సారాంశం
ऑफर - Urjas Oil सिर्फ ₹ 1 में X
సారాంశం
ఫ్యాటీ లివర్ వ్యాధి రెండు ప్రధాన రకాలు:
మద్యపానేతర (నాన్ ఆల్కహాలిక్) కాలేయ వ్యాధి (NAFLD)
మద్యపానేతర కాలేయ వ్యాధి-NAFLD, కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం వల్ల వస్తుంది గాని దీనికీ, మద్యం అధికంగా తీసుకోవడానికి సంబంధం లేని జబ్బు ఇది. మద్యపానేతర కాలేయవ్యాధి రెండు రకాలుగా ఉంటుంది:
సాధారణ కాలేయ వాపు
ఈ సాధారణ కాలేయ వాపు రకంలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఉండే పరిస్థితి ఉంటుంది, కానీ, కాలేయ కణాలకు ఎలాంటి హాని ఉండదు. ఇలా కొవ్వు చేరడం వలన ఎటువంటి వాపు గాని, మంట గాని ఉండదు. ఈ పరిస్థితి సాధారణంగా కాలేయానికి ఎటువంటి హాని కలిగించదు మరియు ఎలాంటి సమస్యలను తెచ్చి పెట్టదు.
నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)
ఈ రకం కాలేయ వాపు స్థితిలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది, ఇంకా వాపు, కాలేయ కణాలకు నష్టం వాటిల్లుతుంది. వాపు, నొప్పితో కూడిన మంట మరియు కాలేయ కణ నష్టం అనేక ఇతర సమస్యలను కలిగిస్తాయి. ఆ ఇతర ఆరోగ్య సమస్యలేవంటే కాలేయంలో వ్యాప్తి చెందే తంతీకరణం (fibrosis), మచ్చలు, ప్రాణాంతక కాలేయ వ్యాధి (cirrhosis) మరియు కాలేయ క్యాన్సర్ వంటివి. (మరింత సమాచారం: సీస్టిక్ ఫైబ్రోసిస్ చికిత్స)
మద్యపాన కాలేయ వాపు వ్యాధి
మద్యపాన కాలేయ వాపు వ్యాధి (Alcoholic fatty liver disease) మద్యం అధికంగా తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. మద్యం కాలేయంలో విచ్ఛిన్నం అవుతుంది మరియు కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన హానికారక పదార్థాలు కాలేయ కణాలను దెబ్బ తీస్తాయి మరియు వాపును ఎక్కువ చేస్తాయి. ఫలితంగా, శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థ నెమ్మదిగా బలహీనపడుతుంది. ఒక వ్యక్తి మితానికి మించి మరింత మద్యం సేవించడం కొనసాగినప్పుడు, కాలేయనష్టం పెరుగుతుంది.
కాలేయ వాపు వ్యాధి ఒక నిశ్శబ్ద వ్యాధి మరియు ఏ ముఖ్యమైన లక్షణాలను బయటికి కనిపించనీయదు. సాధారణ అలసట మరియు పొత్తికడుపు ఎగువ కుడి భాగంలో కొంచెం అసౌకర్యం కలుగజేసే స్థితి ఈ వ్యాధి ఉన్న వ్యక్తిలో ఉండవచ్చు. ఈ వ్యాధి వచ్చిందని గుర్తించేందుకు ఎక్కువమందిలో ఈ వ్యాధి లక్షణాలు గమనించదగ్గవిగా కానరావు.
అయితే దీన్ని ఎపుడు గుర్తించవచ్చు అంటే వాపుతో కూడిన మంట మరియు కాలేయానికి నష్టం సంభవించినపుడు వాచిన కాలేయం సంకేతాలను చూపుతుంది, అప్పుడు మాత్రమే వ్యాధి పరిస్థితి లక్షణాలతో స్పష్టంగా కనబడుతుంది. అప్పటికే, ఈ లక్షణాలు “సిర్రోసిస్” పరిస్థితికి దారి తీసి ఉంటుంది. సిర్రోసిస్ అంటే కాలేయం యొక్క కణాల క్షీణత ఏర్పడి చెరిపేయలేని మచ్చలతో నష్టం కలగడమే. ఇది కామెర్లను పోలి ఉంటుంది. ఇది ప్రాణాంతకమైన కాలేయ వ్యాధి. చర్మం మరియు కన్నుల్లోని తెల్ల కనుగుడ్లు వ్యాధి ఉనికిని సూచించే పసుపు రంగులోకి మారవచ్చు. రోగిలో కాలేయం దెబ్బతిన్నదన్న దానికి మరొక సంకేతం “జలోదరం ” మరియు “ఎడెమా”, అనే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బ తినడంతో పాటు శరీరం యొక్క కణజాలంలో అసాధారణంగా ద్రవాలు చేరడం సంభవించిందన్నమాట.
