  • అధికంగా గోర్లను కొరకడం
  • చర్మంపై పోరను కొరకడం
  • బాక్టీరియా లేదా వైరస్ సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు)

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వేళ్ళ గోళ్లకు గాయం అయినప్పుడు, ప్రభావిత వేలు యొక్క గోరు వెంటనే కొన్ని లక్షణాలను చూపిస్తుంది.

వైద్యులు  వేలి గోర్ల లేదా బొటనవేలి గోరు యొక్క గాయాన్ని బౌతికంగా పరిశీలిస్తారు. అంతర్లీన నరములకు లోతైన గాయం తగిలినప్పుడు మాత్రమే రక్త పరీక్షలు మరియు ఇమేజింగ్ పరీక్షలు అవసరమవుతాయి. వైద్యులు అప్పుడు సంక్రమణ (ఇన్ఫెక్షన్) చికిత్స కోసం నొప్పి నివారిణులు మరియు యాంటీబయాటిక్స్ సూచిస్తారు.

నొప్పి తగ్గించడానికి కొన్ని సాధారణ విధానాలు:

  • దుమ్ము లేదా సంక్రమణను కలిగే సూక్ష్మజీవులను తొలగించడానికి చల్లని పారె నీటితో (రన్నింగ్ వాటర్) కడుక్కోవాలి
  • ఐస్ ప్యాక్ - నొప్పి ఉపశమనం కోసం ప్రతి కొన్ని గంటలకొకసారి  ఒక 20 నిమిషాల పాటు ఐస్ ప్యాక్ ను ఉపయోగించాలి. రక్తస్రావం మరియు నొప్పి తగ్గించడం అలాగే వాపును  నివారించడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రథమ చికిత్స.
  • కంప్రెషన్ థెరపీ
  • స్టెరాయిడ్ కాని  మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులను వాడాలి

వేళ్ళ గోళ్ళ గాయాలను నివారించడానికి కొన్ని సమర్థవంతమైన మరియు సులభమైన మార్గాలు:

  • గోర్లను సరిగా కత్తిరించి ఉంచాలి
  • గోర్లును మరియు గోళ్ళ పై ఉండే చర్మ పొరను కొరకకూడదు
  • ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు భారీ యంత్రాలతో పని చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Nail Trauma
  2. Bharathi RR, Bajantri B. Nail bed injuries and deformities of nail. Indian J Plast Surg. 2011 May-Aug;44(2):197-202. PMID: 22022029
  3. Tos P, Titolo P, Chirila NL, Catalano F, Artiaco S. Surgical treatment of acute fingernail injuries. J Orthop Traumatol. 2012 Jun;13(2):57-62. PMID: 21984203
  4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Nails - fingernail and toenail problems
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Wounds and Injuries