ఇవింగ్ సార్కోమా అంటే ఏమిటి?
ఇవింగ్ సార్కోమా అనేది ప్రధానంగా ఎముకలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. ఆస్టియోసార్కోమా (osteosarcoma) తర్వాత చాలా తరచుగా సంభవించే ఎముక క్యాన్సర్లలో ఇది రెండోరకం. పిల్లలు మరియు యుక్తవయస్కుల వారు ఎక్కువగా ప్రభావితమయ్యారు. యునైటెడ్ స్టేట్స్ లో, దీని సంభవనం ఒక మిలియన్ మందికి 1గా ఉంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నొప్పి మరియు ద్రవం చేరడం అనేవి ప్రధాన లక్షణాలు. అలాగే ఎముక ఫ్రాక్చర్ యొక్క ప్రమాదం కూడా ఉంది. ఇతర లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:
- కారణం లేకుండా శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం
- అలసినట్లు అనిపించడం
- ప్రత్యేకంగా చంకలు, కాళ్ళ, ఛాతీలో, లేదా కటి ప్రాంతంలో చిన్న చిన్న బుడిపెలు ఏర్పడడం
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
అసలు కారణం తెలియదు; అయినప్పటికీ, ఇది జన్యుపరంగా సంక్రమిస్తుంది. దీనికి రెండు జన్యువులు కారణమవుతాయి, అవి:
- నెంబర్ 22 క్రోమోజోమ్ లో EWSR1 (EWSR1 on number 22 chromosome)
- నెంబర్ 11 క్రోమోజోమ్ లో FLI1 (FLI1 on number 11 chromosome)
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
నిర్దారణ ప్రక్రియ ప్రధానంగా వీటిని కలిగి ఉంటుంది:
- పూర్తిగా రోగిని పరిశీలించడం మరియు ఆరోగ్య చరిత్రను తీసుకుకోవడం
- ఇమేజింగ్:
- ఎంఆర్ఐ (MRI) స్కాన్
- సిటి (CT) స్కాన్
- పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (Positron emission tomography, PET) స్కాన్
- ఎముక మజ్జ:
- ఆస్పిరేషన్ (Aspiration)
- జీవాణుపరీక్ష (బయాప్సి)
-
సి-రియాక్టివ్ ప్రోటీన్ (C- reactive protein), ఎరథ్రోసైట్ సెడిమెంటేషన్ రేటు (erythrocyte sedimentation rate) వంటి రక్త పరీక్షలు
చికిత్స వీటిని కలిగి ఉంటుంది:
- కీమోథెరపీ
- రేడియేషన్ థెరపీ
- శస్త్రచికిత్స
క్యాన్సర్ తరచుగా పునరావృత్తమవుతుంటే, స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇతర చికిత్సలలో ఇవి ఉంటాయి:
- మోనోక్లోనల్ యాంటిబాడీస్ (monoclonal antibodies) యొక్క ఉపయోగం
- యాంటిజెన్-టార్గెటింగ్ ఇమ్యునోథెరపీ (Antigen-targeting immunotherapy)
మనుగడ శాతం క్యాన్సర్ యొక్క దశ మరియు కణితి యొక్క పరిమాణం, లాక్టేట్ డీహైడ్రోజినేస్ (lactate dehydrogenase,LDH) స్థాయిలు, చికిత్సకు సహనత్వం మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారు వంటి ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది.
చికిత్స యొక్క పురోగతి కోసం సూచించిన చికిత్స షెడ్యూల్లను (పట్టికలను) వెంటవెంటనే పాటించడం ఉత్తమం. చికిత్స యొక్క ప్రాధమిక దశ పూర్తి అయిన సాధారణంగా 2-3 నెలల తరువాత కాన్సర్ యొక్క దశను అంచనా వేయడానికి అన్ని పరీక్షలు మళ్ళి జరపవలసిందిగా ఆదేశించబడవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత కూడా మరలా ఈ కణితులు సంభవించే అవకాశం ఉంది.
రోగికి ఎమోషనల్ సహకారం (emotional support) అందించడం ముఖ్యం.