భౌతిక పరీక్ష సమయంలో మీ డాక్టర్ కాలేయం బిర్ర బిగుసుకుపోయి ఉండడాన్ని గమనించవచ్చు. కాలేయం ఇలా బిర్రబిగుసుకు పోవడమనేది కాలేయం యొక్క “ఫైబ్రోసిస్” స్థితిని సూచిస్తుంది. ఈ స్థితిలో కాలేయంపై మచ్చలు కనబడవచ్చు.
కాలేయం దెబ్బతిన్న వ్యక్తికి కాలేయంలోనే కమిలిన గాయాలు ఎక్కువవడం జరిగి మానసిక గందరగోళాన్ని పెంచవచ్చు.
కారణాలు
మితం మించి మద్యపానం చేయడమే “మద్యపాన కాలేయ వాపు వ్యాధి” కి గల ప్రధాన కారణాలలో ఒకటి. మద్యం శరీరంలోనికి ప్రవేశించాక ‘శరీరజన్య విషం’గా మారి కాలేయం వాపుకు, మంటకు కారణమవుతుంది. కాని మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు (Non-alcoholic fatty liver disease-NAFLD)కు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. కాలేయంలో కొవ్వు కణాలు పోగటానికి ఎన్నో కారణాలు. ఈ కారణాల్లో ఎదో ఒక కారణం వల్ల మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు-NASH దాపురించవచ్చు.
ప్రమాద కారకాలు
మద్యపానేతర కాలేయ వ్యాధి (NAFLD)కి ఖచ్చితమైన కారణం తెలియదు. కొన్ని వైద్య పరిస్థితులు మరియు నిర్దిష్ట జాతి నేపథ్యాలతో ఉన్నవారు కాలేయ వాపుకు ఎక్కువగా గురయ్యే పరిస్థితి ఉంది, అంతే గాక ఈ వ్యాధి వారికి మరింత ఎక్కువగా దాపురించే ప్రమాదముంది. రెండో రకం మధుమేహం (Type 2 diabetes) లేదా ప్రీ-డయాబెటీస్ స్థితి, ఊబకాయం, వయసు మళ్లినవారు, రక్తంలో ట్రైగ్లిజెరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ వంటి అధిక స్థాయి కొవ్వు, అధిక రక్తపోటు, కొన్ని క్యాన్సర్ మందులు, హెపటైటిస్-సి వంటి అంటురోగాలు మరియు శరీరజన్య విషపదార్థాలకు గురికావడం వంటి పరిస్థితులు కాలేయవాపు వ్యాధికి దగ్గరయ్యే అవకాశాలను పెంచుతుంది.
కాలేయ వాపు వ్యాధికి ఒక నిర్దిష్టమైన వైద్య చికిత్స లేదా శస్త్రచికిత్స అంటూ లేదు. కానీ, ఈ కాలేయ వాపు వ్యాధికి గురైన వ్యక్తి తగిన నివారణా చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించి కొంత వరకు వాపును బాగు చేసుకోవచ్చు. మద్యపానేతర కాలేయ వ్యాధికి చెందిన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్-NASH (కామెర్లు) తో బాధపడుతున్నవారు ఈ నివారణా చికిత్స తీసుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
కాలేయ వాపు వ్యాధిని ఆపడానికి, ఇంకనూ వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించడానికి సహాయపడే చర్యలు కింది విధంగా ఉన్నాయి:
కాలేయ వాపు వ్యాధి నిర్ధారణకు ఎలాంటి నిర్దిష్ట లక్షణాలు లేనందున వైద్యుడు మీ రక్తపరీక్ష పరిశీలనలో ఏదైనా విలక్షణమైనదాన్ని గమనించినట్లయితే గాని లేక పరిమాణం పెరిగిన కాలేయమును గమనిస్తే గాని ఈ వ్యాధి రోగికున్నట్లు యాదృశ్చికంగానే బయట పడుతుంది. అటువంటి సందర్భాల్లో డాక్టర్ కాలేయ వాపు వ్యాధి యొక్క ఉనికిని పసిగట్టినపుడు కొన్ని రక్త పరీక్షలు, కాలేయ పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఒక CT స్కాన్ లేదా ఒక MRI ను మీ కాలేయ స్థితిని నిర్ధారించడానికి గాను సూచించవచ్చు.
మీకు చేసిన అనేక పరీక్షలు మీకు ఎలాంటి ఇతర కాలేయ వ్యాధులు లేవని సూచిస్తూ ఉండగా మీరు మద్యపానేతర స్టీటోహెపటైటిస్ (NASH) లేక కామెర్లతో బాధపడుతున్నారని మరో పరీక్ష తేల్చవచ్చు. ఒక్క కాలేయ జీవాణుపరీక్ష మాత్రమే వ్యాధిని నిర్ధారించగలదు. కాలేయం జీవాణుపరీక్షలో, కాలేయ కణజాలం యొక్క ఒక చిన్న నమూనా తొలగించబడుతుంది మరియు దాన్ని సూక్ష్మదర్శిని క్రింద వైద్యుడు పరిశీలిస్తాడు. డాక్టర్ కాలేయ వాపు వ్యాధి అని అనుమానిస్తే, మీనుండి ఒక వివరణాత్మక వైద్య చరిత్రను అడిగి తెలుసుకుంటాడు. మరియు మీకు మద్యంపానం అలవాటుంటే దాని గురించి మరియు ఏవైనా మందులసేవనం వల్ల సమస్యను కల్గించి ఉంటె దాన్ని గుర్తించడానికి మీరు తీసుకున్న మందులు గురించి డాక్టర్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు.
రోగికి దాపురించిన కాలేయ వాపు వ్యాధి యొక్క రకాన్ని బట్టి ఆ వ్యాధి నిర్వహణ క్రింది విధంగా ఉంటుంది:
మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (Non-alcoholic Fatty Liver Disease ,NAFLD)
మద్యపానేతర కామెర్ల జబ్బు (NASH)కు గాని లేదా మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD)కి గాని ఎటువంటి స్థిరమైన మందులు లేవు.
మద్యపాన కాలేయ వాపు వ్యాధి
జీవనశైలి నిర్వహణ
మీరు కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్నట్లు పరీక్షల ద్వారా నిర్ధారణ అయితే, మీరు మీ దిననిత్యచర్యల్లో కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ పరిస్థితి మెరుగై మరింత ప్రభావవంతంగా జీవితాన్ని నిర్వహించడానికి వీలుంటుంది. అలాంటి జీవనశైలి మార్పులు కొన్ని ఏవంటే:
కాలేయ వాపు వ్యాధి ఉపద్రవాలు మరియు రోగ నిరూపణ
రోగనిరూపణ
ఆరోగ్యకరమైన కాలేయానికి తనకు తానుగా (స్వయంగా) నయం చేసుకోగల గొప్ప సామర్ధ్యం ఉంటుంది, ఒకవేళ గాయపడినట్లయితే తిరిగి కోలుకుంటుంది, మరియు పునరుత్పత్తి కూడా చేసుకోగలదు. కాలేయ వాపు వ్యాధికి సకాలంలో రోగనిర్ధారణ జరిపి వెనువెంటనే చికిత్స చేసినట్లయితే కాలేయానికి అయిన హాని రూపుమాపబడి, రోగం మాయమైపోయి మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఇది అనేకమంది రోగుల విషయంలో నిరూపితమైంది. మనిషిలో కాలేయం దెబ్బ తినిందనడానికి మంట మరియు తంతీకరణం (ఫైబ్రోసిస్) అనేవి తొలి లక్షణాలు. ఈ ప్రారంభ దశలోనే కాలేయ వాపు వ్యాధి రోగ నిర్ధారణ అయినట్లయితే, మీ కాలేయం కొంతకాలంలోనే తనకు తానుగా నయం చేసుకోగలదు. ఇలా మన కాలేయం తనకు తానుగా రోగనయం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహార మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం తక్కువగా ఉన్నట్లైతే తంతీకరణం (Fibrosis) తీవ్రంగా పెరిగిపోయి ప్రాణాంతక కాలేయ వ్యాధి (cirrhosis)గా రూపాంతరం చెందుతుంది. కాలేయ వ్యాధి సిర్రోసిస్ దశలోకొచ్చినపుడు కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ దశలో వ్యాధికి చేపట్టే చికిత్స యొక్క లక్ష్యమంతా కొద్దిగా మిగిలున్న ఈ ఆరోగ్యకరమైన కాలేయకణజాలాన్ని రక్షించి వ్యాధి పురోగతిని నిలిపివేయడం పైన్నే ఉంటుంది.
ఉపద్రవాలు
కాలేయ వాపు వ్యాధి యొక్క ముగింపు దశ కాలేయ వైఫల్యం (liver failure). కాలేయ వైఫల్యం ప్రాణాంతకమైన కాలేయ వ్యాధి లేదా సిర్రోసిస్ కారణంగా లేదా పోషకాహారలోపం కారణంగా సంభవిస్తుంది. కాలేయ వైఫల్యం సిర్రోసిస్ వల్ల సంభవించినట్లయితే, కాలేయ వైఫల్యం నెమ్మదిగా ఉంటుందని వైద్యులంటారు. ఈ దశలో కాలేయపు పనితీరు నెమ్మదిగా, అంటే సంవత్సరాల తరబడి, క్షీణిస్తుంది. పోషకాహార లోపము వలన సంభవించే కాలేయ వైఫల్యం అకస్మాత్తుగా ఉంటుంది, అంటే కేవలం 48 గంల్లోపలే సంభవించవచ్చు. ఇటువంటి దశలో రోగికి కాలేయ మార్పిడి ఒక్కటే చికిత్స.
నేటి రోజుల్లో ఊబకాయం మరియు మధుమేహం అనేవి మనుషుల్లో పెరుగుతున్న కారణంగా మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) అనేది సామాన్యమైపోతోంది. ఈ వ్యాధి భారతీయ జనాభాలో 9% నుండి 32% మందిని బాధిస్తోంది. ముఖ్యంగా ఊబకాయులు మరియు చక్కెరవ్యాధి (డయాబెటిక్) రోగులైన జనాభాకు మద్యపానేతర కాలేయ వాపు దాపురిస్తోంది. ఈ వ్యాధి వయసుపైబడ్డ వారిలో సాధారణం. భారతీయ జనాభాపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలిందేమంటే, 61.8% మంది మద్యపానేతర కాలేయ వాపుబారిన పడ్డారని, ఈ రోగులందరూ 61 నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్నారని. మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి యొక్క నిర్వహణ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్న ఊబకాయులకైతే బరువు తగ్గించమని, శారీరక వ్యాయామాలను చేపట్టమని మరియు ఆహార మార్పులను అలవర్చుకొమ్మని, ఇంకా పలు జీవనశైలి మార్పులను వైద్యులు సాధారణంగా సిఫార్సు చేస్తారు. ఈ పరిస్థితికి సిఫార్సు చేసిన మందులు ఏవీ లేవు. అంతవరకూ వ్యాయామం జోలికెళ్లని ఈ వ్యాధి రోగులు ఏమాత్రం శారీరక వ్యాయామం చేసినా వారి పరిస్థితిలో ప్రయోజనకరమైన ప్రభావం రావడం కనబడింది. ఇంకా, ఏరోబిక్ వ్యాయామాలు, మరియు వ్యాధినిరోధకతలో శిక్షణ లేక ‘శక్తి శిక్షణ’ కూడా మద్యపానేతర కాలేయ వాపు రోగులకు సహాయకారిగా ఉంటాయి.
కాలేయవాపు వ్యాధి (లేక Fatty Liver Disease) అంటే ఏమిటి?
మానవుడి శరీరంలో కాలేయం అనేది చాలా పెద్ద అంతర్గత అవయవాల్లోఒకటి. కాలేయం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు, శరీరం నుండి శరీరజన్యవిషాన్ని మరియు ఇతర విషాల్ని తీసివేసి, మన శరీరంలో శక్తిని నిల్వ చేయడానికి మనకు సహాయపడుతుంది. కాలేయంలో కొవ్వు క్రమంగా నిర్మాణమవడమే “కాలేయ వాపుకు దారి తీస్తుంది. మన కాలేయంలో సాధారణంగానే కొంత కొవ్వు ఉంటుంది అయితే ఇది ఎటువంటి వ్యాధి లక్షణాలను ఉద్భవించనీయదు. అయితే, కాలేయంలో ఉండే కొవ్వుకు తోడు అధికంగా కొవ్వు పేరుకుంటూ పోవడం కాలేయ వాపుకు దారితీస్తుంది. ఈ పరిస్థితినే “కాలేయ వాపు వ్యాధి” గాను, “ఫాటీ లివర్ వ్యాధి” అని పిలువ బడుతుంది.
Medicines listed below are available for ఫ్యాటీ లివర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.
Medicine Name
Price
Number of tests are available for ఫ్యాటీ లివర్. We have listed commonly prescribed tests below: